ఈ రాశుల వారు ఆ రాశి వారిపైనే ఎక్కువగా మొగ్గు చూపుతారు

Written By:
Subscribe to Boldsky

ప్రతి రాశి వారు ఏదో ఇంకో రాశి వారికి ఈజీగా ఆకర్షనకు గురవుతుంటారు. ఇదంతా మీకు తెలియకుండానే జరిగిపోతుంది. మనకు బాగా నచ్చేవాళ్లే రాశిగానీ.. మనం బాగా అట్రాక్టివ్ అయ్యే వ్యక్తుల రాశిగానీ కచ్చితంగా మనరాశితో ముడిపడి ఉంటుంది. ఒక్కోరాశి వారు ఒక్కో రాశి వారికి ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. మరి మీది ఏ రాశి.. మీరు రాశివారికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారో చూడండి.

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషరాశి వారు ఎక్కువగా కర్కాటక రాశి వారికి అట్రాక్ట్ అవుతారు. అలాగే కర్కాటక రాశి వారు కూడా మేషరాశి వారికి అండగా నిలుస్తారు. ప్రేమపరంగా, స్నేహపరంగా ఈ రెండు రాశుల వారు ఎక్కువకాలం కలిసి ఉంటారు. ఒకవేళ మీది మేష రాశి అయి ఉంటే మీకు బాగా తెలిసిన వ్యక్తులు కచ్చితంగా కర్కాటక రాశి వారు అయి ఉంటారు.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభరాశి వారు ఎక్కువగా సింహరాశి వారికి అట్రాక్ట్ అవుతారు. ఈ రెండు రాశుల వారిది విడదీయరాని అనుబంధం. ఈ రెండు రాశుల వారి అనుబంధం అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

మిథునం (మే 21- జూన్ 20

మిథునం (మే 21- జూన్ 20

మిథున రాశి వారు ఎక్కువగా మీన రాశి వారితో ఆప్యాయంగా అనుబంధంగా ఉంటారు. ఈ రెండు రాశుల వారి మధ్య ఒకరినొకర్ని అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. అది ప్రేమ విషయంలోనైనా కావొచ్చు.. స్నేహం విషయంలోనైనా కావొచ్చు.. వ్యాపారం ఇలా ఏ విషయంలోనైనా ఈ రెండు రాశుల వారి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీది మిథున రాశి అయితే కచ్చితంగా మీ క్లోజ్ ఫ్రెండ్ లేదా మీకు నమ్మకమైన వ్యక్తి మీనరాశి వారు అయి ఉంటారు.

కర్కాటకం (జూన్ 21- జూలై 22)

కర్కాటకం (జూన్ 21- జూలై 22)

కర్కాటక రాశి వారు కుంభంరాశి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ కు గురువుతారు. ఈ రెండు రాశుల మధ్య అనుబంధం బాగుంటుంది. ఈ రెండు రాశుల వారు ఒకరికొకరు అనుకోకుండా పరిచయం అవుతారు. తర్వాత జీవితాంతం కలిసి ఉంటారు.

సింహరాశి (జూలై 23- ఆగష్టు 22)

సింహరాశి (జూలై 23- ఆగష్టు 22)

సింహరాశి వారు ఎక్కువగా కన్య రాశి వారి పట్ల ఆకర్షనకు లోనవుతారు.

ఈ రెండు రాశులు వారు ఎక్కువగా కాలం కలిసి ఉంటారు. వీరి అనుబంధం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఒకరితో ఒకరు ఆప్యాయంగా ప్రవర్తిస్తారు.

కన్యరాశి (ఆగష్టు 23-సెప్టెంబర్ 22)

కన్యరాశి (ఆగష్టు 23-సెప్టెంబర్ 22)

కన్యరాశి వారు ఎక్కువగా తుల వారి పట్ల ఆకర్షనకు గురువుతుంటారు. ఈ రెండు రాశుల వారు ఎంతో ఆప్యాయంగా వ్యవహరిస్తారు. ఒకరంటే ఒక్కరు పడి చచ్చిపోతారు. జీవితాంతం ఈ రెండు రాశుల వారు కలిసి ఉండాలని అనుకుంటారు.

తులరాశి (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22)

తులరాశి (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22)

తులరాశి వారు మకర రాశి వారి పట్ల ఎక్కువగా ఆకర్షనకు గురవుతుంటారు. ఈ రెండు రాశుల వారు ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం కలిగి ఉంటారు. ఈ రెండు రాశుల వారి జీవితం హ్యాపీగా సాగుతుంది.

వృషభరాశి (అక్టోబర్ 23-నవంబర్ 21)

వృషభరాశి (అక్టోబర్ 23-నవంబర్ 21)

వృషభరాశి వారు మిథున రాశి పట్ల ఎక్కువగా ఆకర్షనకు లోనవుతుంటారు. ఈ రెండు రాశుల వారు నిత్యం ఆప్యాయంగా ఉంటారు. ఈ రెండు రాశుల వారి మధ్య అనుబంధం కూడా బాగా ఉంటుంది.

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

ధనుస్సు రాశి వారు ఎక్కువగా వృశ్చిక రాశి పట్ల ఎక్కువగా ఆకర్షనకు లోనవుతారు. ఈ రెండు రాశుల వారు ఒకరిపై ఒకరు చాలా ప్రేమగా ఉంటారు. అన్యోన్యంగా ఎక్కువ అనుబంధంతో ఉంటారు.

మకరం (డిసెంబర్ 22-జనవరి 19)

మకరం (డిసెంబర్ 22-జనవరి 19)

మకరరాశి వారు ఎక్కువగా ధనుస్సు రాశి వారి పట్ల ఆకర్షనకు గురువుతారు. ఈ రెండు రాశుల వారు జీవితాంతం హ్యాపీగా ఉంటారు. స్నేహం, ప్రేమ ఇలా చాలా విషయాల్లో ఈ రెండు రాశుల వారు బాగా కలిసిపోతారు.

కుంభం (జనవరి 20-ఫిబ్రవరి 18)

కుంభం (జనవరి 20-ఫిబ్రవరి 18)

కుంభరాశి వారు వృషభ రాశి పట్ల ఎక్కువగా ఆకర్షనకు లోనవుతారు. వీరు ఎక్కువగా వృషభ రాశి వారినే తమ నమ్మకస్తులుగా భావిస్తారు. ఈ రెండు రాశులు వారు ఒకరితో ఒకరు హ్యాపీగా ఉంటారు.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

మీనరాశి వారు మేషరాశి వారి పట్ల ఎక్కువగా ఆకర్షనకు లోనవుతారు. ఈ రెండు రాశుల వారు చాలా ఆప్యాయంగా ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.

English summary

your zodiac sign reveals who you are really attracted to

your zodiac sign reveals who you are really attracted to..Have you ever found yourself attracted to something or someone and you didn't know why? Everything about you is the opposite of your attraction, but perhaps that's what draws you in the most.
Story first published: Monday, January 15, 2018, 12:04 [IST]
Subscribe Newsletter