Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మణికట్టుపై ఎన్ని గీతలున్నాయి ? అవి చెప్పే సర్ప్రైజింగ్ సీక్రెట్స్ ఏంటి ?
మనందరికి మణికట్టుపై వంపులుగా గీతలు ఉంటాయి. ఇవి మనచేతి నుంచి అరచేతిని వేరు చేసినట్టుగా కనిపిస్తాయి. వీటిని బ్రేస్ లేట్ లైన్స్ అని పిలుస్తాం. అరచేతిలోని గీతలను పట్టించుకున్నంతగా వీటిని పట్టించుకోము. కానీ.. ఈ లైన్స్ కి చాలా అర్థాలున్నాయట. ఆరోగ్యం, శ్రేయస్సు, గుర్తింపుని ఈ గీతలు వివరిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానంగా ఉంటే దేనికి సంకేతం ?
చేతి మణికట్టుపై ఎన్ని గీతలు ఉన్నాయి అనేదాన్ని బట్టి.. ఆ వ్యక్తి జీవితకాలం తెలుసుకోవచ్చని మెటాఫిజిక్స్ నాలెడ్జ్ వివరిస్తోంది. మీకు ఎక్కువ లైన్స్ ఉంటే.. ఎక్కువ రోజులు బతుకుతారని అర్థం. సాధారణంగా.. ఈ బ్రేస్ లేట్ లైన్స్ రెండు లేదా మూడు ఉంటాయి. కొంతమందికి నాలుగు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ చేతి మణికట్టుపై ఎన్ని గీతలున్నాయి, అవి చెప్పే సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం..

ఫస్ట్ లైన్
ఫస్ట్ బ్రేస్ లేట్ లైన్ చాలా క్లియర్ గా, కట్ అవకుండా ఉంటే.. 23 నుంచి 28 ఏళ్ల జీవితం ఉంటుందని అర్థం.

సెకండ్ బ్రేస్ లేట్ లైన్
సెకండ్ బ్రేస్ లేట్ లైన్ 46 నుంచి 56 ఏళ్ల జీవితాన్ని సూచిస్తుంది.

మూడు గీత
చేతి మణికట్టుపై ఎవరికైతే మూడో గీత కూడా ఉంటుందో.. వాళ్లు.. 69 నుంచి 84 ఏళ్లు బతుకుతారు.

నాలుగో గీత
చాలా అరుదుగా ఉండే నాలుగో గీత కూడా కలిగి ఉన్నవాళ్లు ఖచ్చితంగా 84 ఏళ్లు జీవిస్తారట.

వ్యక్తిత్వం
మొదటి లైన్ చాలా డీప్ గా, క్లియర్ గా, పక్కాగా ఉంటే.. ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారని మెటాఫిజిక్స్ నాలెడ్జ్ చెబుతోంది.

అనారోగ్యం
ఒకవేళ మొదటి గీత సరిగ్గా రూపొందకుండా, క్లారిటీగా కనిపించడం లేదంటే.. వాళ్లు చాలా అలసత్వంతో కూడిన వాళ్లని తెలుపుతుంది. అలాగే వాళ్లకు అనారోగ్య సమస్య ఉందని సూచిస్తుంది.

పైకి వంపుగా ఉంటే
మహిళలకు ఫస్ట్ లైన్ పైకి అంటే అరచేతివైపు వంపుగా తిరిగి ఉండటం లేదా లింక్స్ కట్ అయి ఉంటే.. వాళ్లకు గర్భాశయ సమస్యలు ఉండవచ్చని సంకేతం.

మగవాళ్ల లైన్
మగవాళ్ల ఫస్ట్ లైన్ అరచేతికి వైపుగా వంపు తిరిగి ఉన్నా, లింక్స్ కట్ అయినట్టు కనిపించినా.. ప్రొస్టేట్, యూరినరీ, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సంకేతం.

సెకండ్ బ్రేస్ లేట్ లైన్
మణికట్టుపై ఉండే రెండో గీత సంపన్నతను, సంతోషాన్ని, సంపదను, శ్రేయస్సుని సూచిస్తుంది.

సెకండ్ లైన్ స్ట్రెయిట్ గా
ఈ గీత స్ట్రెయిట్ గా, ఎలాంటి గ్యాప్స్ లేకుండా, చెయిన్ లింక్స్ కలిగి ఉంటే.. అత్యంత సంతోషంగా, సంపద కలిగి ఉంటారు.

మూడో వ్రిస్ట్ లైన్
మణికట్టుపై ఉండే మూడో గీత.. ఒక వ్యక్తి గుర్తింపుని సూచిస్తుంది.

మూడో గీత
ఒకవేళ మూడో గీత స్ట్రెయిట్ గా, ఎలాంటి గ్యాప్ లేకుండా ఉంటే.. సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి అవుతారు.

నాలుగో లైన్
మణికట్టుపై నాలుగో లైన్ చాలా అరుదుగా ఉంటుంది. ఇది మూడోలైన్ ని బలంగా మార్చడానికి సహాయపడుతుంది. సంతోషం, సంపద పొందడంలో ఇది సహకరిస్తుందన్నమాట.



Click it and Unblock the Notifications