దిన ఫలాలు: 20 జనవరి 2018

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

By Deepthi T A S

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 20-1-2018 తారీఖు,శనివారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు, శీతాకాలం, మాఘ శుద్ధ తదియ శనివారం ఉదయం 11 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. శతబిష నక్షత్రం రాత్రి తెల్లవారితే 3 గంటల 33 నిమిషాల వరకు ఉంది. అమృత సమయం రాత్రి 7 గంటల 55 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9 గంటల 44 నిమిషాల నుండి 11 గంటల 25 నిమిషాల వరకు ఉంది. దుర్ముహుర్తం ఉదయం 8 గంటల 7 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. భార్య సహకారంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఇంటి విషయాలన్నీ కూడా శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుని పనులు మొదలుపెట్టండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వ్యాపారం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు చక్కని ఫలితాన్నిస్తాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్

మిథున రాశి: 22 మే-21 జూన్

దూరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. ధనం కోసం ఇబ్బందులు కన్పిస్తున్నాయి. పిల్లలు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తారు. సోదరుల సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇంటి పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు.దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

ధనం కోసం చేయవలసిన పనులు అనుకూలిస్తాయి. సోదరుల సహకారం పూర్తిగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా కన్పిస్తున్నాయి. పని వారి సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో మెలకువ అవసరం. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఇంటి బాధ్యతలు నెరవేరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

దూరపు బంధువుల సమాచారాలు వింటారు. కోప తాపాలకు తావివ్వకండి. ఇంటి పనులు చక్కగా నెరవేరుస్తారు. తల్లి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

అనుకున్న పనులన్నీ చక్కగా సాగుతాయి. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి వస్తుంది. కొత్త మిత్రుల పరిచయాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. సోదరుల సహకారం కూడా ఉంటుంది.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

అనుకున్న పనులు నెరవేరుస్తారు. విందు భోజనం కూడా కలదు. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పిల్లల పట్ల జాగ్రత్తగా మెలగాలి. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. చెల్లించవలసిన బాకీలు కూడా అన్ని చెల్లిస్తారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

Story first published: Saturday, January 20, 2018, 7:00 [IST]
Desktop Bottom Promotion