ఈ రాశులకు చెందిన వారు అపారమైన తెలివితేటలు కలిగిన వారు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆస్ట్రాలజీ ప్రకారం, జోడియాక్ సైన్స్ అనేవి మన వ్యక్తిత్వంపై అలాగే జీవితంపై మన దృక్పథంపై ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే. అదే విధంగా మన ఐక్యూ పై కూడా జోడియాక్స్ సైన్స్ ప్రభావం ఉంటుందట. కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఒక వ్యక్తి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనే దానిపై వారి ఆలోచనా తీరు ప్రభావం చూపుతుంది.

ఈ క్రింద వివరించబడిన జోడియాక్ సైన్స్ కి చెందిన వ్యక్తుల తెలివితేటలు అపారమని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు.

మీ జోడియాక్ సైన్ ఇందులో ఉందేమో పరిశీలించండి మరి.

తులారాశి: పరిష్కారాన్ని కనుగొనడంలో దిట్ట.

తులారాశి: పరిష్కారాన్ని కనుగొనడంలో దిట్ట.

ఈ రాశికి చెందిన వారు తమ చుట్టూ సామరస్యాన్ని కోరుకుంటారు. అలా చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఘర్షణలు, విభేదాలు ఏర్పడిన సందర్భంలో ఈ వ్యక్తులు సామరస్యం కలిగించే పరిష్కారాన్ని కనుగొంటారు. మిగతా వారు సమస్యను చూస్తూ ఉంటే వీరు మాత్రం పరిష్కారం వైపు చూస్తారు. వివిధ అంశాలను బేరీజు వేసి సరైన ఆప్షన్ ని ఎంచడంలో వీరికి సాటెవ్వరూ రారు. అలాగే, వీరు ముక్కుసూటితనం కలిగిన వారు. అందువలన, వీరు మంచి ఫ్రెండ్ గా అలాగే అడ్వైసర్ గా ఉండగలుగుతారు.

కుంభరాశి: అర్థంచేసుకునే తత్త్వం కలిగిన వారు

కుంభరాశి: అర్థంచేసుకునే తత్త్వం కలిగిన వారు

ఈ జోడియాక్ సైన్ కి చెందిన వ్యక్తులు అపారమైన తెలివితేటలు కలిగినవారు. ఒక సిట్యువేషన్ కి సంబంధించి రెండు వైపులా అనలైజ్ చేయగలుగుతారు. ఈ ఆలోచనా దృక్పథం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇతరుల మాటలను వినేందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే, వీరి జ్ఞాపకశక్తి అపారం. అందువలన, వీరు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచడానికి ఆసక్తి చూపిస్తారు. మరోవైపు, వీరు ఏదైనా నేర్చుకోవాలని సంకల్పించుకుంటే అందుకు సంబంధించిన విషయాల్ని లోతుగా సేకరిస్తారు. ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ను పెంపొందించుకుంటారు.

కన్యారాశి: విమర్శనాత్మక అలాగే విశ్లేషణాత్మక స్వభావం కలిగినవారు

కన్యారాశి: విమర్శనాత్మక అలాగే విశ్లేషణాత్మక స్వభావం కలిగినవారు

మోస్ట్ కాంప్లికేటెడ్ సిట్యువేషన్స్ ని కూడా వీరు చక్కగా అనలైజ్ చేసుకోగలుగుతారు. వీరు ఒక పద్దతికి కట్టుబడి ఉండడానికే ఇష్టపడతారు. అదే సమయంలో వారు లాజికల్ థాట్ ప్రాసెస్ ని మిస్ కారు. ఏదైనా అడుగు వేసేముందు అన్ని ఆప్షన్స్ ని స్టడీ చేస్తారు. అలాగే, వీరు సహజంగా కాస్త కన్నింగ్ నేచర్ కలిగినవారు. అలాగే వీరు విమర్శనాత్మక స్వభావం కలిగిన వారు. అంతేకాకుండా, వీరి మైండ్ సెట్ ఎక్కువగా ఎకనామికల్ గా ఉంటుంది. అందువలన, వీరు ఇన్వెస్టర్స్ గా నిలబడగలుగుతారు.

మీనరాశి: భావోద్వేగాలు అధికంగా కలిగిన వారు

మీనరాశి: భావోద్వేగాలు అధికంగా కలిగిన వారు

వీరికి ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం అధికంగా కలదు. అందువలన వీరు మోస్ట్ ఎమోషనల్ పెర్సన్ గా పేరొందుతారు. అలాగే తెలివితేటలలో వీరికి లోటేమీ లేదు. వారి ఎమోషన్స్ కి ఇతరుల ఎమోషన్స్ కి మధ్యలో చేపలా ఈదుతూ ఉంటారు. వారికి ఏదైనా తప్పు జరిగే ముందు కొంచెం ముందుగానే తెలిసే అవకాశం ఉంది. వారి సిక్స్త్ సెన్స్ అనేది వారిని ఆపదల నుంచి కాపాడుతుంది. ఆయా సిట్యువేషన్ ని ఏ విధంగా డీల్ చేయాలో వారికి సులభంగా తెలుస్తుంది.

సింహరాశి: గడసరితనం కలిగినవారు

సింహరాశి: గడసరితనం కలిగినవారు

ఈ రాశికి చెందిన వ్యక్తులలో అంతర్భుద్ది సామర్థ్యం ఎక్కువ. వారి లక్ష్యాల దిశగా వారి ప్రయత్నం సాగుతుంది. అందుకు అనుగుణంగా తమ బ్రెయిన్ ని వీరు తీర్చిదిద్దుకుంటారు. వీరికి దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది. వారి దారిలో వచ్చే ఏ అవరోధాలు వారి లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డు కావు. మరోవైపు, ఈ రాశి వారు తమపై వచ్చే విమర్శలను తట్టుకోలేరు. లేదంటే, వీరిని మించిన వారెవరూ ఉండరు.

మిథునరాశి: ద్వంద్వ మేధస్సు కలిగినవారు

మిథునరాశి: ద్వంద్వ మేధస్సు కలిగినవారు

ఈ రాశికి చెందిన వారు అత్యంత మేధావంతులు. ఎటువంటి పరిస్థితినైనా క్షుణ్ణంగా విశ్లేషించగలుగుతారు. అన్ని కోణాలలో పరిస్థితిని విశ్లేషించే సామర్థ్యం వీరికి కలదు. అందువలన, వారి స్వంత కాంఫ్లిక్ట్స్ ని కూడా వారు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మల్టీ టాస్కింగ్ లో వీరు దిట్ట. అందువలన, అనేక ఇష్యూలను ఏకకాలంలో పరిష్కరించగలుగుతారు.

డిస్క్లైమర్: ప్రతి వ్యక్తికి రాశిచక్రంతో సంబంధం లేకుండా కొంతవరకూ తెలివితేటలుంటాయి. కాబట్టి, ఈ ప్రెడిక్షన్స్ అనేవి అక్యురేట్ అని చెప్పలేము. ఇక్కడ ప్రస్తావించబడని రాశులకు చెందిన వారిలో తెలివితేటలు తక్కువని చెప్పలేము.

English summary

Zodiac Signs That Are The Smartest

Zodiac Signs That Are The Smartest,These zodiac signs are known to be the smartest zodiac signs. Check if your zodiac sign is also listed here…
Story first published: Wednesday, February 21, 2018, 7:00 [IST]