For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొట్ట బుగ్గల అందం వెనక ఉన్న ఆశ్చర్యకర విషయాలు..!!

By Swathi
|

పెద్ద కలువల్లాంటి కళ్లు, విల్లులా తిరిన సన్నని కనుబొమ్మలు, గులాబీ లాంటి ఎర్రని పెదాలు, చెక్కినట్టు ఉండే ముక్కు, అందమైన చిరునవ్వు, నవ్వితే ముత్యాల్లా ఉండే పలువరుస.. ఇవన్నీ అమ్మాయిల అందానికి చిరునామా అయితే.. నవ్వినప్పుడు చినుకులా వచ్చే సొట్టలు మరో ఆకర్షణీయమైన ఆస్తి.

ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !!

కొందరికి కళ్లు అట్రాక్షన్‌ గా ఉంటే ఇంకొందరిలో ముఖ వర్చస్సు, ఇంకొందరికి జుట్టు.. ఇలా ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. గిలిగింతలు పెట్టే సొట్టబుగ్గలు.. చాలా అరుదుగా ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తాయి డింపుల్స్. సొట్ట బుగ్గలు కనిపించే అమ్మాయిలను చాలా ఆకర్షణీయమైన, అందమైన అమ్మాయిలుగా చెబుతారు. మరి సొట్ట బుగ్గలు అందానికే చిహ్నమా ? లేదా అనారోగ్యమా ? లేదా అదృష్టానికి సంకేతమా ? తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ పై ఓ లుక్కేయాల్సిందే..

సొట్ట బుగ్గలు అంటే ?

సొట్ట బుగ్గలు అంటే ?

చర్మంలో గుంటలా ఏర్పడే దాన్ని సొట్ట అని పిలుస్తారు. ఇది చర్మానికి ఆధారమైన కండ ఆ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ సొట్ట ఏర్పడుతుంది. ఇవి బుగ్గలపై ఏర్పడతాయి.

జన్యు కారకాలు

జన్యు కారకాలు

జన్యుపరమైన కారణాల వల్ల.. ఈ సొట్ట బుగ్గలు ఏర్పడతాయి. ఇది ఆ వ్యక్తి నవ్వినప్పుడు ప్రధాన కండరాలు చర్మాన్ని లోపలికి లాగినప్పుడు ఈ సొట్టలు ( డింపుల్స్ ) ఏర్పడుతాయి.

జ్యోతిష్యం

జ్యోతిష్యం

ఇదొక ఫీచర్ అన్న సంగతి పక్కన పెడితే.. దీని వెనక జ్యోతిష్యం చాలానే ఉంది. సొట్ట బుగ్గలు కలిగిన వాళ్ల జీవితం వాళ్లలాగే అందంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది.

మ్యారేజ్ లైఫ్

మ్యారేజ్ లైఫ్

విష్ణు పురాణం ప్రకారం సొట్ట బుగ్గలు కలిగిన మగువలకు వైవాహిక జీవితం చాలా బాగుంటుందట.

ప్రేమ, గౌరవం

ప్రేమ, గౌరవం

సొట్ట బుగ్గలు కలిగిన మహిళలు తమ భర్త పట్ల మంచి సంబంధం కలిగి ఉంటారు. అమితమైన ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు. భాగస్వామికి కావాల్సిన ప్రేమ పంచుతారు.

కుటుంబ సమస్య

కుటుంబ సమస్య

అయితే సొట్ట బుగ్గలు ఉన్న మహిళలు అత్తగారి ప్రేమను పొందలేరు. సొట్ట బుగ్గల అమ్మాయికి అత్తగారు ఉండరు.. లేదా పెళ్లి తర్వాత కొంతకాలానికే మరణిస్తారు.

శుక్రుడు

శుక్రుడు

శుక్రుడు వీళ్ల లైఫ్ లో బలంగా ఉండటం వల్ల.. చాలా అందమైన, ఆనందకరమైన లవ్ లైఫ్ పొందుతారు.

ఫన్ లవింగ్

ఫన్ లవింగ్

సొట్ట బుగ్గలు కలిగిన అమ్మాయిలు జీవితాన్ని పూర్తీగా అనుభవిస్తారు.

బర్త్ డిఫెక్ట్

బర్త్ డిఫెక్ట్

బుగ్గలపై సొట్ట కలిగిన అమ్మాయిలకు కొన్ని రకాల బర్త్ డిఫెక్ట్ లు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎదుగుదల సమస్య

ఎదుగుదల సమస్య

సొట్ట బుగ్గలు ఏర్పడటాన్ని గ్రోత్ డిజార్డర్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. చర్మం కింద ఉండే టిఫ్యూ.. పిండం ఎదుగుదల సమయంలో ఏర్పడకపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి.

వారసత్వం

వారసత్వం

డింపుల్స్ పై వారసత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి కేవలం ఒక జనరేషన్ కి మాత్రమే వారసత్వంగా వస్తాయి.

తల్లిదండ్రుల నుంచి

తల్లిదండ్రుల నుంచి

ఒకవేళ మీ తల్లిదండ్రులకు సొట్ట బుగ్గలు ఉంటే.. మీరు వారసత్వంగా వాటిని పొందడానికి 25 నుంచి 50 శాతం అవకాశం ఉంది. ఒకవేళ మీ తల్లి, తండ్రి ఇద్దరికీ డింపుల్స్ ఉంటే.. మీరు సొట్ట బుగ్గలు పొందడానికి 50 నుంచి 100 శాతం అవకాశం ఉంది.

యూత్

యూత్

డింపుల్స్ కి యూత్ కి కనెక్షన్ ఉంది. కొంతమందికి యుక్తవయసులో డింపుల్స్ కనిపిస్తాయి. కానీ.. ఆ తర్వాత వయసు పెరిగిన తర్వాత అవి కనుమరుగయ్యే అవకాశం ఉంది.

కండరాల కారణంగా

కండరాల కారణంగా

వయసు పెరిగిన తర్వాత ఎందుకు అవి కనుమరుగు అవుతాయి ? అంటే.. కండరాలు పెరుగుతూ ఉంటాయి.. దీనివల్ల అవి మూసుకుపోతాయి.

అధిక కొవ్వు

అధిక కొవ్వు

కొన్ని సందర్భాల్లో ముఖంపై అధిక కొవ్వు ఏర్పడటం వల్ల కూడా సొట్ట బుగ్గలు వస్తాయి. ఇలా వచ్చిన సొట్టలు.. శాశ్వతం కాదు. ఇవి కొంతకాలానికి అంటే ఫ్యాట్ కరిగిన తర్వాత కనుమరుగయ్యే అవకాశం ఉంది.

Story first published:Monday, April 25, 2016, 16:03 [IST]
Desktop Bottom Promotion