దిన ఫలాలు: 11 జనవరి 2018

Posted By: Deepthi
Subscribe to Boldsky

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది. 11-1-2018 తారీఖు, గురువారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ దశమి, గురువారం రాత్రి 9 గంటల 44 నిమిషాల వరకూ ఉంది. స్వాతి నక్షత్రం ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం రాత్రి 10 గంటల 25 నిమిషాల నుండి 2 గంటల 6 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 10.19 నిమిషాల నుండి 11 గంటల 03 నిమిషాల వరకూ ఉంది. మళ్ళీ దుర్ముహర్తం మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 35 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలగా పూర్తి చేస్తారు. భార్యతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ విషయాలు అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. తండ్రి గారి సహాయ సహకారాలు తీసుకోవాల్సి ఉంటుంది. భార్య సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా నడుస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

సోదరుల సహకారం ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి కూడా ఉంటుంది. కొత్త అవకాశాలు చేజారే అవకాశం కూడా ఉంది. శ్రీ వేంకటేశ్వర దర్శనం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది.

మిథున రాశి: 22 మే-21 జూన్

మిథున రాశి: 22 మే-21 జూన్

చేయు పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలవు. పిల్లలతో కలిసి షికారులు చేస్తారు. భార్యతో బాధ్యతగా మెలగవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

చేయు పనులు, తలపెట్టిన కార్యక్రమాలు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉన్నాయి. కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేస్తారు.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సోదరుల సహకారం ఉంటుంది. దైవ దర్శనం కూడా చేసుకుంటారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పిల్లల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ అవసరాలు తీరుస్తారు. సహచరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

మంచి విందు భోజనం లభిస్తుంది. ధన ప్రణాళికలు లాభాన్ని తెస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా కలవు. భార్య సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

 వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

అవసరానికి ధనం చేకూరుతుంది. దూరపు బంధువుల మాటలు వింటారు. ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని తెస్తాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. విందు భోజనం చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

చేయు పనులందు ఆటంకాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధికై ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

 కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

సహచరుల సహకారం పూర్తిగా ఉంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. బంధు మిత్రుల పరిచయాలు బాగా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేసి లాభాన్ని తెచ్చుకుంటారు.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చేయు పనులందు ఆటంకాలు ఏర్పడతాయి. దైవ దర్శన ప్రాప్తి వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి వుంటుంది. పిల్లల విషయంలో కూడా ఆలోచించవలసి ఉంటుంది.

ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

horoscope for 11 January 2018 | daily horoscope | astrology

Astrology has to explain itself and prove that it is a very much part of science and it does so rightly all the time. Now, astrology is practised all over the world and is known as a science of the stars and other celestial planets and their influence on our lives.