ఈ రాశి చక్రాల కలయిక అంత మంచిది కాదు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీకు తెలుసా ఈ ప్రపంచంలో మీతో ఎప్పటికీ సరైన సఖ్యత కొనసాగించలేని వ్యక్తులున్నారని? దీనికి ప్రధాన కారణం మీ రాశి వారికి, మరొక వ్యతిరేక స్వభావాలున్న రాశి వారికి పొంతన కుదరకపోవడమే.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరికొకరు అనుకూలంగా ఉండని కొన్ని రాశి చక్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంకేతాలు కలిగిన వారి కలయిక చాలా దుర్లభంగా కూడా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి.

zodiac signs

కావున ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి, అటువంటి కొన్ని పొంతన లేని రాశుల గురించిన వివరములు అందించడం జరిగినది. అవేమిటో చూడండి.

1)సింహ రాశి – కర్కాటక రాశి

1)సింహ రాశి – కర్కాటక రాశి

కర్కాటక రాశి కలిగిన వారు ఎక్కువగా ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు, వారు ప్రేమించిన వ్యక్తులతో సున్నితమైన, సంతోషకరమైన అనుబంధాలను కలిగి ఉంటారు. కాని సింహరాశి వారికి అభద్రతా భావనలు ఎక్కువగా ఉంటాయి. మరియ వీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల పట్ల కొన్ని విషయాల యందు ఎక్కువ కోపాన్ని సైతం ప్రదర్శిస్తారు. కాని వీటిని కర్కాటక రాశి వారు తేలికగా తీసుకోలేరు. తద్వారా గొడవలకు దారితీస్తుంది. అందుకే జ్యోతిష్యపండితులు, ఎక్కువగా ఈ జాతకాల వారిని పెళ్ళికి సూచించరు. ఒకవేళ పెళ్లి అనివార్యమయితే జ్యోతిష్యులు సూచించిన ప్రకారం కొన్ని దైవ క్రియలు చెయ్యాల్సి ఉంటుంది.

2)మకరరాశి – కుంభ రాశి

2)మకరరాశి – కుంభ రాశి

ఈ రాశి చక్రాల రెండింటిలోనూ నిర్ణయాత్మక ధోరణి లక్షణం కనిపిస్తుంది. కాని వారి ఆలోచనా విధానం వ్యతిరేక దిశలను చూపుతుంటాయి. ఇక్కడ మకర రాశి వారు భావోద్వేగానికి ఎక్కువగా గురికావడం వంటి లక్షణాన్ని కలిగి ఉంటే, మరోవైపు కుంభ రాశి వారు వాస్తవిక ధోరణిని కలిగి ఉంటారు. ఈ ఇద్దరు రాశుల వారు ముఖ్యమైన విషయాలయందు ఏకీభవించడం అనేది జరగని పనే అవుతుంది. కావున ఇది సూచించదగ్గ కలయిక కాదు.

3)మిధున రాశి- కన్యా రాశి

3)మిధున రాశి- కన్యా రాశి

మిధున రాశి వారు ఎక్కువగా కలలలో ప్రయాణాలు చేస్తుంటారు, మరోవైపు కన్యా రాశి వారు నిర్ణయాత్మక మరియు ఆచరణాత్మక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. తద్వారా వీరికి పొంతన కుదరడం జరగని పని. కన్యారాశి వారు మొండిపట్టుదల కలిగిన వారు కావడం వలన, మిధున రాశి వారు ఎక్కువగా భాదపడే సూచనలే కనిపిస్తుంటాయి. కావున ఈ కలయికని వద్దని చెప్తుంటారు జ్యోతిష్యులు.

4)మేషరాశి – తులా రాశి

4)మేషరాశి – తులా రాశి

మేష రాశి మరియు తులా రాశుల వారి వ్యక్తిత్వాలు మొదట్లో ఇంచుమించు ఒకేలా అద్దంలో ప్రతిబింబిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని మేషరాశి వారి మొండిపట్టుదల, తులా రాశి వారి సమతుల్య స్వభావం(balanced nature) అన్ని సమయాల్లో సరైన సమాధానాన్ని ఇవ్వలేవు. తద్వారా గొడవలకి తావిస్తుంది. ఈ గొడవల వలన సంబంధాలు దెబ్బతింటాయి.

5)వృశ్చిక రాశి- మీన రాశి

5)వృశ్చిక రాశి- మీన రాశి

ఈ రాశి చక్రాల కలయిక ప్రాణాంతకమైన కలయిక అనే చెప్పవచ్చు. ఎందుకనగా ఈ రెండు రాశి చక్రాలు ఉద్వేగభరితమైనవి మరియు ఒకదానితో ఒకటి అనుమానాస్పదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ఉద్వేగభరిత లక్షణాలకు, మీన రాశి వారి భావోద్వేగ ఆధారిత లక్షణాలకు పొంతన కుదరకపోవడం వలన మరియు వృశ్చిక రాశి వారి అనుమానాస్పద వైఖరి వలన, వారి మద్య ఉన్న ప్రేమ మరియ నమ్మకాల తగ్గుదలకు కారణమవుతాయి. చివరికి సంబంధాలు దెబ్బతినే అవకాశo ఉంది.

6)ధనుస్సు రాశి - వృషభ రాశి

6)ధనుస్సు రాశి - వృషభ రాశి

వృషభ రాశి వారు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిని దిగ్విజయంగా అనుకున్న సమయానికి పూర్తి చెయ్యడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. కాని ధనుస్సు రాశి వారు సవాలు ధోరణిని కనపరుస్తుంటారు. ఇది ఇద్దరిమద్య సహనాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా ఈ ప్రభావం ప్రేమ, సంబంధాలపై పడి జీవితం అస్తవ్యస్తం అవుతుంది.

English summary

Zodiac Combinations That Can Be Very Toxic!

There are a few zodiac combinations that need to avoid being paired up. These zodiac combinations are rated as being the most toxic one, which are: Leo And Cancer; Capricorn And Aquarius; Gemini And Virgo; Aries And Libra; Scorpio And Pisces; Sagittarius And Taurus.