For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ఈ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. కృష్ణ దాదాపు 350 సినిమాల్లో కనిపించారు. ఆయన గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం.

|

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ప్రాణాలు వదిలారు. ఆదివారం రోజు అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

j

ఆయన మృతి సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు తీరని లోటు. ఆయన సినీ కెరీర్ లో దాదాపు 350 సినిమాల్లో కనిపించారు. ఎన్నో అవార్డులు పొందారు. ఆయన గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం.

  • సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతుల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవాడు. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దర్శకుడు ఆదుర్తి తన పేరును కృష్ణగా మార్చారు. కృష్ణ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. కృష్ణ మొత్తం 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1974లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1976లో కేంద్ర ప్రభుత్వం కృష్ణను నటశేఖర్ బిరుదుతో సత్కరించింది. 1997లో కృష్ణ ఫిల్మ్‌ఫేర్ సౌత్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
  • 2000లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2008లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
  • ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణ పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
n
  • నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కృష్ణ సేవలు అందించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ తన బహిరంగ మద్దతు ప్రకటించారు.
  • 1984లో రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కాంగ్రెస్ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాజీవ్ గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణల మధ్య విభేదాలు ఉండేవి.
  • 1962లో, కృష్ణ తన మేనమామ కూతురు ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మహేష్ బాబు, రమేష్ బాబు అనే ఇద్దరు కుమారులు, పద్మావతి, మంజుల, ప్రియదర్శని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందిరతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత 1969లో విజయనిర్మతో కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మతో కలిసి దాదాపు 48 సినిమాల్లో నటించారు. అప్పట్లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం పెళ్లికి దారి తీసింది. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ చాలా సినిమాల్లో నటించారు.
d
  • కృష్ణ సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించారు. 1960లో పాపం కాలికెళ్లిన నాటకంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత కృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులతో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశాడు.
  • తాను కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్‌కి వీరాభిమానినని, ఆయన పాతాళభైరవి సినిమా అంటే చాలా ఇష్టమని కృష్ణ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
  • టాలీవుడ్ నుంచి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి హీరో కృష్ణ.
  • కృష్ణ 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. విజయనిర్మలతో 48, జయప్రదతో 47, శ్రీదేవితో 31, రాధతో 23 సినిమాలు చేశారు.
s
  • నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా చిత్రాలను నిర్మించారు.
  • కృష్ణ 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. అత్యధిక సార్లు ద్విపాత్రాభినయం చేసిన హీరోగా రికార్టు సృష్టించారు.
  • మొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలను టాలీవుడ్ కు పరిచయం చేశారు.
s
  • మొదటి సినిమా స్కోప్ మూవీ తీశారు. అదే అల్లూరి సీతారామరాజు
  • కృష్ణ మోసగాళ్లకు మోసగాడు సినిమా 56 దేశాల్లో విడుదల అయింది. విదేశాల్లో విడుదల అయిన మొట్టమొదటి తెలుగు సినిమా అదే.
  • కృష్ణ తీసిన సాక్షి సినిమా మాస్కో ఫిల్స్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.
s
  • ఆదుర్తి సుబ్బారావు యొక్క తేనే మనసులు (1965)తో చలనచిత్రరంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కృష్ణ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారారు.
  • ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్‌తో 350కి పైగా చిత్రాలలో కనిపించారు.

English summary

Interesting facts about superstar Krishna in telugu

read on to know Interesting facts about superstar Krishna in telugu
Desktop Bottom Promotion