For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం గురించి మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

మనుషుల పుట్టుకే ఓ అద్భుతం. రక్తపు ముద్దలా ఏర్పడి.. కాళ్లు, చేతులు, మెదడు, గుండె.. ఇలా రకరకాల అవయవాలు కడుపులోనే పొంది.. భూమ్మీదకు మనిషి రూపంలో వస్తాడు. అవయవాల పనితీరు, వాటిలో వచ్చే మార్పులు అన్నీ గమనిస్తే.. అంతా అద్భుతంలా అనిపిస్తుంది. అలాంటి మానవ శరీరంలో మీకు తెలియని, మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు మరెన్నో ఉన్నాయి.

మనుషుల ఆలోచనలు, ఫీలింగ్స్ గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!! మనుషుల ఆలోచనలు, ఫీలింగ్స్ గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!

ప్రకృతి ఉత్పత్తి చేసే, ప్రసాదించే ప్రతిదీ వండరే. వస్తువులైనా, జంతువులైనా, మనుషులైనా.. ప్రకృతి వడి నుంచి జారిన ఏదైనా.. అద్భుతమైనవే. కానీ మనుషుల శరీరం మాత్రం అన్నింటికంటే.. చాలా అద్భుతమైనది. మనుషుల రూపు రేఖలు, రంగు, అవయవాలు.. ఇలా రకరకాల భాగాలు, వాటి పనితీరు గురించి ఒక్కసారి ఆలోచిస్తే.. చాలా వండర్ అనిపిస్తాయి. మరి ఇన్ని అద్భుతాలున్న మానవ శరీరం గురించి ఆసక్తికర నిజాలు మీకోసం..

హార్ట్

హార్ట్

శరీరంలో హార్ట్ చాలా హార్డ్ వర్క్ చేసే అవయవం. ప్రతి రోజూ.. 30 కిలోమీటర్లు చిన్న ట్రక్ ప్రయాణం చేయడానికి కావాల్సిన శక్తిని క్రియేట్ చేస్తుంది. జీవితకాలంలో గుండె చంద్రుడి దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేందుకు కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందన్నమాట.

బ్రెయిన్

బ్రెయిన్

అమేజింగ్ బ్రెయిన్ 60 శాతం ఫ్యాట్ కలిగి ఉంటుంది. కానీ.. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా.. 25 వాట్ల పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది.

చర్మం

చర్మం

చర్మం మానవ శరీరంలో అతి పెద్ద అవయవం. ప్రతి నిమిషానికి మీ చర్మం 50 వేల కణాలను బయటకు పంపి.. కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది. జీవితకాలంలో 18.1 కేజీ చర్మాన్ని క్రియేట్ చేస్తుంది.

ఆలోచనా శక్తి

ఆలోచనా శక్తి

మీ మెదడు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకి దాదాపు 70 వేల ఆలోచనలు చేస్తారని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

ఎముకలు

ఎముకలు

మనుషులు పుట్టేటప్పుడు 300 లకు పైగా ఎముకలు ఉంటాయి. పెద్దవాళ్ల అయ్యేసరికి.. 206 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే.. కొన్ని ఎముకలు ఒకదానికొకటి కలవడం వల్ల ఈ లెక్క మారుతుంది.

గర్భాశయం

గర్భాశయం

గర్భాశయంలో బేబీ.. ప్రతి సెకనుకు 8వేల కొత్త మెదడు కణాలను పెంచుతారు. అప్పుడే పుట్టిన బిడ్డ తన తల్లి ముఖాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించగలడు.

బ్రెయిన్ ఫీలింగ్

బ్రెయిన్ ఫీలింగ్

బ్రెయిన్ కి స్వతహాగా ఎలాంటి నొప్పి ఉండదు. దానికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. అందుకే బ్రెయిన్ సర్జరీలను పేషంట్ మెలకువగా ఉండగానే చేస్తారు.

రక్త శుద్ధి

రక్త శుద్ధి

జీవిత కాలంలో గుండె 1.5 మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని శుద్ధి చేస్తుంది.

తుమ్ము వేగం

తుమ్ము వేగం

మనుషుల తుమ్ము వేగగం ఎంతో తెలుసా ? అది గంటకు 64 కీలోమీటర్ల వేగంతో ఉంటుందట. అంటే.. పులి పరుగుతో సమానమనమాట.

ధమనులు

ధమనులు

ధమనులు ఎంత పొడవు ఉంటాయో తెలుసా ? ఎండ్ లేకుండా ఉండే.. వీటి పొడవు.. లక్ష కిలోమీటర్లు అట.

హెయిర్

హెయిర్

మీ జుట్టు నాలుగు వారాలకు ఒకసారి.. ఒక ఇంచు పెరుగుతుందట. అలా ఆరు నెలలు పెరిగి.. తర్వాత ఊడిపోతుంది. మళ్లీ అదే ప్లేస్ కొత్త హెయిర్ పెరుగుతుంది.

వాసన

వాసన

మెదడు.. 50 వేల రకాల సెంట్ లను గుర్తు పెట్టుకోగలదట.

ఐరన్

ఐరన్

శరీరంలో సరిపడా ఐరన్ ఉంటే.. మూడు ఇంచుల ములికి తయారు చేయవచ్చు.

కన్ను

కన్ను

మనుషుల కన్ను డిజిటల్ కెమెరా లాంటిది. ఇందులో 576 మెగాపిక్సెల్స్ ఉంటాయి. కన్ను 10 మిలియన్ల వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదు.

నీళ్లు

నీళ్లు

మనుషులు తమ జీవితకాలం మొత్తంలో 75వేల లీటర్ల నీళ్లు తాగుతారు.

ముక్కు, చెవి

ముక్కు, చెవి

మీకు తెలుసా ? మనుషుల ముక్కు, చెవి పెరగడం ఎప్పటికీ ఆగదు. జీవితకాలం పెరుగుతూనే ఉంటుంది.

స్టోరేజ్ స్పేస్

స్టోరేజ్ స్పేస్

మీ మెదడు లాంగ్ టర్మ్ మెమరీ కలిగి ఉంటుంది. 40 ఏళ్ల వరకు దీన్ని డెవలప్ చేయవచ్చు. అప్పటి వరకు 1 మిలియన్ బిలియన్ సెపరేట్ బిట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు.

హార్ట్ బీట్

హార్ట్ బీట్

హార్ట్ బీట్ మీరు వింటున్న మ్యూజిక్ ని బట్టి మారుతూ ఉంటుంది.

టంగ్ ప్రింట్స్

టంగ్ ప్రింట్స్

ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా.. ప్రతి వ్యక్తి.. వేర్వేరు టంగ్ ప్రింట్స్ కలిగి ఉంటాడు.

టేస్ట్ బడ్స్

టేస్ట్ బడ్స్

మీ నోరు దాదాపు 10 వేల టేస్ట్ బడ్స్ కలిగి ఉంటుంది.

ఎముకల కలర్

ఎముకల కలర్

మీకు తెలుసా ఎముకల కలర్ ఏంటో ? అందరూ వైట్ గా ఉంటాయని అనుకుంటారు. కానీ.. ఎముకల కలర్ లైట్ బ్రౌన్ గా ఉంటాయి. మ్యూజియంలో పెట్టే ఎముకలను ఉడికించి.. క్లీన్ చేసి పెడతారు అందుకే.. అవి తెల్లగా ఉంటాయి.

గుండె కొట్టుకోవడం

గుండె కొట్టుకోవడం

ఒకవేళ మనుషుల శరీరం నుంచి గుండెను తీసినా కూడా.. కొంత సమయం వరకు.. అది కొట్టుకుంటూనే ఉంటుంది. అందులో ఉండే.. ఎలక్ట్రికల్ ఇంపల్సే దీనికి కారణం.

లాలాజలం

లాలాజలం

ఒక మనిషి.. రోజుకి ఒక లీటర్ లాలాజలం ఉత్పత్తి చేస్తాడట. అంటే జీవితకాలంలో.. 23 వేలకు పైగా లీటర్లు. రెండు స్వీమ్మింగ్ పూల్స్ ఫిల్ చేయగలిగే సామర్థ్యం.

ఏజ్

ఏజ్

మనుషుల మెడదు వాళ్ల వయసు రెండేళ్లు ఉన్నప్పుడు మిగిలిన వయసుతో పోల్చితే ఎక్కువ కణాలు కలిగి ఉంటుంది. కానీ అవి మెచ్యూర్ అవడానికి 20 ఏళ్లు పడుతుంది.

డీఎన్ఏ సెల్స్

డీఎన్ఏ సెల్స్

డీఎన్ఏ సెల్స్ మనుషుల శరీరంలో 10 మిలియన్ మైల్స్ దూరం స్ట్రెచ్ చేయవచ్చు.

English summary

Astounding Facts about the Human Body

Astounding Facts about the Human Body. Nature has produced many wondrous things, but few are more amazing than the human body. From your hard-working heart to your incredible brain, here are 26 facts to surprise you.
Desktop Bottom Promotion