For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే ఒంటరి వాడు, అడవిలో 22 ఏళ్లుగా బతుకుతున్న ఒకే ఒక్కడు, మాట్లాడే సాహసం చెయ్యని పరిశోధకులు

|

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక దట్టమైన అడవిలో ఒక మనిషి చెట్టును నరుకుతూ కనిపించే ఆ వీడియో ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వెనకు ఒక స్టోరీ ఉంది. అతని పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఊరు కూడా తెలియదు. ఆయన ఒక దట్టమైన అడవిలో ఉంటున్నాడు. అమెజానియన్ ట్రైబ్ లో ఇతను చివరి వ్యక్తి.

చిమ్మచీకట్లోనే ఉంటాడు

గాలీవాన, చలి ఎండ దేన్ని లెక్కచేయకుండా కొన్ని ఏళ్ల తరబడి అడవిలోనే ఉంటున్నాడు. రోజూ రాత్రి చిమ్మచీకట్లోనే ఉంటాడు. ఎవరి అవసరం లేకుండా దట్టమైన అడవిలో ఇరవై రెండేళ్లుగా జీవిస్తున్నాడు. బ్రెజిల్‌ లోని ఇండియన్‌ ఫౌండేషన్‌ ఇందుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేసింది. దీంతో ఇతనిపై ఇప్పుడు అంతటా చర్చ సాగుతోంది.

ఇండియన్‌ ఫౌండేషన్‌ పరిశోధనలు

ఇండియన్‌ ఫౌండేషన్‌ పరిశోధనలు

బ్రెజిల్ లోని రోండోనియా స్టేట్ లోని అమెజాన్ అడవుల్లో ఇతను ఉంటున్నాడు. 1996 లో మొదటి సారి ఇండియన్‌ ఫౌండేషన్‌ ఇతని గురించి పరిశోధనలు చేపట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి అతన్ని గమనిస్తూనే ఉంది. ఇక 2011 మార్చి లో ఒక వీడియోను కూడా షూట్ చేసింది. కానీ ఆ వీడియోను చాలా రోజులు బయటకు విడుదల చెయ్యలేదు. రీసెంట్ గా ఆ వీడియో బయటకు వచ్చింది.

ఫేస్ క్లియర్ గా కనపడడం లేదు

ఫేస్ క్లియర్ గా కనపడడం లేదు

అందులో ఒక వ్యక్తి అర్ధ నగ్నంగా చెట్టును నరుకుతూ ఉంటాడు. అతని ఫేస్ క్లియర్ గా కనపడడం లేదు. ఈ వీడియో కూడా అతనికి చాలా దూరం నుంచి షూట్ చేసినట్లు ఉంది. కాగా అతన్ని మళ్లీ రీసెంట్ గా కూడా ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులు చూశారంట. అతని లైఫ్ స్టైల్ ఏమిటనేది తెలుసుకునేందుకు తాము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఒంటరిగా ఎలా బతుకున్నాతాడో

ఒంటరిగా ఎలా బతుకున్నాతాడో

అతని అడుగు జాడల ద్వారా అతనికి తెలియకుండా ఫాలో అవుతున్నారట. ఇన్నేళ్ల నుంచి అతను ఒంటరిగా ఎలా బతుకున్నాతాడో కూడా ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులు వివరించారు. అతను పూర్తిగా వెజిటేరియన్. అడవిలో ఉండే ఆకులు అలుమలు తింటూ బతుకుతున్నాడు. కానీ అతను నివాసం ఉండే ప్రాంతంలో మాత్రం జంతువులను పట్టుకునేందుకు వీలుగా కొన్ని కందకాలు తవ్వాడు. దీన్ని బట్టి చూస్తే అతను వాటిని అలా పట్టుకుని తింటున్నాడా? లేదంటే ఆత్మసంరక్షనకు అలాంటి కందకాలు తవ్వుకున్నాడో అర్థం కావడం లేదు.

డేంజర్ ప్లేస్ లో ఎలా ఉంటున్నాడు?

డేంజర్ ప్లేస్ లో ఎలా ఉంటున్నాడు?

ఇక ప్రస్తుతం వీడియో ట్రెండింగ్ అవుతుండడంతో, అతని గురించి మరిన్ని వివరాలు అందిచమని ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులకు అభ్యర్థనలు వస్తున్నాయి. అంత డేంజర్ ప్లేస్ లో అతను ఎలా ఉండగలుగుతున్నాడు? అతను నిజంగా ఇంకా ఉన్నాడా? అంటూ చాలా మంది ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులను అడుగుతున్నారు. కానీ వాళ్లు ఇంకా అతనిపై పరిశోధనలు చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.

ఆ ట్రైబల్స్ ను చంపేశారు

ఆ ట్రైబల్స్ ను చంపేశారు

అయితే బ్రెజిల్‌ లోని అమెజాన్‌ వెంట ఉండే అడవుల్లో గతంలో చాలా మంది ట్రైబల్స్ ఉండేవారు. 2003లో ఒక చట్టం ప్రకారం భూస్వాములంతా భూఆక్రమణలో భాగంగా ఆ ట్రైబల్స్ ను చంపేశారు. కానీ అలాంటి తెగల్లో ఒక తెగకు చెందిన వ్యక్తి మాత్రం ఇప్పటికీ ఇలా అక్కడ సంచరిస్తూను ఉన్నాడు.

మాట్లాడే సాహసం మాత్రం చెయ్యలేదు

ఇండియన్‌ ఫౌండేషన్‌ అతనిపై పరిశోధన చేస్తుంది కానీ అతనితో మాట్లాడే సాహసం మాత్రం చెయ్యలేదు. అతను ఒక చిన్నపాటి గుడిసెను కూడా నిర్మించుకున్నాడు. అతను బయటకు వెళ్లినప్పుడు అతను నివసించే ప్రాంతాన్ని ఫొటోలు తీసుకున్నారు ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులు. అతన్ని డైరెక్ట్ గా కలిస్తే ఆధునికంగా ఉన్న మనుషులను చూస్తే అతను ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కాబట్టి అతన్ని కలవడానికి ఇండియన్‌ ఫౌండేషన్‌ సభ్యులు సాహసం చేయడం లేదు.

Image Credit (all pics)

English summary

the loneliest man in the world newly released video from brazil shows man believed to be last of tribe

the loneliest man in the world newly released video from brazil shows man believed to be last of tribe
Story first published: Monday, July 23, 2018, 12:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more