For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Suicide Prevention Day 2020 : ఉన్నది ఒక్కటే జిందగీ... దాన్ని మధ్యలో ఖతమ్ చేయకండి...

ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

జీవితం ఒక నీటిబుడగ లాంటిది. ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. అలాంటి చిన్ని జీవితంలో వచ్చే అత్యంత చిన్న సమస్యలకే తాము విఫలమయ్యామని.. తమకు ఎప్పటికీ విజయం దక్కదని బాధపడుతూ సూసైడ్ వంటి పిరికి చర్యలకు పాల్పడుతుంటారు.

World Suicide Prevention Day : powerful quotes to prevent suicidal thoughts in telugu

అయితే మీరు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు.. అది విజయానికి మరో మెట్టు అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న కాలానికి అనుగుణంగా జీవించలేక కొందరు ఆర్థిక సమస్యలతో.. పరీక్షల్లో ఫెయిలయ్యామని.. ప్రేమలో విఫలమయ్యామని, ప్రపంచంలో ఎవ్వరికీ లేని ప్రాబ్లమ్స్ అన్నీ తమకే ఉన్నాయని ఇలా ఎన్నెన్నో కారణాలతో మధ్యలోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

World Suicide Prevention Day : powerful quotes to prevent suicidal thoughts in telugu

అయితే చావు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి లేదా ఏదైనా కొండను ఎక్కి చూడండి. పెద్ద పెద్ద భవనాలు, చెట్లు ఇతర వస్తువులన్నీ చిన్న చీమల్లాగా కనిపిస్తాయి. మీ సమస్యలు కూడా అంతే.. చాలా చిన్నవి.. అలాంటి వాటిని చూసి అస్సలు భయపడకండి. ఏదైనా బతికి సాధించండి..

World Suicide Prevention Day : powerful quotes to prevent suicidal thoughts in telugu

అంతేగానీ సూసైడ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అంతేకాదు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతుంది. ఆత్మహత్యల నివారణకు అవగాహన కల్పిచేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం(IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), ప్రపంచ మానసిక ఆరోగ్య సమితి(WFMH)ల సహకారంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీని 2003 నుండి 'ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య అనే అంశంపై అవగాహన పెంచడానికి మరియు సూసైడ్ వంటి సంఘటనలను నివారించడానికి, అందుకు గల మార్గాల గురించి మాట్లాడటానికి ఈరోజు ఆచరిస్తారు.

World Suicide Prevention Day : powerful quotes to prevent suicidal thoughts in telugu

ఈ సందర్భంగా ఆత్మహత్యల ఆలోచనలను నివారించడంలో ఈ మార్గాలు మీకు సహాయపడతాయి. మీ ప్రియమైన వారితో వీటిని షేర్ చేసుకోండి.. ఈరోజు మంచిగా లేకపోయినా.. రేపటిరోజు కచ్చితంగా మంచి జరుగుతుందనే ఆశను వారిలో కలిగించండి.

అవకాశాన్ని వదులుకోవద్దు..

అవకాశాన్ని వదులుకోవద్దు..

మీ అందరికీ గొంగళి పురుగు గురించి తెలుసు కదా.. అది గొంగళి పురుగుగానే జీవితం ముగుస్తుందని అందరం అనుకుంటే.. చివరాఖరిలో ఒక్క క్షణం అద్భుతం జరుగుతుంది. అంతే అది అప్పటినుండి అందమైన సీతాకోకచిలుకలాగా మారిపోతుంది. అలా మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు లేదా చివర్లో అయినా ఒక అద్భుత క్షణం రావచ్చు. అలాంటి అవకాశాన్ని వదులుకోకండి.

ఇలా ముగిస్తా..

ఇలా ముగిస్తా..

‘నా కథను నాకు నచ్చిన విధంగానే ముగిస్తాను.. ఎవ్వరికో నచ్చినట్టు కాదు' అని చెప్పే వక్తి మీకు కూడా ఉంది.

మురికి బొగ్గు ఒత్తిడితోనే వజ్రాలు..

మురికి బొగ్గు ఒత్తిడితోనే వజ్రాలు..

ప్రతి ఒక్కరూ వజ్రంలాగా మెరవాలని కోరుకుంటారు. అయితే అందుకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైతే మాత్రం భయపడిపోతారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉండే వజ్రం కూడా మురికి బొగ్గు ఒత్తిడితో తయారవుతుంది. అలాగే మీ జీవితంలోని కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే మీరు కూడా మెరుగ్గా ఉంటారు.

ఒక్కసారే మరణం..

ఒక్కసారే మరణం..

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. అయితే వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు, భాగస్వాములు, తోబుట్టువులు మాత్రం బతికుండి ప్రతిరోజూ మరణిస్తూనే ఉంటారు. ఆ భయంకరమైన విషయాలను మరచిపోవడానికి చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మీరు సూసైడ్ వంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒక్కసారి వారి గురించి ఆలోచించండి.

సమస్య అంతం కాదు..

సమస్య అంతం కాదు..

ఆత్మహత్య మీ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కాదు. ఒకవేళ మీరు చనిపోయినా.. ఆ సమస్య మీ సన్నిహితులకు, బంధువులకు, తల్లిదండ్రులకు చేరుతుంది.

ముచ్చట్లతో ముగింపు..

ముచ్చట్లతో ముగింపు..

సూసైడ్ వంటి ఆలోచనలు వస్తే, అలాంటి వారు ఎంత వీలైతే.. అంత తొందరగా.. మీ ఫ్యామిలీతో లేదా స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే వారు కూడా వారికి ధైర్యం చెబుతూ ఉండాలి.

తప్పుగా మాట్లాడినా..

తప్పుగా మాట్లాడినా..

మీరు ఏదైనా తప్పుగా మాట్లాడినా భయపడకండి. ఎదుటి వ్యక్తి కళ్లలో కళ్లు పెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడండి. మీరు మూర్తిగా మాటల మీదే ఫోకస్ పెంచాలి. మీ స్మార్ట్ ఫోనుకు వీలైనంత దూరంగా ఉండాలి.

మగాళ్లే ఎక్కువ..

మగాళ్లే ఎక్కువ..

ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మగవారి సంఖ్యే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాలు చెబుతున్నాయి. వారి లెక్కల ప్రకారం మగవారు 13.5 శాతం మంది సూసైడ్ చేసుకుంటుండగా.. ఆడవారం 7.7 శాతం మంది సూసైడ్ చేసుకుంటున్నారని తేలింది.

మానసిక ఒత్తిడి..

మానసిక ఒత్తిడి..

చాలా మంది తమ జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, దీర్ఘకాలిక మానసిక ఒత్తిళ్లు, ప్రేమలో విఫలమవడం లేదా తీవ్ర అనారోగ్యం లాంటి పరిస్థితుల్లో చాలా మంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారని తెలిసింది.

English summary

World Suicide Prevention Day 2020: powerful quotes to prevent suicidal thoughts in telugu

Here we talking about the World Suicide Prevention Day 2020 : powerful quotes to prevent suicidal thoughts in telugu. Read on
Desktop Bottom Promotion