For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Youth Day 2021 : భారతదేశ ఖ్యాతిని చాటిన స్వామి వివేకానందుడి ప్రసంగం ఇదే...

స్వామి వివేకానంద జయంతి, నేషనల్ యూత్ డే చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

1985 సంవత్సరం నుండి స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతిని పురస్కరించుకుని..ప్రతి సంవత్సరం మన దేశంలో 'జాతీయ యువజన దినోత్సవం'(Youth Day) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

National Youth Day 2021|Yuva Diwas| Swami Vivekananda Birthday: Date, History, Significance and Key Facts

ఈ సందర్భంగా యువత తమ శక్తిని ఎలా వెలికితీయాలి? ఎలా విజయవంతంగా ముందుకుసాగాలి? వంటి అంశాలపై చర్చలు జరుపుతూ యువతలో ప్రేరణ నింపే థీమ్స్ తో.. ఈరోజును జరుపుకుంటారు. అయితే మన దేశానికి 'యువ దివాస్'ఉన్నట్టే..

National Youth Day 2021|Yuva Diwas| Swami Vivekananda Birthday: Date, History, Significance and Key Facts

అంతర్జాతీయంగా కూడా యువత కోసం ఒక ప్రత్యేక రోజు ఉంది. అదే 'అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని'(International Youth Day) ఐక్యరాజ్యసమితి 2000 సంవత్సరం నుండి ఈరోజును అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చరిత్ర మరియు తన ప్రసంగాల్లోని కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం...

Swamy Vivekananda Quotes : యువతకు ప్రేరణనిచ్చే అద్భుతమైన స్వామి వివేకానందుని సూక్తులు...!Swamy Vivekananda Quotes : యువతకు ప్రేరణనిచ్చే అద్భుతమైన స్వామి వివేకానందుని సూక్తులు...!

1984 నుండి..

1984 నుండి..

1984 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం స్వామి వివేకానందుని జయంతి జనవరి 12వ తేదీన ‘జాతీయ యువజన దినోత్సవం'గా పాటిస్తోంది. 1863లో కోల్ కత్తాలో జన్మించిన నరేంద్రనాథ్, అనంతర కాలంలో స్వామి వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు.

చికాగో ప్రసంగం..

చికాగో ప్రసంగం..

స్వామి వివేకానందుని గురించి ప్రపంచంలో ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. ముందుగా అగ్రరాజ్యంలోని చికాగో వేదికలో 1893లో ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ ఒక్క ప్రసంగమే భారతదేశ ఖ్యాతిని ప్రపంచనలువైపులా పరిచయం చేసింది. ఈ ప్రసంగంలో వివేకానందుడు ఏం చెప్పారనేది అతికొద్ది మందికే తెలుసు.. అందులోని కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం తరపున..

భారతదేశం తరపున..

* ‘అమెరికా సోదరులు, సోదరీమణులారా.. నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా గుండె నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్క్రుతికి నెలవు. అన్ని ధర్మాలకూ అమ్మలాంటి భారతదేశం తరపున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరపున మీకు ధన్యవాదాలు.

వాస్తవ రూపంలో..

వాస్తవ రూపంలో..

మత సహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణ లాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుండి వచ్చినందుకు నేను గర్వ పడుతున్నాను. మేం కేవలం మత సహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను వాస్తవ రూపంలో స్వీకరిస్తాం. నేను సర్వ మతాలకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందకు గర్వపడుతున్నాను.

నదులు ఎలా కలుస్తాయో..

నదులు ఎలా కలుస్తాయో..

నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాలలో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో.. అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎంపిక చేసుకుంటాడు. చూడటానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్ణే చేరుకుంటాయి.

నన్ను చేరుకుంటారు..

నన్ను చేరుకుంటారు..

ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. భగవద్గీతలో చెప్పిన విధంగా ‘నా దగ్గరవకు వచ్చిన దేన్నైనా నేను స్వీకరిస్తాను. ప్రజలు వేర్వేరు దారులను ఎంచుకుంటారు. కష్టాలను ఎదుర్కొంటారు. కానీ చివరకు నన్ను చేరుకుంటారు' అన్న వాక్యాలు దీనికి నిదర్శనం..

English summary

National Youth Day 2021 | Yuva Diwas| Swami Vivekananda Birthday: Date, History, Significance and Key Facts

Here we talking about the national youth day 2021|Yuva Diwas|Swami Vivekananda Birthday : date, History, significance and Key facts. Read on
Desktop Bottom Promotion