మీ రాశి ప్రకారం మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది..?

Posted By: Staff
Subscribe to Boldsky

చాలామంది ప్రేమికులు వార్తాపత్రికలో జ్యోతిష్యశాస్త్రం కాలం చదువుతారు. వారు రోజు మొత్తంలో లేదా వారంలో వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే, రాశిఫలాలు అంటే ఏమిటి, నిజంగా అవి ఎంతవరకు పనిచేస్తాయి అనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. మన జీవితంలో రాశిఫలాల పాత్ర ఏమిటో కనుక్కుందాం.

రాశిఫలం అనేది రాశిచక్రంలోని జ్యోతిష్యశాస్త్ర గుర్తు, ఇది మీరు పుట్టినప్పుడు మీ రాశి పరిస్థితి ఏమిటో తెలియచేస్తుంది. రాశి ఒక వ్యక్తీ వ్యక్తిత్వాన్ని, వారి నిగ్రహాన్ని నిర్వహిస్తుంది. ఒక వ్యక్తీ అతడు/ఆమె తన జీవితంలో ఎలా నడుచుకుంటాడో తెలుసుకోవడానికి ఈ రాశి ఒక కారణం కావొచ్చు.

మీరు ఎటువంటి వ్యక్తో, మీ బలాలు, బలహీనతలు ఏంటో అర్ధంచేసుకోవడానికి ఈ రాశిఫలాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ రాశిఫలాల వల్ల మీరు మీ జీవితంలోని చదువు, పని, అంతేకాకుండా మీ ప్రేమ జీవితంలో విజయాలు లేదా అపజయాల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మీరు మీ భాగస్వామి అనేక విషయాలలో ఒకటిగా ఉండొచ్చు. కానీ మీ జాతకాలు కలవకపోతే, మీరు మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, మీ రాసిఫలం మీ భాగస్వామి రాశిఫలంతో కలిసిందా లేదా ఇక్కడే తెలుసుకోండి.

మేషం

మేషం

ఈ రాశిలో జన్మించినవారు చాలా కోరికలతో ఉంటారు. వారు వారి కెరీర్ లో ఎంత ఆకర్షణకు లోనవుతారంటే, దానికోసం వారిని ఇష్టపడేవారిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. వారి ప్రేమ మారిపోయి, వారిలో అనుమానపు ఛాయలు పెరుగుతాయి. మేషరాశి వారికి ప్రేమించేవారంటే ఎక్కువ మక్కువ కానీ ఆ అనుబంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవాలన్న ఆలోచన ఉండదు.

మేషరాశి వారికి మేషం, మిధునం, సింహం, ధనుస్సు రాశులు బాగా సరిపోతాయి.

మేషరాశి వారికి కర్కాటకం, కన్య, మకర రాశులు అసలు పనికిరావు.

వృషభం

వృషభం

వృషభరాశి వారు స్థిరంగా, నమ్మకంగా, సంప్రదాయబద్ధంగా ఉంటారు. వృషభరాశి వారు కుటుంబ ఆర్ధిక లెక్కలు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఆర్ధిక పరిస్థితి మన అధీనంలో లేవు అనిపిస్తే అసహజంగా ఉంటారు. వారు ప్రయోగాలూ చేయడానికి లేదా ఇంటి నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడరు.

ఈ రాశివారికి వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులు బాగా సరిపోతాయి.

వృషభరాశి వారికి సింహం, ధనుస్సు, కుంభ రాశులు అసలు పనికిరావు.

మిధునం

మిధునం

మిధునరాశి వారు వారి భాగస్వామి అవసరాలకు అనుగుణంగా వారి అవసరాలను మార్చుకుంటారు. వారిని అర్ధంచేసుకోవడం చాలా కష్టం. వారు ఆధిపత్యంతో కూడిన అద్భుతమైన భాగస్వామ్యులు, కానీ ఒక దిశలో స్పూర్తిని గుర్తించడంలో సహాయం కావాలి అనుకున్న భాగస్వాములు మటుకు విఫలం చెందుతారు. మిధున రాశివారు అతడు/ఆమె లోపాలను సరిదిద్దడానికి మీరు చాలా కటువుగా ఉండాలి.

మిధునరాశి వారికి తుల, మేషం, సింహం, కుంభరాశులు బాగా సరిపోతాయి.

మిధునరాశి వారికి వృశ్చికం, మకరం, మీనరాశులు అసలు పనికిరావు.

కర్కాటకం

కర్కాటకం

వీరు అత్యంత శృంగార వ్యక్తిత్వం కలవారు, ఈ రాశివారు ప్రేమకోసం ఏమైనా చేస్తారు. ఈ కర్కాటక రాశివారు కొద్దిగా బాధపడ్డారని భావిస్తే, అతను/ఆమె మిమ్మల్ని వారి జీవితం నుండి బైటికి నెడతారు, తరువాత తిరిగి కొంతసమయం తరువాత ఆ విషయాన్నీ పరిష్కరించుకుంటారు. అదేవిధంగా వారు చాలా కఠినంగా, మనోభావాలు కలిగి ఉంటారు.

కర్కాటక రాశి వారికి వృషభం, కర్కాటకం, వృశ్చికం, మీనరాశులు బాగా సరిపోతాయి.

కర్కాటకరాశి వారికి మేషం, తుల, ధనుస్సు రాశులు అసలు పనికిరావు.

సింహం

సింహం

సింహరాశి వారు అద్భుతమైన ప్రేమికులు, నిజమైన భాగస్వాములు. కానీ వారిలో స్వార్ధం అనేది ఒక చెడు భాగం. వారు శ్రద్ధగా ప్రేమిస్తారు, చాలా గొప్ప ఆలోచనలతో జీవితంలో విజయం సాధించడానికి ఏదైనా చేస్తారు, కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా పణంగా పెడతారు. సింహరాశి వారు వారి ప్రేమతో ఇతరులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తారు.

సింహరాశి వారికి తుల, మేషం, మిధునం, సింహ౦, ధనుస్సు రాశులు బాగా సరిపోతాయి.

సింహరాశి వారికి వృషభం, వృశ్చికం, మకరం, మీనరాశులు అసలు పనికిరావు.

కన్య

కన్య

కన్యరశివారు నమ్మకంగా, అందంగా, ఆచరణ యోగ్యంగా ఉంటూ, తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టడానికి నిజాయితీగా ఆశక్తి చూపిస్తారు. కన్యారాశి పురుషులు పిరికివారుగా పరిగణించబడతారు కానీ ఈ లక్షణాలు మాత్రమే వారిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

కన్యారాశి వారికి వృషభం, కర్కాటకం, కన్య, మకర రాశులు బాగా సరిపోతాయి.

కన్యారాశి వారికి మేషం, ధనుస్సు, కుంభ రాశులు అసలు పనికిరావు.

తుల

తుల

ఈ రాశివారు సమతౌల్యంగా ఉండడానికి ఒక కారణం ఉంది. తులారాశి వారు తెల్లగా, సమతుల్యంగా ఉంటారు. వీరు త్యాగమూర్తులుగా, వారి సంబంధాలు నిలుపుకోవడానికి చివరి వరకు సహనంగా ఉంటారు. తులారాశి వారు కూడా సరసంగా ఉంటారు, వారు తరచుగా వారి భాగస్వాములతో వాదించే బదులు వదిలేస్తారు.

తులారాశి వారికీ మిధునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు బాగా సరిపోతాయి.

తులారాశి వారికి కర్కాటకం, మకరం, మీన రాశులు అసలు పనికిరావు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశి వారు శృంగారం అనేది ఒక విషయంగా అనుకుంటారు. వీరు శృంగార లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు కానీ ఇతరులకు పైకి కనిపించకుండా వారు చాలా సున్నితంగా, భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. వారు ఆధ్యాత్మికులు కూడా.

వృశ్చిక రాశివారికి కర్కాటకం, కన్య, మకరం, మీనరాశులు బాగా సరిపోతాయి.

వృశ్చిక రాశివారికి మిధునం, సింహం, కుంభ రాశులు అసలు పనికిరావు.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశివారు చాలా సానుకూలంగా, జీవితం పట్ల స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వారి పక్కన ఉన్నవారిలో వారు మంచిని మాత్రమే చూస్తారు. వారు స్వతంత్రంగా ప్రేమిస్తారు, ఎవరైనా తనను నియంత్రిస్తారు అనుకుంటే ద్వేషిస్తారు.

ధనుస్సు రాశివారికి మేషం, తుల, సింహం, కుంభ రాశులు బాగా సరిపోతాయి.

ధనుస్సు రాశివారికి వృషభ౦, కర్కాటకం, కన్య, మీన రాశులు అసలు పనికిరావు.

మకరం

మకరం

మకరరాశి వారు తమ సహచరులతో చాలా గంభీరంగా, ఉత్సాహంగా ఉంటారు. వారు ఎవర్నీ త్వరగా నమ్మరు కానీ ఒక వ్యక్తిని నమ్మితే జీవితాంతం అతనితో ఉంటారు. వారికి వారి భాగస్వామి అతను/ఆమె ప్రేమ నుండి స్థిరమైన నమ్మకం అవసరం.

మకర రాశివారికి వృషభం, కన్య, మకరం, మీన రాశులు బాగా సరిపోతాయి.

మకర రాశివారికి మేషం, మిధునం, సింహం, తుల రాశులు అసలు పనికిరావు.

కుంభం

కుంభం

కుంభ రాశివారికి వారి భాగస్వామి గురించి అధిక ఆదర్శాలు ఉంటాయి. వీరు చాలా ఆకర్షణీయంగా, వారి భాగస్వాములను ఆకర్షించే విధంగా ఉంటారు. అంతేకాకుండా వారు వారి భాగస్వాములతో చాలా నిజాయితీగా కూడా ఉంటారు.

కుంభ రాశివారికి మేషం, మిధునం, తుల, ధనుస్సు రాశులు బాగా సరిపోతాయి.

కుంభ రాశివారికి వృషభ౦, కర్కాటకం, వృశ్చికం, కన్య రాశులు అసలు పనికిరావు.

మీనం

మీనం

మీనరాశి వారు పూర్తి భావోద్వేగాలను పాటిస్తూ ఉంటారు. వారు ఖచ్చితంగా నమ్మకస్తులు, అతి ప్రేమ కలవారు కానీ త్వరగా బాధపడతారు, కోపం కూడా వస్తుంది.

మీన రాశివారికి వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులు బాగా సరిపోతాయి.

మీన రాశివారికి మిధునం, సింహం, తుల, ధనుస్సు రాశులు అసలు పనికిరావు.

English summary

Does Your Zodiac Sign Affect Your Love Life?

Many of us love to read the astrology column in the newspaper. We all want to know what our sun signs predict for us for the entire day or the week. However there are only a few of us who really know what sun signs mean and how exactly they work. Let us find out what is the role of our sun sign in our lives.
Story first published: Wednesday, September 21, 2016, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter