For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కొత్త సంవత్సరంలో పార్టీలకు బదులుగా మీరు చేయగలిగిన అద్భుతమైన పనులు

సరే, మీరు మీకు ఇష్టమైన వారితో కలిసి ఈ కొత్త సంవత్సర౦ మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి కొన్ని అద్భుతమైన సలహాలు ఇవ్వబడ్డాయి వాటిని అనుసరించండి.

By Lekhaka
|

2017 కొత్త సంవత్సరానికి ఇంకా 3 మూడు వారాలు మాత్రమే ఉంది. ప్రపంచం మొత్తం దీనికోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తుంది, మీరు మటుకు ఎదో ప్రత్యేకంగా చేయడానికి సన్నద్దమౌతున్నారు, కదా? మీరు పార్టీ చేద్దాం అనుకుంటున్నారు కదూ?

ఇప్పటికే చాలామంది వేదికను బుక్ చేసే ఉంటారు, మాకు తెలుసు, ఎంతో శక్తితో అద్భుతమైన డాన్స్ లు చేస్తారు. చాలామంది హౌస్ పార్టీలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసుకొని ఉంటారు కూడా. పచ్చిక మీద ఎరుపు వైన్ తో మత్తు కలిగించే రాత్రి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక.

కానీ, ప్రతి కొత్త సంవత్సరం రోజు మీరు చేసుకునే పార్టీలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే రాబోయే సంవత్సరాన్ని కొద్దిగా భిన్నంగా పూర్తి వైవిధ్యంతో చేయడం ఎందుకు ప్రారంభించ కూడదు?

రాబోయే కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలంటే ఎన్నో అద్భుతమైన వినూత్న మార్గాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా మీ మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి. ఇంతవరకు ఎపుడైనా మీరు ఇలాంటి ప్రణాళిక వేసారా?

సరే, మీరు మీకు ఇష్టమైన వారితో కలిసి ఈ కొత్త సంవత్సర౦ మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి కొన్ని అద్భుతమైన సలహాలు ఇవ్వబడ్డాయి వాటిని అనుసరించండి.

1. దూర ప్రయాణాలు చేయండి:

1. దూర ప్రయాణాలు చేయండి:

మీరు కొత్తగా పెళ్ళైన వారైనా లేదా మధ్యవయసు వారైనా ఈ కొత్త సంవత్సరం రోజు దూర ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటే ఇది నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రయాణానికి వెళ్ళే ముందు కారు పరిస్థితిని చూసుకోండి, ఎప్పుడూ వెళ్ళే ప్రదేశాలకు కాకుండా ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇద్దరూ కలిసి కొత్త సంవత్సరం రోజు సూర్యోదయాన్నిఆనందించండి, ఆ క్షణం ఎప్పటికీ మీ హృదయాలలో చెరగని ముద్రగా ఉంటుంది.

2. మూవీకి ఏర్పాట్లు చేసుకోండి:

2. మూవీకి ఏర్పాట్లు చేసుకోండి:

సంవత్సరం మొత్తం, మీరు మీ భాగస్వామితో గడపడానికి సమయం కుదరకపోవచ్చు. ఈ కొత్త సంవత్సరం రోజు, మీకు ఇష్టమైన సినిమాలలో ఒకదానిని ఎంచుకుని రాత్రికి వెళ్ళండి. ఆరాత్రి మీకు ఇష్టమైన మూవీల DVDs తెచ్చుకుని, వాటిని చూడడం ప్రారంభించండి. స్నాక్స్, డ్రింక్స్ తో సినిమాలు చూస్తూ మీ భాగస్వామిని ఆనంద పరచండి.

3. కార్డ్లు తయారుచేయడం:

3. కార్డ్లు తయారుచేయడం:

మీరు పూర్తిగా కుటుంబపరమైన వ్యక్తి అయితే, మీరు మీ పిల్లలతో కలిసి ఏదైనా సరదాగా చేయాలి అనుకుంటే, ఇది నిజంగా మంచి ప్రణాళిక. మీరు కొత్త సంవత్సరానికి కనీసం వారం రోజుల ముందైనా ఈ పనులను ప్రారంభించాలి, అప్పుడే మీరు మీకు ఇష్టమైన వారికి అద్భుతమైన కార్డ్ లు తయారుచేయగలరు. మీ పిల్లలకు ఈ పనులు అప్పగిస్తే, వారు చాలా ఆనందిస్తారు అనడంలో సందేహం లేదు.

4. అనాధ పిల్లలతో సరదాగా ఉండడం:

4. అనాధ పిల్లలతో సరదాగా ఉండడం:

కొత్త సంవత్సర వేడుకలను విభిన్నంగా జరుపుకోవాలి అనుకుంటున్నారా? అన్నీ కోల్పోయిన పిల్లల కోసం మీరు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి. మంచి బహుమతులు ఇవ్వడం, భోజనం ఏర్పాటుచేయడం, ఇంకా వారి కొత్త సంవత్సరం ఇతర సరదా పనులతో కూడుకుని ఉండేట్లు చేయవచ్చు.

5. ఆరోజును వృద్దాశ్రమంలో గడపడం:

5. ఆరోజును వృద్దాశ్రమంలో గడపడం:

సంవత్సరం మొత్తం వారు వారికి దగ్గరి వాళ్ళను చూడాలని ఎన్నో కోరికలతో పాడుకుంటారు. వారి కొత్త సంవత్సరానికి ప్రత్యేకతను కలిగించ గలరా? వారితో మీరు రోజు గడిపితే, ఎంత ఆప్యాయతతో స్వాగతాన్ని పొందిన అనుభూతిన పొందుతారు. అది చాలు మీ మనసు ఆనందంతో నిండిపోవడానికి.

6 కలిసి వంటచేయడం:

6 కలిసి వంటచేయడం:

కొత్త సంవత్సరం రోజు డిన్నర్ అనేది నిజంగా చాలా ప్రత్యేకమైనది. మీరు మీ భాగస్వామితో కలిసి వంటచేసి, ఈ మొత్తం అనుభవాన్ని ప్రేమతో, ఒక ప్రత్యేకతను ఎందుకు తాలేరు? మీరు ఎంతో హాయిని పొందుతారు, అలాగే సరదాగా ఉంటుంది, చివరగా ఇద్దరూ కలిసి రుచికరమైన వంటలు చేయోచ్చు.

7. మీ పాత జ్ఞాపకాల అనుభూతిని పొందడం:

7. మీ పాత జ్ఞాపకాల అనుభూతిని పొందడం:

పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం అనేది నిజంగా చాలా ప్రత్యేకమైనది. మీకు ఇష్టమైనవారి చేతులు పట్టుకుని, మీరు మొట్టమొదటగా కలిసిన ఆ ప్రదేశాన్ని సందర్శించడం అనేది నిజంగా అద్భుతం. మీరు ఈ కొత్త సంవత్సరం వేడుకలో ఇలా చేస్తే, ఇలాంటి ప్రేమతో కూడిన జ్ఞాపకాలు మీ ఇద్దరి ఆనందాన్ని ఇనుమడింప చేస్తాయి.

English summary

Amazing Things You Can Do Instead of Partying This New Year

Did you know that there are several other ways to welcome new year instead of partying. Read to know some of the amazing things that you can do instead of partying.
Story first published: Saturday, December 17, 2016, 10:43 [IST]
Desktop Bottom Promotion