దిన ఫలాలు: 6 జనవరి 2018

దిన ఫలాలు: 6 జనవరి 2018

By Ashwini

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా

అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు. ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

జనవరి 6 వ తేదీ శనివారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శీతాకాలం, పుష్యమాస బహుళ పంచమి..

రాత్రి 10 గంటల 49 నిమిషముల వరకు వుంది.మఖ నక్షత్రం ఉదయం 7 గంటల 55 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ఉదయం 7 గంటల 9 నిముషాల వరకు వుంది.

మరలా అమృత సమయం రాత్రి 12 గంటల 58 నిముషాల నుండి 2 గంటల 30 నిముషాల వరకు వుంది. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 40 నిముషాల నుండి 5 గంటల 15 నిముషాల

దాకా వుంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 36 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 36 నిమిషాలకు వరకు ఉంటుంది.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి వారికి అనుకున్న పనులు వ్యక్తి గత శ్రద్ద తో పూర్తి చేయవలసి వుంటుంది. పిల్లల వలన మనస్సుకి ఆనందం కలుగుతుంది. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగజేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి వారికి.. తల్లి గారి దీవెనలు పొందుతారు. ఇంటికి సంబంధించిన పనులు పట్టుదలగా చేస్తారు. పెద్ద వారి సహకారం వుంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్

మిథున రాశి: 22 మే-21 జూన్

మిధున రాశి వారికి..పనుల ఆటంకంతో మనస్సుకి చికాకు ని కలిగిస్తాయి. ధనానికి ఇబ్బందులు కూడా వున్నాయి. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. స్త్రీ సహకారం లభించగలదు.వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి వారికి ధన ప్రణాళికలు వేస్తారు. చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. భార్య సహకారం కుడా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగజేస్తాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి వారికి.. విందు భోజనం చేస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. దగ్గరపడిన పనులను పూర్తి చేస్తారు. పిల్లల వలన ఆనందం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆనందిస్తాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్య రాశి వారికి... ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. భార్య బాధ్యతగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. కోపం తగ్గించుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెచ్చి పెడతాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి వారు.. వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మంచి వ్యాపారం చేస్తారు. దైవ దర్శనం ప్రాప్తి జరుగుతుంది. దూర బంధుల వార్తలు వింటారు. మనస్సు ఎన్నో ఆలోచనలు చేస్తుంది.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి వారికి.. చేయు పనులలో ఆటంకాలు వున్నాయి. ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. ధనానికి ఇ��్బందులు కలవు. దూరపు బంధువుల వార్తలు వింటారు.వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి వారికి... ఆరోగ్యం పై శ్రద్ద వహించవలసి ఉంటుంది. చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. పాత మిత్రులని కలుస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంబ రాశి వారికి... అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి వుంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. చేయవల్సిన పనులలో విజయం సాధిస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి వారికి.. చేయు పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి . అనుకున్న పనులు వాయిదా పడతాయి. బాకీలు, పన్నులు కట్టవలసిన సమయం. దైవ దర్శన ప్రాప్తి కలదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి దుర్గా దేవిని ఆరాధన చేయవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుం��ి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

Desktop Bottom Promotion