For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 రాశి చక్రాలు హాస్య చతురతకు మారుపేరు

|

కొంతమంది వ్యక్తులు అన్ని సమయాల్లోనూ మీ ముఖాన చిరునవ్వును తెప్పించగలరని తెలుసా ? వారు పక్కన ఉంటే చాలు, మీ బాధలు, కష్టాలు కాసేపు పక్కకి వెళ్ళినట్లే లెక్క. క్రమంగా వారిని మీ అభిమాన వ్యక్తుల్లో ఒకరిగా చేర్చుకుంటూ ఉంటారు. మనిషి ఏదో ఒక సమయంలో తనలోని హాస్య చతురతని ప్రతిబింబించేలా ప్రవర్తిస్తుంటాడు. కానీ, ముఖం మీద చిరునవ్వు అంటేనే గుర్తొచ్చేలా ఉంటారు కొందరు. నిజంగా అటువంటి వారు మన జీవితాల్లో ఉండడం ఒక అదృష్టమనే చెప్పాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలను మన రాశి చక్ర సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. క్రమంగా అత్యంత హాస్య చతురత కలిగిన వ్యక్తుల రాశి చక్రాల గురించిన వివరాలను పొందుపరచబడ్డాయి .

1. మేష రాశి : 21 మార్చి - 20 ఏప్రిల్

1. మేష రాశి : 21 మార్చి - 20 ఏప్రిల్

మేష రాశి వారు వ్యంగ్యానికి మారుపేరుగా ఉంటారు. కానీ వీరు వ్యంగ్యానికి మాట్లాడుతున్నారా, లేదా హాస్య చతురత దృష్ట్యా మాట్లాడుతున్నారా అని అర్ధం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. క్రమంగా కొన్ని సందర్భాలలో ఇతరులు వీరి మాటలను సరిగ్గా అర్ధం చేసుకోలేని పరిస్థితుల్లో వాదనలకు కూడా దిగుతుంటారు. కానీ వీరిని స్నేహితులుగా కలిగి ఉన్నవారికి మాత్రం వీరి మాటల అంతరార్ధం తెలుస్తుంటుంది, మరియు వీరి స్నేహాన్ని ఎన్నటికీ దూరం చేసుకోలేని వారిగా ఉంటారు కూడా. భాధల్లో ఓదార్పుగా ఉంటారు మేష రాశి వారు. మాటలలోనే కాదు, భూమి మీద కేవలం అత్యంత సమయపాలన కలిగిన వ్యక్తులుగా కూడా ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు. చావులో కూడా నవ్వును వీడకూడదు అన్న ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు.

2. వృషభ రాశి : 21 ఏప్రిల్ - 21 మే

2. వృషభ రాశి : 21 ఏప్రిల్ - 21 మే

వృషభ రాశి వ్యక్తులు చూసేందుకు కోప స్వభావం కలిగిన వారిగా కనిపిస్తున్నప్పటికీ, మానసికంగా అత్యంత సున్నితమైన హాస్య చతురత కలిగిన వారిగా చెప్పబడింది. వారు తమకు తాము కొన్ని హద్దులను ఏర్పరచుకుని, వాటిని దాటకుండా ప్రవర్తిస్తుంటారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వృషభ రాశి వారిని స్నేహితులుగా కలిగి ఉండేందుకు అందరూ ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల కష్టాలను తొలగించే క్రమంలో వీరి ఆలోచనా విధానం ఆశ్చర్యగొల్పేదిగా ఉంటుంది. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా హాస్యాన్ని ప్రదర్శించగలరు. అలాగని పరిస్థితుల నుండి తప్పించుకునేలా ఉండరు. క్లిష్ట పరిస్థితుల్లో వీరి మాటలే కాదు, చేతలు కూడా పరిస్థితులను చక్కబెట్టేవిలా ఉంటాయి.

Most Read:భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

3. మిధున రాశి : 22 మే - 21 జూన్

3. మిధున రాశి : 22 మే - 21 జూన్

మిధున రాశి వ్యక్తులు కూడా, వ్యంగ్యం మరియు హాస్య చతురత కలిగిన వారిలో గొప్ప పేరెన్నిక కలవారిగా ఉంటారు. కానీ, వీరు హాస్యానికి లక్ష్యం చేసుకున్న వ్యక్తులు మాత్రం వీరి దరిదాపులలో లేకుండా జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ఇతరులు తమ మాటలకు భాదపడుతారని కూడా వీరికి తెలుసు. వీరి హాస్యం సున్నితమైనదిగా, అర్ధవంతంగా ఉంటుంది. ఒక పసిబిడ్డ సైతం వీరి హాస్యాన్ని, వ్యంగ్యాన్ని అర్ధం చేసుకునేలా వీరి మాటలు ఉంటాయి.

4. సింహ రాశి: 23 జూలై - 21 ఆగస్టు

4. సింహ రాశి: 23 జూలై - 21 ఆగస్టు

సింహరాశి వారు సాధారణంగానే సంతోషకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువగా పార్టీ జీవితానికి సమయాన్ని కేటాయించే వారిగా ఉంటారు. ఎక్కడ ఉన్నా అందరి దృష్టి తమ మీద ఉండేలా చేసుకోవడంలో సిద్దహస్తులుగా ఉంటారు. క్రమంగా ఎక్కువగా హాస్య చతురతవైపుకు మొగ్గు చూపుతుంటారు. మేషరాశి వారి వలెనే, సమయానుసారం హాస్యాన్ని పండించగల భిన్న వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ వీరి హాస్యం పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉంటుంది ఎక్కువగా. క్రమంగా వీరి ఆలోచనా ధోరణిని ఎక్కువ ఆలోచనా శక్తి కలిగిన వారు, లేదా పెద్దలు మాత్రమే అర్ధం చేసుకోగలరు.

5. వృశ్చిక రాశి: 24 అక్టోబర్ - 22 నవంబర్

5. వృశ్చిక రాశి: 24 అక్టోబర్ - 22 నవంబర్

ఒక జోక్ పేలింది అన్నా, ఒకరిని ఉత్తమంగా ట్రోల్ చేయడం గాని జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ వృశ్చిక రాశి వారు ఉన్నారనే అర్ధం. కానీ వీరు తిరిగి తమను ఎవరైనా ట్రోల్ చేయడం లేదా వ్యంగ్యాస్త్రాలు సంధించడాన్ని అంగీకరించలేని వారిగా ఉంటారు.

Most Read:భార్య దగ్గర త్వరగా ఔట్ అయిపోతున్నా, దాంతో మంచి ఎనర్జీ వస్తుందంటా? నిజమేనా?

English summary

These 5 Zodiac Signs Have A Good Sense Of Humour

It is amazing how some people can make you laugh continuously. Well, for sense of humour we must say, can not be learnt; it is something that a person gets naturally. Well, this talent too has the stars playing behind it. Having the ability to bring a smile to a person's face is a talent worth praising.