రాశుల ప్రకారం మీలో ఉండే లోపాలివే.. వీటిని సరిదిద్దుకుంటే అన్నీ విజయాలే

Written By:
Subscribe to Boldsky

ఒక్కోరాశి వారికి ఒక్కోరకమైన లోపం ఉంటుంది. వ్యక్తిత్వం పరంగా కొన్ని రకాల లోపాలుంటాయి. ఒక్కోసారి ఇలాంటి లోపాల వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ రాశి ప్రకారం మీ లోపం ఏమిటో తెలుసుకోండి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.

మేషం

మేషం

మేషరాశివారు కొన్ని రకాల లోపాలుంటాయి. వీరు ప్రతి చిన్న విషయానికి అలుగుతారు. అవతలి వ్యక్తిని అనవసరంగా అపార్థం చేసుకుంటారు. వీరు ఇతరుల అభిప్రాయాలను ఏకీభవించరు. వీరు కాస్త పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.

వృషభం

వృషభం

వృషభం రాశి వారు ఎదుటి వారి మాట అంత త్వరగా వినరు. వారికి నచ్చిందే చేస్తుంటారు. వీరికి కాస్త మొండి పట్టుదల ఉంటుంది. అలాగే కాస్త సోమరితనం కూడా ఉంటుంది. వీరికి గర్వం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

మిథునం

మిథునం

ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు అవతలి వ్యక్తులు వీరి మాటలు వింటున్నారో లేదో తెలుసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. అయితే దీని వల్ల అవతలి వ్యక్తులు కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అయితే వీరు అవతలి వ్యక్తిని ఈజీగా నమ్ముతారు. వీరు కూడా నమ్మదగిన వ్యక్తులే.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటక రాశి వారు ఎక్కువ భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీళ్లు ఎక్కువగా మూడీగా ఉంటారు. ఎవరైనా చిన్న మాట అంటే కూడా భరించలేరు. పిరికిగా ఉంటారు. వీరి ప్రాణాల మీదకు వస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తారు.

సింహం

సింహం

సింహరాశి వారు వారినే వారే ఎక్కువగా అభిమానించుకుంటూ ఉంటారు. పదిమందిలో తాము ప్రత్యేకంగా ఉండాలని తరచూ కోరుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా, నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేస్తారు.

కన్య

కన్య

వీరు తాము ఒక్కరమే చాలా ఉత్తములం అని ఫీలవుతూ ఉంటారు. తమకు మించిన మంచివాళ్లు ఈ సమాజంలో లేరన్నట్లు తెగ ఫీలైపోతుంటారు. వీరి ఈ లోపాన్ని తగ్గించుకుంటే అందరూ వీరికి కాస్త మర్యాద ఇస్తారు.

తులరాశి

తులరాశి

తులరాశి వారు ప్రతి విషయంలో సందేహపడుతుంటారు. వీళ్లు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులుపడతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా వీరు చాలా ఇబ్బందులుపడుతుంటారు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చికరాశి వారు అవతలి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం వీరికి ఉండదు. వీరి దాన్ని మనస్సులో పెట్టుకుని అవతలి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు

వీరు త్వరగా విసుగు చెందుతారు. వీరు దేనిపైనా కూడా ఎక్కువగా ఆసక్తి చూపరు. వీరు ప్రతి విషయంలో నిరాశ చెందుతూ ఉంటారు. అందువల్ల వీరి చేసే పనులు కూడా అంతగా ఫలించవు.

మకరం

మకరం

మకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి కారణం లేకుండానే కోపానికి గురవుతుంటారు. వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు కానీ వారి లోపాల్ని మాత్రం పట్టించుకోరు. అంతేకాదు వీరు అవతలి వ్యక్తి చెప్పేది కూడా వినరు. వాళ్లంతకు వాళ్లు ఏదేదో మాట్లాడుతుంటారు.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరు చిన్నచిన్న విషయాలకే కుంగిపోతుంటారు. చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు. ఇతరులపై కుట్రులు పన్నలేరు. ఏదైనా డైరెక్ట్ గా చెబుతారు. దీంతో వీరు ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

All Image Source :http://www.higherperspectives.com

English summary

the dark side of each zodiac sign

the dark side of each zodiac sign
Story first published: Thursday, January 11, 2018, 12:00 [IST]