For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రాశి చక్రంలోను ఎవరికీ అర్ధం కాని విషయాలు ఇవే..!

|

అనేకమందికి తమతమ రాశి చక్రాలకు సంబంధించిన అనేక విషయాల గురించిన సరైన అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రతి రాశి చక్రంలోనూ ఎవరికీ అర్ధం కాని కొన్ని విషయాలు కూడా ఉంటాయి. ఈ సందర్భాలలో, గందరగోళానికి గురవుతుంటారు కూడా.

జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ తమ అభద్రతా భావాలనుండి ఊరట లభించాలన్న ఆలోచన ఉంటుంది. ఇది సహజం. కానీ ప్రతి రాశి చక్రంలోని కొన్ని విభిన్న లక్షణాల మూలంగా, కొందరు చిన్న విషయాలను కూడా తీవ్రంగా ఆలోచిస్తూ జీవితంలో అస్తవ్యస్త పోకడలకు తావిస్తూ అర్ధం కాని పరిస్థితులకు కారణమవుతుంటారు. కానీ సరైన ఆలోచన, చుట్టుపక్కల పరిస్థితులు కొన్ని మార్పులను తీసుకుని రాగలవు.

మీ రాశి చక్రానికి తగ్గ లక్షణాలకు మీరు పూర్తిగా అంకితమై ఉంటే, రాశి చక్రంలోని ప్రతి కోణాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషరాశి వారు ఆత్మస్థైర్యాన్ని అధికంగా కలిగి ఉంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం

లేదు. అన్నిటా తామే ముందుండాలని, కుటుంబ సభ్యుల నుండి, తన ప్రియమైన వారి దాకా అందరికీ తానే ఒక దారి అవ్వాలన్న ఆలోచనను కలిగి ఉంటారు. ఒకరకంగా అధిక భాద్యతలు కలిగి ఉండడానికి సుముఖంగా ఉంటారు. అందరు తనని కలిగి ఉన్నందుకు గర్వపడాలన్న ఆలోచన వీరిది.

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి వారు ఎక్కువగా కుటుంబ భాద్యతలు కలిగి ఉండడానికి ఇష్టులై ఉంటారు. కుటుంబంలో కూడా వీరి పట్ల ఎనలేని గౌరవం ఉంటుంది. అలాంటి వీరు ఒక్కోసారి భాద్యతల నుండి విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. కానీ బయటకి మాత్రం అలుపెరుగని సైనికుడిలా కుటుంబం కోసం పాటుపడుతుంటారు. ఎటువంటి భాధలనైనా తనలోనే దిగమింగుకుంటూ అందరికీ ధైర్యాన్ని ఇచ్చేవారిగా ఉంటారు.

మిధునం : మే 21- జూన్ 20

మిధునం : మే 21- జూన్ 20

మిధున రాశి వారు గర్వాన్ని కలిగి ఉండరు. పైగా వీరు ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రియమైన వారి పట్ల అధిక శ్రద్ధను కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించే వీరు, సమస్యల పరిష్కారం దిశగా తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. వీరి మెదడు భావోద్వేగాల గని అంటే అతిశయోక్తి కాదు.

కర్కాటకం : జూన్ 21- జూలై 22

కర్కాటకం : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి వారు అందరికీ స్వార్ధ పూరిత లక్షణాలు కలిగిన వారిగా కనిపిస్తుంటారు. వాస్తవానికి వారు సహ్రుదయులుగా ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా సహాయం చేసే వీరు ఇతరుల సాయాన్ని తీసుకోవడంలో విముఖత ప్రదర్శిస్తుంటారు. ఈ వ్యక్తులకు, ప్రేమ అనేది వారి జీవితాలలో అత్యంత పవిత్రమైన విషయం. తమ ప్రియమైన వారి సంతోషంలోనే తమ సంతోషాన్ని చూసుకునే ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటారు.

సింహం : జులై 23-ఆగస్టు 23

సింహం : జులై 23-ఆగస్టు 23

సింహ రాశికి చెందిన వ్యక్తులు అధికమైన భావోద్వేగాలకు ఉద్వేగ పూరిత భావజాలాలకు ప్రసిద్దిగా ఉంటారు. తమను ప్రేమించే వ్యక్తుల పట్ల అధిక శ్రద్ద కనపరచే ఈ సింహ రాశి వారు, తమ భాగస్వాముల పట్ల నిబద్దతను ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి అంశంలోనూ తమకే విజయం వరించాలని తపించే సింహరాశి వారు, రాశి చక్రం ప్రకారం అన్నిటా కేంద్ర స్థానంలో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

సింహ రాశి వ్యక్తుల వలె, కన్యా రాశి వారికి కూడా జీవితంలో ఎదుగుదల పరంగా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు ఉంటాయి. ఈ వ్యక్తులు మిగిలిన అన్ని రాశిచక్రాలతో పోల్చి చూసినప్పుడు నిస్సందేహంగా తెలివైన రాశి చక్రంగా పరిగణించబడుతుందని చెప్పవచ్చు. వారి జీవితాలు ఉగాది పచ్చడిలా వర్ణించబడ్డాయి. ప్రణాళికా బద్ధమైన వీరి నిర్ణయాలు కుటుంబ ఎదుగుదలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశి వారు అత్యంత సున్నితమైన వ్యక్తులుగా ఉంటారు. మరియు మిగిలిన అన్ని రాశి చక్రాలతో పోల్చినప్పుడు అత్యంత నమ్మదగిన వ్యక్తులుగా కూడా ఉంటారు. వీరు కాస్త తెలివైన వాళ్ళగా ఉండడమే కాకుండా, సత్వర నిర్ణయాలు తీసుకుని అమలు పరచడంలో సిద్దహస్తులుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసాన్ని అంగీకరించని వ్యక్తిత్వం కలిగిన వీరు, ఎట్టి పరిస్థితుల్లో తమపై అపనిందని వేయడాన్ని సహించలేరు. మరియు వారి పట్ల ప్రతీకారేచ్చని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వీరి మనసులోని ప్రతి ఆలోచన తమ ప్రియమైన వారి గురించే ఉంటుంది.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు అన్ని రాశిచక్రాలలో అత్యంత సున్నితమైన వారిగా ఉంటారు. ఈ వ్యక్తులు వ్యక్తిగతంగా అనేక విషయాల గురించిన ఆలోచనలు చేస్తుంటారు. హాస్య చతురతని ఎంతగా ప్రదర్సిస్తుంటారో, పనియందు అసౌకర్యాన్ని అంతగా ఖండిస్తారు.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు వ్యక్తులు బయటకి ఉద్రేక పూరితంగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల భావోద్వేగాల్ని అధికంగా కలిగి ఉంటారు. ఇతరులు తమను బాధితులిగా చూడడానికి ఇష్టపడరు. సంబంధాలను నిలబెట్టుకోవడంలో కాస్త ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉంటారు. మాట కఠినంగా ఉన్నా, మనసు మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎవరైనా తమ పట్ల ప్రేమని చూపిస్తే, వారిపట్ల అత్యంత విధేయతను కనపరిచే వారిగా ఉంటారు.

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

ఇతరులతో తమ భావాలను పంచుకోడానికి భయాన్ని వ్యక్తపరచే ఈ రాశి వారు, ఒక వ్యక్తి పట్ల నమ్మకం ఏర్పరచుకునే ప్రయత్నంలో అనేక విధాలుగా పరీక్షలు పెట్టేవారిలా ఉంటారు. వీరిలోని కోప స్వభావం మనుషుల్ని దూరం చేస్తున్నా, తమ మొండి పట్టు వీడని వైఖరిని ప్రదర్శిస్తుంటారు.

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశి వారు అధికంగా ప్రేమ గురించిన తపన కలిగి ఉంటారు. అన్ని విషయాలు తమకు తెలిసిన మాస్టర్లుగా తమను భావించే వీరు, వాస్తవానికి అంతర్గతంగా కాస్త భయాన్ని కలిగి ఉంటారు. వారు గొప్ప శ్రోతలుగా ఉండడమే కాకుండా, ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చేవారిలా ఉంటారు. మరియు తమ పట్ల మోస పూరిత ఆలోచనలు చేసిన వారిని, లేదా వెన్నుపోటుకు గురిచేసిన వారిని జీవితంలో తిరిగి ఆహ్వానించడానికి సుముఖంగా ఉండరు. ఎంతగా ప్రేమిస్తారో, ద్వేషిస్తే పరిణామాలు కూడా అంత తీవ్రంగానే ఉంటాయి.

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

ఇతరుల మనసుల్ని చదవడంలో సిద్దహస్తులుగా చెప్పబడిన మీన రాశి వారు, ఎవరి భావాలనైనా ఇట్టే అర్ధం చేసుకోగలిగిన వారిగా ఉంటారు. వీరు చెప్పే ప్రతి విషయంలోనూ ఒక అంతరార్ధం ఇమిడి ఉంటుంది. కావున వీరి ఆలోచనలను అంత తేలిగ్గా తీసి పారేయ్యలేరు ఎవ్వరూ. కాకపోతే ఎక్కువగా వీరి మనసుకు తగ్గట్లే తమ చుట్టూతా పరిసరాలు ఉండాలి అన్న ఆలోచనలు చేసే మీన రాశి వారు, తమకు అనుగుణంగా లేకపోతే అసౌకర్యానికి గురవుతుంటారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, రాశి చక్ర, హస్తసాముద్రిక సంబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ వీక్షించండి.

English summary

Things No One Understands About Each Zodiac Sign

There are many untold facts about each zodiac sign that can be unknown to many. These are mainly something that people are hesitant to share about their zodiac signs.According to astrology, there are certain things that people are not aware of the zodiac signs.
Story first published: Wednesday, July 11, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more