ఈ రాశుల వారు అనారోగ్యాలకు కేరాఫ్ అడ్రస్

Written By:
Subscribe to Boldsky

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కొందరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడితే మరికొందరు చిన్నచిన్న అనారోగ్యాలకు గురవుతుంటారు. అయితే మీ రాశి బట్టీ కూడా మీరు కొన్ని రకాల అనారోగ్యాలకు నిత్యం గురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా రాశుల ప్రకారం భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు ఫలానా రాశి వారు అనారోగ్యానికి గురవుతారని చెబుతుంటారు. కానీ ఆయా రాశులను బట్టీ వారు ఎలాంటి అనారోగ్యాలకు తరుచూ గురయ్యే అవకాశం ఉందో తెలుసుకోండి.

మేషరాశి

మేషరాశి

మేషరాశి వారు తల,మెదడుకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ రాశివారు దేనినైనా సాధిస్తామనే నమ్మకంతో ఉంటారు. అందువల్ల ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. దీంతో కొన్ని రకాల అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా తలనొప్పి, దంత సమస్యలు, దవడకు సంబంధించిన గ్రౌండింగ్, మరియు కూడా ముఖం వంటి సమస్యలు కారణం కావచ్చు.

వృషభం

వృషభం

వృషభరాశి వారు గొంతు, మెడ, చెవులు, ముక్కు, దంతాలు, వినికిడికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులుపడతారు. అలాగే వీరు జలుబుతో నిత్యం ఇబ్బందులు పడతారు. అలాగే గొంతుకు సంబంధించిన వ్యాధులకు నిత్యం గురవుతుంటారు.అలాగే వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే థైరాయిడ్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీరు ఎక్కువగా చెవికి సంబంధించినఇన్ఫెక్షన్లకు గురై అవకాశం ఉంది.

మిథునరాశి

మిథునరాశి

మిథునరాశి వారు ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. అలాగే సాధారణ జలుబు, దగ్గువంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాగే వీరు ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది. వీరి నోటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపరు కాబట్టి నోటి దుర్వాసన కూడా వీరి నుంచి ఎక్కువగా వస్తుంది.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటకరాశి వారు ఎక్కువగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. వీరు అప్పుడప్పుడు కడుపునొప్పికి కూడా గురవుతుంటారు. వీరు ఎక్కువగా కోపాన్ని కూడా నియంత్రించుకోలేరు. వీరు అజీర్తి, పేగులకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులుపడుతుంటారు.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీరు రక్తపోటు, రక్తహీనతతో కూడా బాధపడే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అందువల్ల వీరు ఇలాంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే వీరు వెన్నుముకకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడే అవకాశం ఉంది.

కన్యరాశి

కన్యరాశి

కన్యరాశి వారు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వీరికి జీర్ణక్రియ శక్తి ఎక్కువగా ఉండదు. దీంతో బాడీలో ఫ్యాట్ పెరిగి ఊబకాయం బారినపడతారు. అలాగే వీరు మలబద్ధకం, ఫుడ్ అలెర్జీల బారిన కూడా పడతారు.

తులరాశి

తులరాశి

తులరాశి వారు కూడా ఎక్కువగా జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో కూడా బాధపడతారు. అలాగే వీరు సంతానోత్పత్తికి సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బందులుపడతారు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చికరాశి వారు జన్యుసంబంధిత వ్యాధుల బారిన పడతారు. అలాగే వీరు హార్మోన్ల సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే బ్లాడర్ ఇన్ ఫెక్షన్ బారిన కూడా పడతారు. మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. ఇక మహిళలు రుతుస్రావం సమయంలో ఎక్కువగా నొప్పికి గురవుతారు.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశి వారు కంటి చూపు, తొడలు, తుంటి నొప్పులు, కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారినపడతారు. అలాగే వీరు అధిక బరువు సమస్య, కాలేయానికి సంబంధించిన సమస్యల బారిన కూడా పడతారు.

మకరం

మకరం

మకరరాశి వారు ఎక్కువగా ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడతారు. వీరి శరీరంలో ఎముకలు అంత గట్టిగా ఉండవు. అందువల్ల వీరు ఎముకలు గట్టిపడేలా మంచి ఆహారాలు తీసుకోవాలి. అలాగే వీరు జుట్టు రాలిపోవడం వంటి సమస్యతో కూడా ఇబ్బందిపడతారు.

కుంభం

కుంభం

కుంభరాశి వారు చేతులు, కాళ్ల నొప్పులతో ఇబ్బందులుపడతారు.

అలాగే వీరు ఆర్థరైటిస్, గుండె సమస్యల బారిన పడతారు. అలాగే కాళ్లు వాపుకు గురవడం, లింబ్స్ వాపుకు గురవడం వంటి అనారోగ్యాల బారిన పడతారు. వీరు ఆస్తమాకు కూడా గురయ్యే అవకాశం ఉంది.

మీనం

మీనం

మీనరాశి వారు ఎక్కువగా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యతో ఇబ్బందిపడతారు. అలాగే వీరిలో రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు అనేక రోగాల బారిన పడే అవకాశ ఉంది.

English summary

possible health issues related to your zodiac sign

possible health issues related to your zodiac sign
Subscribe Newsletter