For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఫోటో జెనిక్ ఫేస్ తో కనిపించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ..!

|

పైకి ఒప్పుకున్నా...ఒప్పుకోకపోయినా, ఫోటో దిగడమంటే చాలా మందికి ఆసక్తే..కానీ స్వతహాగా అందంగానే కనిపించే వాళ్ల ఫోటోలు కూడా అప్పుడప్పుడు అందంగా ఉండవు. అందుకే నా ఫేస్ ఫోటోజెనిక్ కాదు...' అంటూ తప్పించుకుంటూ ఉంటారు. కొంత మంది. కానీ ఇకపై మీకు ఆ బాధలు ఉండవు. మీరు కూడా ఫోటోల్లో అందంగా కనిపిస్తారు. ఆ మాటకొస్తే మీరు నార్మల్ గా కనిపించేదానికంటే ఫోటోల్లోనే అందంగా కనిపిస్తారు. ఎలాగంటారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి...

Easy Steps to Looking More Photogenic

అమ్మాయిలను, అందాన్ని వేర్వేరు చేసి చెప్పలేం...అలా చెప్పడం కష్టం కూడా... మరి అందమైన అమ్మాయిలు ఫోటోల్లో మరింత బ్యూటిఫుల్ గా కనిపించాలంటే ఫోటో తీయించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కెమెరా యాంగిల్ నుంచి, మీ మేకప్, లుక్, డ్రెస్సింగ్ ఇలా ప్రతి ఒక్క విషయంపైనా శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే చక్కని ఫోటోలు వస్తాయి. చక్కని ఫోటోల కోసం ముఖ్యంగా మీ రూపం, ఎక్స్ ప్రెషన్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

Easy Steps to Looking More Photogenic

లుక్స్ :
ఫోటోలు తీసుకునేటప్పుడు ముఖం అందంగా కనిపించడం చాలా అవసరం. అందుకే మీ ఫేస్ లో అందంగా కనిపించే భాగం ఏదో దాన్ని హైలెట్ చేయండి. నీట్ గా మొహం కడుక్కొని మేకప్ చేసుకోండి. దీని వల్ల అందంగా కనిపిస్తారు. ఫోలోలో అందంగా కనిపించేందుకు ముదురు రంగు డ్రస్సులను ఉపయోగించండి. అప్పుడే కలర్ ఫుల్ ఫోటోలను తీసుకోగలుగుతారు. ఒక వేళ మీరు లావుగా ఉంటే, సన్నగా కనిపించే డ్రస్ వేసుకోండి. సన్నగా ఉంటే కాస్త లావుగా కనిపించేలా చూసుకుంటే బాగుంటుంది.

Easy Steps to Looking More Photogenic

మైనస్ , ప్లస్ లపై ఫోకస్ :
ఫోటో తీయాలనుకుంటున్నప్పుడు మీ ముఖంలో మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లపైన ఫోకస్ చేయాలి. మీ మైనస్ పాయింట్లు ఏమనుకుంటున్నారో వాటిని ఫోటోలో కనిపించకుండా ఎలా చేయాలో చూసుకోండి. ఉదాహరణకు మీకు డబుల్ చిన్ ఉంటే ఒక పక్కకి వంగి ఫోటో తీసుకోవడం వల్ల డబుల్ చిన్ కనిపించదు. సన్నగా ఉన్నవాళ్లకు సైడ్ యాంగిల్ ఫోటో బాగుంటుంది. మీరు ఏ యాంగిల్లో అందంగా కనిపిస్తున్నారో తెలుసుకోవాలి. దీని కోసం అద్దం ముందు కొన్ని ట్రయల్స్ వేయొచ్చు. మీరు అందంగా కనిపించే యాంగిల్స్ లోనే ఫోటో ను తీసుకోంటి...

Easy Steps to Looking More Photogenic

నవ్వుతూ ఉండండి:
ఫోటోలలో మరీ బిగుసుకుపోయినట్లు కాకుండా హాయిగా నవ్వండి. మీ నవ్వు మొహమే అందంగా కనిపిస్తుంది. మీ నవ్వు అందంగా ఉండదని మీరు భావిస్తూ ఉంటే కనీసం చిన్న స్మైల్ ఇవ్వచ్చు. . దీని వల్ల ఫోటో చూసిన వాళ్లకు కూడా ఈ హ్యాపి ఫీలింగ్ తెలుస్తుంది. అందరికీ మీ ఫోటో నచ్చేలా చేస్తుంది. ఫోటో తీసేటప్పుడు మీ కళ్లలో కూడా ఆనందం కనిపించేలా చూసుకోండి. దీనికోసం మీరు అందరి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో వాళ్లను తల్చుకోండి. ఏదైనా జోక్ గుర్తుకు తెచ్చుకోండి. వెంటనే నవ్వొస్తుంది.

Easy Steps to Looking More Photogenic

కెమెరా లేదు:
మీరు ఫోటో దిగేటప్పుడు అక్కడ కెమెరా ఉంది. ఫోటోతీస్తున్నారు అంటూ ఆలోచింరకండి. దీని వల్ల నేచురల్ గా కాకుండా ఫోటో కోసం నవ్వినట్టు కనిపిస్తుంది. ఫోటో తీయట్లేదు అనుకుని చక్కగా నవ్వండి. మీరు చూడటం కూడా డైరెక్ట్ గా లెన్స్ ని చూడకుండా పక్కకి ఏదో ఒక వైపు చూస్తూ ఉంటే అది సహజంగా కనిస్తుంది. ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఉంటే ఇంకా అందంగా వస్తుంది. ఫోటో తీయట్లేదు అనుకున్నప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు. మీ కీళ్లను సాధ్యమైనంత లూజ్ గా వదిలేస్తారు. దీని వల్ల ఫ్రీలుక్ వస్తుంది.

English summary

Easy Steps to Looking More Photogenic

Most of the women are conscious about their appearance on camera. They feel their face is not photogenic. This feeling comes when you feel your face is fat, dark skin or dark circles. Even makeup can sometimes make you feel its too bright and dry. Therefore, if you want to look good in pictures every time you are clicked, here are few beauty tips and tricks to appear photogenic.
Story first published: Monday, October 10, 2016, 12:32 [IST]
Desktop Bottom Promotion