ఈ నెలలో మిమ్మల్ని ఏం వరిస్తుందో తెలుసుకోవాలంటే మే నెల మాసఫలాలను ఇక్కడ చదవండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఈ నెల మీకు కలిసొస్తుందో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా. మీ రాశి ఫలితాలు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై మీకు ఉత్సుకతగా ఉందా? అయితే, ఇంకెందుకాలస్యం ఈ ఆర్టికల్ లో ఈ విషయాలని మేము పొందుబరిచాము.

మే 2018లో మీ రాశిఫలాల గురించి తెలుసుకోండి.

రొమాంటిక్ రిలేషన్ షిప్ లో విజయం సాధించాలన్నా లేదా మిమ్మల్ని ఈ నెలలో ఏది వరిస్తుందో తెలుసుకోవాలన్నా ఈ రాశిఫలాలను తెలుసుకోవడం ద్వారా కొంత అంచనాకు రావచ్చు. ఈ రాశిఫలాలు చదివి మీ కోసం ఈ నెలలో దాగున్న సర్ప్రైజ్ ల గురించి కాస్త అవగాహనకు రండి.

ఇక్కడ పరిశీలించండి మరి...

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

ఈ నెలలో ఈ రాశికి చెందిన వారి ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో వీరు ఎక్కువగా సోషలైజ్ అవుతారు. అయితే, ఏ ముఖ్యమైన విషయానికీ కమిట్ అవడం గాని లేదా క్విట్ అవడం గాని చేయకండి. నెల గడుస్తున్న కొద్దీ మీరు ఇన్నాళ్లు చేస్తున్న నెగోషియేషన్స్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తద్వారా, మీరు గొప్ప లాభం పొందుతారు. అంతేకాక, మీరు ఈ నెలలో కొన్ని విషయాలలో ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది.

కలిసి వచ్చే రోజులు : 5, 15, 24

కలిసిరాని రోజులు: 12, 16

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

ఈ నెలలో అమావాస్య తరువాత నుంచి మీరు కొంతకాలం నుంచి పూర్తి చేయాలని అనుకున్న పనులు కార్యరూపం దాల్చడం జరుగుతుంది. ఈ నెల మీరు చేపట్టిన పనులన్నీ ఆశించిన ఫలితాలను అందిస్తాయి. మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యం వైపు గురిపెట్టడమే. ఏ మాత్రం మీ ఏకాగ్రత తప్పకూడదు. ఈ నెలలో మీవైపు ఎక్కువమంది ఉంటారు. అయితే, మీరు నమ్మదగిన కేవలం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మరోవైపు, మిమ్మల్ని ఎప్పుడూ అడ్డుకునే ఒక కనెక్షన్ నుంచి మీరు బయటపడితే మంచిది.

కలిసివచ్చే రోజులు: 17, 19, 27

కలిసిరాని రోజులు: 7, 20

మిథునరాశి: మే 21 - జూన్ 20

మిథునరాశి: మే 21 - జూన్ 20

ఈ నెల మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులను అవగాహన చేసుకుని అందుకు తగిన విధంగా మీరు సరైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఈ నెల మధ్యలో మీ ఎనర్జీ మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ ఏడాది మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని పరిణామాలు చోటుచేసుకోవచ్చని మీరు భావించే అవకాశాలు ఉన్నాయి.

కలిసివచ్చే రోజులు: 13, 18, 25

కలిసిరాని రోజులు: 7, 22

కర్కాటకరాశి: జూన్ 21 - జూలై 22

కర్కాటకరాశి: జూన్ 21 - జూలై 22

ఈ నెలలో మీరు ఎక్కువగా సోషలైజ్ అవుతారు. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు. నిజానికి, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ ఎమోషనల్ సైడ్ పై ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఫ్లో తో వెళ్లిపోండి. మరోవైపు, మీ సోషల్ లైఫ్ ఇదివరకటి లాగే షైన్ అవడం జరుగుతుంది. మీ సామర్థ్యం పూర్తిగా బయటకి వస్తుంది.

కలిసివచ్చే రోజులు: 7, 18, 27

కలిసిరాని రోజులు: 5, 24

సింహరాశి: జూలై 23 - ఆగస్టు 23

సింహరాశి: జూలై 23 - ఆగస్టు 23

ఆర్థికపరంగా పురోగతి సాధించడానికి ఈ నెలలో మీకు అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. మీ సహనమే మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మరోవైపు, మీ సోషల్ లైఫ్ పై మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈ నెలలో, మీరు మీ ప్రణాళికలపై ఎవరితోనైనా చర్చించే అవకాశం ఉంది. అయితే, మీరు తీసుకునే ప్రతి అడుగూ రాబోయే రోజుల్లో తన ప్రభావం చూపిస్తుందని మీరు గుర్తించాలి.

కలిసివచ్చే రోజులు: 8, 11, 23

కలిసిరాని రోజులు: 22, 28

కన్యారాశి: ఆగష్టు 24 - సెప్టెంబర్ 23

కన్యారాశి: ఆగష్టు 24 - సెప్టెంబర్ 23

మీరు ఈ నెలలో సెటిల్ అయినట్లు భావిస్తారు. ఈ నెలలో మిమ్మల్ని ఎంతకాలం నుంచో వేధిస్తున్న వృత్తిపరమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎప్పటినుంచి ఆచరించాలనుకుంటున్న పనిని ఆచరణలో పెట్టే ధైర్యం మీకు లభిస్తుంది. మరోవైపు, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. సొంతఇంటి కల నెరవేరే అవకాశం ఉంది.

కలిసివచ్చే రోజులు: 2, 18, 25

కలిసిరాని రోజులు: 7, 23

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

ఈ నెలలో మీరు డబ్బును అనుసరించే అవకాశాలు కలవు. మీ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీ ఖర్చులను మీరు అదుపులో పెట్టుకోవాలి. మీ గతానికి చెందిన వ్యక్తి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటపడాల్సిన సమయం ఆసన్నమైందని మీరు గుర్తించాలి.

కలిసివచ్చే రోజులు: 17, 23, 27

కలిసిరాని రోజులు: 7, 25

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

ఈ నెల మధ్యలో ప్రేమవ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ భాగస్వామితో ఆర్థిక విషయాలను చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు, మీరు స్ట్రెస్ ను ఎదుర్కొని ముందడుగు వేయాల్సి వస్తుంది. ప్రొఫెషనల్ సమస్యలు పెర్సనల్ విషయాలలో జోక్యం చేసుకుంటే మీరు కాస్త సంయమనం పాటించి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలి. ఈ నెలలో ఆర్థికపరమైన సమస్యలు ఎదురవవచ్చు. ఈ నెలలో మీరు శక్తివంతమైన పొజిషన్ లో ఉన్నా కూడా మీరు వేయబోయే అడుగులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కలిసివచ్చే రోజులు: 5, 23, 25

కలిసిరాని రోజులు: 7, 16

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

మే 8 న గ్రహస్థితులు వలన మీ పొజిషన్ పై ప్రభావం పడవచ్చు. అయితే, మీరు ఈ పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేయగలరు. మీరు చేయవలసిందల్లా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీ చుట్టుపక్కల పరిస్థితులపై మీరు అంచనాకి వచ్చి వాటిని ఎలా ఎలివేట్ చేయాలో మీరు తెలుసుకోవాలి. మరోవైపు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే విషయాలను మీరు వదిలించుకోవడం మంచిది.

కలిసివచ్చే రోజులు: 10, 18, 27

కలిసిరాని రోజులు: 5, 22

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

ఈ నెల మీరు నిర్ణయాలను ధైర్యంగా తీసుకునేందుకు అనుకూల సమయం. ఇప్పటివరకూ, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషపెట్టే నిర్ణయాలే తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మిమ్మల్ని కొంతకాలం నుంచి దిగులుకు గురిచేస్తున్న అంశంపై నిర్ణయాన్ని తీసుకునేందుకు అనుకూల సమయం. ఈ నెల మీకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. వాటివలన, మీరు చేరుకోవాలనుకుంటున్న చోటికి చేరుకోగలుగుతారు.

కలిసివచ్చే రోజులు: 4, 14, 30

కలిసిరాని రోజులు: 1, 25

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

ఈ నెల మీకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. పరిస్థితిపై అవగాహనను పొందేందుకు ఇతరుల ఆలోచనా ధోరణిని కూడా అర్థం చేసుకుంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలుగుతారు. అలాగే, ఈ నెలలో మీ బ్యాంక్ అకౌంట్ ను బాగా గమనించాలి. ఎందుకంటే, ఆర్ధిక స్థితిలో కొన్ని మార్పులు ఏర్పడే సూచనలు కలవు. నెట్వర్కింగ్ లో మీరు మంచి పొజిషన్ లో ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు, మీకు నచ్చిన డ్రీం జాబ్ ను పొందే సూచనలు కలవు.

కలిసివచ్చే రోజులు: 3, 13, 19

కలిసిరాని రోజులు: 15, 25

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

ఈ నెలలో గ్రహస్థితులు ప్రభావం వలన మీకు ఆత్మవిశ్వాసం లోపం తలెత్తవచ్చు. అయితే, మీరు కొద్ది రోజుల్లోనే తిరిగి మాములుగా తయారవుతారు. ఈ నెలలో మీకు స్నేహితుల అండ లభిస్తుంది. వారివలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పటివరకూ మిమ్మల్ని వేధిస్తున్న ప్రేమ, వృత్తి, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు, జరిగేదంతా మంచికేనని భావించడం వలన మీకు మంచి జరిగే సూచనలు కలవు.

కలిసివచ్చే రోజులు: 10, 22, 25

కలిసిరాని రోజులు: 7, 20

గమనిక: అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రాశిఫలాలను ఆస్ట్రో నిపుణులు అందించారు. ఇవి వ్యక్తిగత జాతకఫలితాలను ఖచ్చితంగా తెలియచేయవని గమనించాలి.

English summary

What Does Your Love Or Luck Predictions Reveal For The Month Of May

These are the things that you can expect during the month of May as we bring in details of the zodiac signs and their love forecast for the month of May 2018.
Story first published: Wednesday, May 9, 2018, 16:30 [IST]