For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందువులు ఎక్కువగా వాడే పూల అర్థాలేంటో తెలుసా ?

By Nutheti
|

హిందూ సంప్రదాయంలో పూలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలాంటి శుభకార్యం జరిగినా.. ముందుగా ఇంపార్టెన్స్ ఇచ్చేది పూలకే. ఇవి అలంకరణకే కాదు.. సంప్రదాయానికి కూడా ప్రతీక. హిందువులు ఏ పూజ చేసిన ముందుగా పూలు సమర్పిస్తారు. ఎందుకంటే పూలను గౌరవసూచకంగా భావిస్తారు. పూలు దేవుడికి సమర్పించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు పొందుతామని నమ్మకం.

READ MORE: ఫ్లవర్ ఫేస్ ప్యాక్ తో.. అద్భుతమైన చర్మ సౌందర్యం

హిందువులు పెళ్లిళ్లు, ఎలాంటి ఫంక్షన్స్ నిర్వహించినా.. డెకరేషన్ కి రకరకాల రంగు రంగుల పూలనే వాడుతారు. పెళ్లిళ్లకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి స్టెప్ లోనూ పూలు ఉండాల్సిందే. పూల సువాసన, పూలతో అలంకరణ లేకుండా పెళ్లి వేడుక పూర్తికాదు. అంత ప్రాధాన్యముంటుంది.

READ MORE: పువ్వులు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అయితే హిందువుల సంప్రదాయం ప్రకారం కొన్ని పూలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని పూలను మాత్రమే శుభకార్యాలకు వాడుతారు. ఎందుకని ఎప్పుడైనా గమనించారా ? ఇతర పూలకంటే.. సంప్రదాయ పూలనే ఎందుకు వాడతారో ఆలోచించారా ? నిజమే హిందువుల సంప్రదాయాల్లో వాడే పూలకు అర్థాలున్నాయి. అందుకే శుభకార్యాలకు వాటినే ఎంచుకున్నారు. ఇంతకీ ఏ పూలకు ఏమి అర్థముందో ఓ సారి మీరే చదవండి..

మల్లెపూలు

మల్లెపూలు

హిందువుల గ్రంథాలు, వేదాలలో మల్లెపూల గురించి ప్రస్తావన ఉంది. వీటిని పూజలకు, వివాహాలకు, ముగ్గులకు, తోరణాలకు, విగ్రహాలకు, ఇంట్లో ఉండే ఫోటోలకు కూడా ఉపయోగిస్తారు. పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, టీ లలో కూడా మల్లెపూలను ఉపయోగిస్తారు.

మల్లెపూలే ఎందుకు

మల్లెపూలే ఎందుకు

మల్లెపూలు మహావిష్ణువుకి ప్రీతికరమైనవి. వీటి నుంచి వెలువడే సువాసన నరాలకు ఉత్తేజాన్నిచ్చి రిలాక్సేషన్ ని ఇస్తాయి. అలాగే హిందువుల వివాహంలో మల్లెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవి దంపతుల మధ్య సామరస్యాన్ని పెంచుతాయి. అంతేకాదు మల్లెపూలు ప్రేమానురాగం, శృంగారం, వినయము, పొందిక వంటి గుణాలకు చిహ్నం.

బంతిపూలు

బంతిపూలు

హిందూసంప్రదాయంలో బంతిపూలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని దండల రూపంలో డెకరేట్ చేయడానికి, దేవతల పూజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రేమను ప్రతిబింబించే ఈ పూలు వివాహ వేడుకల్లో ఎక్కువగా వాడతారు. వీటి నుంచి వెలువడే సువాసన క్రిమీకీటకాలను నాశనం చేస్తాయి. అందుకే వీటికి డెకరేషన్లకు ఎక్కువగా వాడుతారు.

మందారం

మందారం

కాళీ అమ్మవారికి మందారం పువ్వు ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పూల రెక్కలు అమ్మవారి నాలుకను ప్రతిబింబిస్తాయి. వినాయకుడికి కూడా ఈ మందారం పువ్వులను సమర్పిస్తారు. ఈ పూల రెక్కలు శ్రద్ధ ఉండటానికి సహాయపడతాయి. ఈ పూలు జీవితంలోకి సంపద, శత్రువుల నుంచి విముక్తి కలిగిస్తాయి.

తామర

తామర

తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి ఎరుపు రంగు తామర పువ్వు మీద, సరస్వతి తెలుపు రంగు తామర పువ్వు మీద కూర్చుని దర్శనిస్తారు. అలాగే బ్రహ్మ దేవునికి కూడా తామరపువ్వు ప్రత్యేకం. బురదలో నుంచి పుట్టినా పువ్వుకి మాత్రం బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఇతరుల విషయాలు పట్టించుకోకుండా.. సొంతంగా పైకి రావాలని ఈ పువ్వు సూచిస్తుంది. అంతేకాదు విజయం, సంతానోత్పత్తి, సంపద సిద్ధిస్తాయి.

గులాబి

గులాబి

గులాబి ప్రేమకు, ఆప్యాయతకు చిహ్నం. ఈ పువ్వుని పూజల సమయంలో అలాగే చికిత్సలకు గులాబీలను ఉపయోగిస్తారు. ఈ పూల నుంచి వచ్చే వాసన భార్యాభర్తల మధ్య రొమాన్స్ క్రియేట్ చేస్తుంది.

లిల్లీ

లిల్లీ

లిల్లీ పూలను కూడా వివాహాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు. ఇవి యునిటీని, పార్టనర్ షిప్ ని, సంబంధాలు కలకాలం ఉండటాన్ని వివరిస్తాయి. అంతేకాదు ఈ తెల్లటి లిల్లీ పూలు నిజాయితీకి, స్వచ్ఛతకి చిహ్నాలు.

డేరా పూలు (Dahlia Flower)

డేరా పూలు (Dahlia Flower)

ఈ పూలు అన్నింటికంటే భిన్నం. ఇవి వార్నింగ్ ని, మార్పుని, ప్రయాణాన్ని సూచిస్తాయి. వీటిని కూడా ఎక్కువగా డెకరేషన్ కి వాడుతారు.

English summary

Flowers that are important to Hindus and its meaning in telugu

Flowers play a symbolic role in Hinduism. During a prayer, Hindus offer flowers to the deities as a sign of respect with the hope that they will be blessed with luck and prosperity. Flower decorations are extremely important in Hindu weddings and any other social events. In a marriage ceremony, from start to finish, each step is incomplete without flowers.
Story first published:Thursday, November 26, 2015, 16:15 [IST]
Desktop Bottom Promotion