Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
Vizag Beach Clean: తాగి బండ్లు నడిపిన మందుబాబులతో బీచ్ క్లీన్ చేయించిన వైజాగ్ కోర్టు
మందుబాబులకు విశాఖ మేజిస్ట్రేట్ కోర్టు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయాలని వారికి శిక్ష విధించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని మేజిస్ట్రేట్ కోర్టు వారికి శిక్ష విధించింది.
మందు తాగి వాహనాలు నడపొద్దురా బాబు అంటే ఎవడూ వినడు. పూటుగా తాగి జాలీగా బండ్లు, కార్లు నడుపుతుంటారు. తాగిన మైకంలో రోడ్డుపై వెళ్లే ఎవర్నో ఢీకొట్టి ప్రమాదాలకు కారణం అవుతుంటారు. వీరిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మందుబాబులకు చలాన్లు, ఫైన్లు, జైలు శిక్షలు విధిస్తూనే ఉంటున్నారు. కానీ వారిలో ఏమార్పు లేదు. కానీ ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మందుబాబుల పరువు అంతా బీచులో కొట్టుకుపోయేలా చేసింది.

మందుబాబులకు విశాఖ కోర్టు వేసిన శిక్షను ఇప్పుడు చాలా మంది భేష్ అంటున్నారు. తాగిన వాళ్ల తిక్క కుదిరిందని, ఇంకోసారి తాగి రోడ్లపైకి రారని అంటున్నారు. అన్ని నగరాల్లోలాగే విశాఖ లోనూ మందు బాబులు ఎక్కువే. తాగి వాహనాలు నడపొద్దు అంటే ఒక్కడూ వినే రకం కాదు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూనే ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. చలానాలు, జరిమానాలు కట్టి మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తుంటారు.
వైజాగ్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 3 రోజుల్లో 50 మంది దొరికారు. 50 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి వారికి భిన్నమైన శిక్ష విధించారు. వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయాలని వారికి శిక్ష విధించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని మేజిస్ట్రేట్ కోర్టు వారికి శిక్ష విధించింది.
పోలీసుల పర్యవేక్షణలో 52 మంది మందుబాబులు బీచ్ ను క్లీన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందుబాబులకు న్యాయమూప్రిత మంచి శిక్షణ విధించారని, ఇంకోసారి మందు తాగి రోడ్డు ఎక్కరని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మందుబాబుల తిక్క కుదిర్చేందుకు ఇదే సరైన శిక్ష అంటున్నారు. మందుబాబుల కిక్కు దిగేందుకు మాంచి కిక్కిచ్చే శిక్షణ విధించారని శెభాష్ అంటున్నారు.
2022లో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులు 8893 నమోదయ్యాయి. విశాఖపట్నంలోనని రీజనల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఆర్టీఏ) వైజాగ్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,1140 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. న్యూ ఇయర్ 2023 నాడు మద్యం తాగి వాహనాలు నడపడంపై దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. వీరిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 76 మంది ఉన్నారు.



Click it and Unblock the Notifications
