For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mother's Day Special: కనిపించే ప్రత్యక్ష దైవమే అమ్మ.. ఆమె కోసం ఇవి కచ్చితంగా చేయాల్సిందే...

మదర్స్ డే సందర్భంగా మీరు కచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో చూసెయ్యండి.

|

అమ్మ ప్రేమ ఎంతో మధురమైనది. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాతే ఎవరైనా. అమ్మ అనే పదంలోనే ప్రపంచం మొత్తం నివసిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన కడుపులో నలుసు పడిన నాటి నుండి తొమ్మిది నెలల పాటు ఎంతో సహనంతో.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి పునర్జన్మనెత్తుకుంటుంది.

Do These Things For Your Mother on Mothers Day in Telugu

అయితే అప్పటివరకు పడిన పురిటినొప్పులను కాస్త.. బిడ్డ ఒడిలో పడిన వెంటనే మరచిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ ఎంతో ప్రత్యేకం. తల్లీబిడ్డల మధ్య అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. అమ్మ ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే.

Do These Things For Your Mother on Mothers Day in Telugu

'అమ్మ త్యాగం తన కంటే కోటి రెట్లు ఎక్కువని.. భూదేవిని అడిగినా చెబుతుంది.. అమ్మ అంటేనే ఓర్పు అని.. ఓర్పు అంటేనే అమ్మ అని.. అందుకే ఈ సృష్టిలో అమ్మే గొప్పది.. తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు' అని కొందరు కవులు, మేధావులు చెబుతుంటారు. అయితే అమ్మ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఈ నేపథ్యంలో మే 8వ తేదీన ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు.

Do These Things For Your Mother on Mothers Day in Telugu

ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మపై మీకు ఎంత ప్రేమ ఉందో చూపే ప్రయత్నం చయండి. ఏ తల్లి అయినా తన బిడ్డ తిరిగి ప్రేమను అందిస్తే తనకు అంతకంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని చెప్పొచ్చు. వారి గురించి కాకుండా అనునిత్యం మన గురించే ఆలోచించే, మన గురించే ఆరాటపడే అమ్మ కోసం కేవలం మదర్స్ డే రోజే కాకుండా ప్రతిరోజూ తనకు సహాయం చేస్తూ ఉండండి.. అయితే మదర్స్ డే రోజున అమ్మకు ఇష్టమైన పనులను కొన్ని కచ్చితంగా చేయాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Mother's Day 2022:ఈ మదర్స్ డే వేళ అమ్మకు మరచిపోలేని అనుభూతిని అందివ్వండి...Mother's Day 2022:ఈ మదర్స్ డే వేళ అమ్మకు మరచిపోలేని అనుభూతిని అందివ్వండి...

ఆదివారం సెలవు..

ఆదివారం సెలవు..

ఎలాగో మదర్స్ డే ఆదివారం రోజు వస్తుంది.. మనలో చాలా మందికి ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి.. ఈరోజు ఇంట్లో అమ్మకు పూర్తి విశ్రాంతి ఇవ్వండి. తను ఉదయం నిద్ర లేచిదగ్గర్నుంచి.. రాత్రి నిద్రపోయేంత వరకు అన్ని పనులను మీరే చేయండి. ముఖ్యంగా ఇంటిని క్లీన్ చేయడం.. వంట చేయడం.. మీ గదులను అందంగా అలంకరించడం వంటివి చేసి అమ్మను ఆశ్చర్యపరచండి.

అమ్మ స్నేహితులను..

అమ్మ స్నేహితులను..

ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మను సర్ ప్రైజ్ చేయాలనుకుంటే.. తనకు ఇష్టమైన స్నేహితులను ఈరోజు కలిసేలా ప్లాన్ చేయండి. అందుకోసం సోషల్ మీడియా ఇతర మార్గాలను అన్వేషించండి. ఇలా చేయడం వల్ల మీ అమ్మగారు కచ్చితంగా సంతోషపడతారు. అంతేకాదు తన జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా నిలిచిపోతుంది.

ఫోన్ కవర్..

ఫోన్ కవర్..

ప్రస్తుత కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అసలు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో మీ అమ్మ గారు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతుంటే, తన కోసం ఓ అందమైన ఫోన్ కేస్ ని తీసుకోండి. అంతేకాదు దానిపై మీ ఫొటోలు వచ్చేలా కూడా చేయొచ్చు. మీ దగ్గర అంత సమయం లేకపోతే.. తను మీకెంతో స్పెషల్ అని తెలిసేలా ఓ ఫోన్ కవర్ కొని గిఫ్ట్ గా ఇవ్వండి.

Mother's Day 2022: అమ్మ ఒళ్లోనే మనమూ ఊగాల.. రోజూ ఆడాల.. అనునిత్యం అమ్మతో ఉండాల...Mother's Day 2022: అమ్మ ఒళ్లోనే మనమూ ఊగాల.. రోజూ ఆడాల.. అనునిత్యం అమ్మతో ఉండాల...

తియ్యని రుచులతో..

తియ్యని రుచులతో..

మనలో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎన్నో ఆనందకరమైన, అద్భుతమైన క్షణాలు, మరచిపోలేని అనుభవాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిని మనం ఫొటోల రూపంలో బంధించి దాచుకుంటూ ఉంటాం. అలా మీరు దాచుకున్న వాటిలో అమ్మకు సంబంధించిన ఫొటోలను సేకరించి వాటితో పాటు నోరూరించే తియ్యని చాక్లెట్లతో కలిపి ఎక్స్ ప్లోజన్ బాక్స్ గా చేసి తనకు అందివ్వండి. ఇలాంటి బహుమతిని తను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు.

మదర్ స్టార్..

మదర్ స్టార్..

మన ఆకాశంలో నిత్యం మనకు కోట్లాది సంఖ్యలో నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అందులో మీ అమ్మ పేరుతో ఓ స్టార్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. అది ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. ఇలా నక్షత్రాలకు పేర్లు పెట్టే అవకాశాన్ని ఇంటర్నేషనల్ స్టార్ ఏజెన్సీ అందిస్తోంది. ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి. 2 నుండి 3 వేల రూపాయల ఖర్చుతో మీ అమ్మ పేరును ఓ స్టార్ కు పెట్టేయండి. ఆ స్టార్ ను మీ అమ్మకు చూపుతూ సర్ ప్రైజ్ చేయండి.

సరైన ప్రాధాన్యత..

సరైన ప్రాధాన్యత..

చూశారు కదా.. మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఇవ్వడానికి వీలున్న గిఫ్టులు. అయితే కేవలం ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ మీరు అమ్మకు ప్రేమను అందిస్తుంటేనే.. మదర్స్ డేకి మీరు సరైన ప్రాధాన్యత ఇస్తూ అమ్మను ప్రేమించినట్టు అవుతుంది. అంతేకానీ కేవలం ఈ ఒక్కరోజు విషెస్ చెప్పి మిగిలిన రోజులు మీ అమ్మను పట్టించుకోకపోతే ఈరోజు మీరు ఎంత చేసిన అది వ్యర్థమే అవుతుందని గుర్తుంచుకోండి.

FAQ's

English summary

Do These Things For Your Mother on Mother's Day in Telugu

Here are these things for your mother on mother's day in Telugu. Have a look
Story first published:Saturday, May 7, 2022, 9:34 [IST]
Desktop Bottom Promotion