కొడుకు వీర్యంతో తనే పిల్లల్ని కనాలనుకుంది.. చివరకు తన కోరిక నెర్చవేర్చుకుంది

Written By:
Subscribe to Boldsky

కన్న కొడుకు తల్లి కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లి విలవిలలాడిపోయింది. అయితే తన కొడుకు జ్ఞాపకాలను మాత్రం పదిలపరుచుకుంది. చనిపోయిన కన్నకొడుకే తిరిగి వచ్చినంతగా ఆమె ఆనందం చెందుతోంది.

రాజశ్రీ పాటిల్‌ తన కొడుకు పరిస్థితి చూసి

రాజశ్రీ పాటిల్‌ తన కొడుకు పరిస్థితి చూసి

ఆమెది పూణె. ఆమె పేరు రాజశ్రీ పాటిల్‌. ఆమె కొడుకు పేరు ప్రథమేష్. ప్రథమేశ్ చాలా రోజులు క్యాన్సర్‌ తో బాధపడ్డాడు. కళ్ల ముందు కొడుకు పరిస్థితిని చూసి రాజశ్రీ తల్లడిల్లిపోయింది. క్యాన్సర్ నుంచి తన కొడుకుని రక్షించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది.

కొడుకు జ్ఞాపకాలను ఉంచుకోవాలనుకుంది

కొడుకు జ్ఞాపకాలను ఉంచుకోవాలనుకుంది

ఒక వేళ క్యాన్సర్‌ వల్ల తన కొడుకు దూరం అయినా తన వద్దే తన కొడుకు జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనుకుంది. క్యాన్సర్ వల్ల తన కుమారుడు చనిపోతాడనే విషయం డాక్టర్లు చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేదన్నారు.

ప్రథమేష్ కు పెళ్లి కాలేదు

ప్రథమేష్ కు పెళ్లి కాలేదు

క్యాన్సర్‌ ఒక్కసారిగా తిరగబడింది. ప్రథమేష్‌ 2016లో మరణించాడు. అప్పటికి అతనికింకా పెళ్లి కూడా కాలేదు. కొడుకంటే అతని తల్లి రాజ్‌ శ్రీ పాటిల్‌కు విపరీతమైన ప్రేమ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది.

Image Source :http://www.dailymail.co.uk/news/article-5396351/The-grieving-mum-wanted-dead-sons-kids.html

ఆ విషయం గుర్తొచ్చింది

ఆ విషయం గుర్తొచ్చింది

ఆ సమయంలో తల్లి రాజశ్రీ పాటిల్‌ కు ఒక విషయం గుర్తొచ్చింది.

ప్రథమేష్‌ పాటిల్‌ అంతకు ముందు పైచదవుల కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడ 2013లో ఏదో ఆరోగ్య సమస్యతో పరీక్షలు చేయించుకుంటే అతనికి బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించాలన్నారు.

ప్రథమేష్ వీర్యాన్ని సంపాదించాలనుకుంది

ప్రథమేష్ వీర్యాన్ని సంపాదించాలనుకుంది

ఈ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న డాక్టర్లు అతడి అనుమతితో వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. అలా దాచిన ప్రథమేష్ వీర్యాన్ని ఎలాగైనా సరే సంపాదించి దాని ద్వారా పిల్లల్ని కనాలనుకుంది.

వీర్యాన్ని తెప్పించారు

వీర్యాన్ని తెప్పించారు

వెంటనే పుణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఈ విషయం తెలియజేసింది. ఆమె సాయంతో జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తెప్పించారు వైద్యులు

అండాలు కూడా దొరికాయి

అండాలు కూడా దొరికాయి

ప్రథమేశ్ వీర్యం సేకరించాక... అండదాతల కోసం ఆస్పత్రి వైద్యులు గాలించారు. వారి రంగు, ముఖ చిత్రాలకు సరిపోలే మహిళ అండాన్ని సేకరించి అతడి వీర్యం ద్వారా నాలుగు పిండాలను సృష్టించారు.

ఆమె సోదరి గర్భంలోకి

ఆమె సోదరి గర్భంలోకి

ఆ పిండాలను గర్భంలో మోసేందుకు ప్రథమేశ్‌ తల్లి రాజశ్రీ ముందుకొచ్చింది. ఆమె శరీరం అనుకూలించదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో రాజ్య శ్రీ సోదరి గర్భంలో రెండు పిండాలను ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇద్దరూ మగపిల్లలే

ఇద్దరూ మగపిల్లలే

కొన్ని రోజుల క్రితం ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారు. దీంతో ప్రథమేశ్ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) విధానం ద్వారా భద్రపరిచిన శుక్రకణాలు, ఓ మహిళ అండాన్ని కలిపి పిండాన్ని ఉత్పత్తి చేయడం చేసి దాన్ని సరోగసీ విధానంలో ఓ మహిళ గర్భంలో ప్రవేశపెట్టడం వల్లే రాజ్య శ్రీ కల నెరవేరింది.

చివరి శ్వాస వరకూ నవ్విస్తూ ఉండేవాడు

చివరి శ్వాస వరకూ నవ్విస్తూ ఉండేవాడు

తన కొడుకు చదువులో చాలా దిట్ట అని, అలాంటి తన కొడుకుకు బ్రెయిన్ కేన్సర్ అని తెలిసి కుమిలిపోయామని, కీమోథెరపీ తీసుకునేటప్పుడు అతడి చూపు కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది రాజశ్రీ. చూపు పోయినా అతడిలో ఆత్మస్థైర్యం మాత్రం చావలేదని, చివరి శ్వాస వరకూ తమనెప్పుడూ నవ్విస్తూ ఉండేవాడని చెప్పారు.

English summary

pune woman loses son to cancer his twins are born to a surrogate mother

pune woman loses son to cancer his twins are born to a surrogate mother
Story first published: Friday, February 23, 2018, 17:30 [IST]