దిన ఫలాలు: 4 జనవరి 2018

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది. 4-1-2018 తారీఖు, గురువారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ తదియ, గురువారం రాత్రి 2 గంటల 13 నిమిషాల వరకూ ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 58 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 10.15 నిమిషాల నుండి 10.59 నిమిషాల వరకు ఉంది. మరలా దుర్ముహర్తం 2 గంటల 40 నిమిషాల నుండి 3 గంటల 24 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధతో పూర్తి చేస్తారు. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భార్యతో ప్రేమగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి. పిల్లల విషయంలో కొంచెం భాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. సోదరుల సహకారం కూడా ఉంటుంది. బంధు మిత్రులతో సంభాషణలు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తినివ్వవు.

మిథున రాశి: 22 మే-21 జూన్

మిథున రాశి: 22 మే-21 జూన్

ధన ప్రణాళికలు వేస్తారు. అనుకున్న పనులు ఆటంకాలతో పూర్తి చేస్తారు. పిల్లల విషయం బాధ్యతగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

మంచి భోజనం లభిస్తుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. భూ సంబంధ పనులు ఒక కొలిక్కి వస్తాయి. అధికారులకు సంబంధించిన లాభం ఉంటుంది.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

భక్తి ప్రవచనాలు వింటారు. కట్టవలసిన సొమ్ములవి కడతారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. సోదరుల సహకారం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో ఆనందంగా గడుపుతారు. ధన ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో మెలకువలు అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కలహాలకి దూరంగా ఉండండి. అధికారుల వలన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

దూరపు వార్తలు వింటారు. ప్రయాణాలు చేయాలన్న కోరిక కూడా ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలలో లాభం పొందుతారు. పిల్లల విషయంలో ఒక కన్నేసి ఉంచవలసి వుంటుంది. భార్య సహకారంతో లాభం పొందగలరు.

 ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ఆలోచనలు కూడా విపరీతంగా ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

భార్యతో అనుకూల దాంపత్యం కలదు. భార్యతో మాటల వలన కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తి చేయవలసి ఉంటుంది. పిల్లల పనులు మీకు ఆనందాన్ని ఇవ్వవు. సమస్యల పరిష్కారానికి దుర్గా పూజ చేయండి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

అనుకున్న పనులు లాభంతో పూర్తి చేస్తారు. కట్టవలసిన బాకీలు కట్టివేస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

పిల్లలతో సరదాగా గడుపుతారు. షికార్లు కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. దుర్గాదేవి ఆరాధనతో సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

horoscope for 04 January 2018 | daily horoscope | astrology

Astrology has to explain itself and prove that it is a very much part of science and it does so rightly all the time. Now, astrology is practised all over the world and is known as a science of the stars and other celestial planets and their influence on our lives.
Story first published: Thursday, January 4, 2018, 7:00 [IST]