For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ?

|

ఒక్కసారి చనిపోతున్న క్షణాలను గుర్తు చేసుకోండి. చనిపోతున్నప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి ? ఫ్యామిలీ ? ఫ్రెండ్స్ ? సమస్యలు ? దేవుడిని ఒక్కసారి దేవుడా ? అని తలుచుకుంటారు కదూ. అసలు మరణం అంటే ఏంటి ? మనం చనిపోయిన తర్వాత మనకు ఏమవుతుంది ? చనిపోయిన తర్వాత మనకు ఏమవుతుందన్న భయం, ఆందోళన ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

చనిపోయిన తర్వాత మనం ఈ లోకంతో సంబంధం తెంచుకుంటామా ? మనకు ఈ జీవితం గురించి గుర్తు ఉండదా ? చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది ? చనిపోయిన తర్వాత కూడా మనం ఇలాంటి ఆలోచనలు చేయగలుగుతామా ? అసలు మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ? అనేది ప్రతి ఒక్కరినీ వేధించే ప్రశ్న..

మరణం అంటే ఈ లోకంతో, సంబంధాలు, బంధుత్వాలు, ఆలోచనలు, ప్రేమ, శత్రుత్వం.. ఇలా ఏది ఉండదు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటాం. అందుకే.. మరణం అంటే ప్రతి ఒక్కరికీ.. ఆందోళనే. వణుకే. చావు దగ్గరపడుతుంటే.. ప్రతి ఒక్కరూ.. భయంతో క్రుంగిపోతారు. అసలు మరణం తర్వాత మనకు ఏమవుతుంది ? మన జీవితం ఉంటుందో ? తెలుసుకుందాం..

మరణం, జీవితం గురించి సైన్స్

మరణం, జీవితం గురించి సైన్స్

మరణం తర్వాత జీవితం గురించి సైన్స్ పెద్దగా ఏమీ స్టడీస్ చేయలేదు. సైన్స్ కేవలం సెన్స్ అంటే ఆలోచనల గురించి ఎనాలసిస్ చేసింది. మనిషి చనిపోయాడని ప్రకటించిన తర్వాత అంటే గుండె కొట్టుకోవడం ఆగిన తర్వాత.. 30 సెకన్లకు మెదడు పనితీరు ఆగిపోతుంది. శరీరం మొత్తానికి రక్తప్రసరణ ఆగిన తర్వాతే.. మెదడులో ఆలోచనలు ఆగిపోతాయని సైన్స్ నిరూపించింది.

MOST READ: శరీరం గురించి మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!MOST READ: శరీరం గురించి మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!

చావు తప్పదు

చావు తప్పదు

జీవితంలో మరణం అనేది నిశ్చయమై ఉంటుంది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవడమే మరణం. ఆ తర్వాత జరిగే విషయాలను వర్ణించలేనిది, మాటల్లో చెప్పలేనిది. అయితే దైవ సంబంధమైన అంశాల ద్వారా మాత్రమే మరణం గురించి అర్థం చేసుకోగలుగుతాం.

పుట్టుక చావుకే

పుట్టుక చావుకే

మనం పుట్టిన తర్వాత మరణమనేది తప్పదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు. ఎందుకంటే.. అది చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే.. దాని గురించి ఆలోచించము కూడా. మరణమనేది అనివార్యంగా జరిగే ఒక క్రియ.

డెత్ అనేది ఎండ్ కాదు

డెత్ అనేది ఎండ్ కాదు

చావు అనేది వినాశనం కాదు. కానీ జీవితాన్ని, మరణాన్ని పోల్చడమూ సాధ్యం కాదు. ఎందుకంటే.. ఈ రెండూ వేర్వేరు. మరణమనేది ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి తీసుకెళ్లే ప్రక్రియ.

గర్భాశంలో మన జర్నీ ప్రారంభం

గర్భాశంలో మన జర్నీ ప్రారంభం

కన్సీవ్ అయిన 120 రోజుల తర్వాత శిశువులో ఆత్మ ప్రవేశిస్తుంది. 40 రోజుల్లో గర్భాశంలో ఒక మందమైన బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత 40 రోజులకు ఫ్లెష్ ఏర్పడుతుంది. ఆ తర్వాత దేవుడు ఆ బిడ్డ తలరాతను రాస్తాడు. వాళ్ల జీవితం, పుట్టే డేట్ అన్నీ నిర్ణయించబడతాయి.

చాయిస్ ఉండదు

చాయిస్ ఉండదు

మన తల్లిదండ్రులను నిర్ణయించుకోవడానికి, కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి, నేషనాలిటీ నిర్ణయించుకోవడానికి అవకాశం మనకి ఉండదు. గర్భాశంలోనే మనకు ఒక షేప్ ని అంటే ఆడ, మగా అనేది నిర్ణయిస్తారు. అలా మొదలైన మన జర్నీ.. చివరి వరకు ఎలా ఉండాలో అక్కడే నిర్ణయించబడుతుంది.

ఎంత కాలం

ఎంత కాలం

మనం పుట్టిన తర్వాత ఎంత కాలం బతుకుతామనేది మన చేతుల్లో ఉండదు. మనం కొన్ని సెకండ్లు బతకవచ్చు, వందేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతకవచ్చు.

శరీరం

శరీరం

మనం పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ప్రతి సెకనుకి.. వేలాది మార్పులు, రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి.

ఎప్పుడు మరణం

ఎప్పుడు మరణం

మనం ఎప్పుడు మరణిస్తామనేది ఎవరికీ తెలియదు. అంతేకాదు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తామనే విషయం కూడా మనం ఎవరూ ఊహించలేనిది.

MOST READ: సుభాష్ చంద్రబోస్ చనిపోయారా ? చంపేశారా ? ఏం జరింగింది ?MOST READ: సుభాష్ చంద్రబోస్ చనిపోయారా ? చంపేశారా ? ఏం జరింగింది ?

ఇస్లాం ప్రకారం

ఇస్లాం ప్రకారం

ఇస్లాం ప్రకారం మరణం తర్వాత జీవితం కొనసాగుతుంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు, శిక్షలు రెండూ అనుభవించాల్సి ఉంటుందని తెలుపుతుంది. భూమిపై చేసిన తప్పు ఒప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతుంది.

మన ప్రవర్తన

మన ప్రవర్తన

ఇతరులను హింసించడం, అవినీతికి పాల్పడటం, అమాయకులను చంపడం వంటి నేరాలు చేసిన వాళ్లను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్లు చేసే ప్రతి పనినీ రికార్డ్ చేసి ఉంటారు. ఎలాంటి వాళ్ల ఆత్మకు ఎలాంటి శిక్ష విధించాలనేది దేవుడే నిర్ణయిస్తాడు.

చనిపోయేటప్పుడు

చనిపోయేటప్పుడు

ఇలా తప్పులు చేసిన వాళ్లు చనిపోయేటప్పుడు తప్పు తెలుసుకుని.. తమకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటారట. కానీ.. అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి బతికున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా జీవించాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు.

ప్రయోజనకరమైన పనులు

ప్రయోజనకరమైన పనులు

చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే పనులు కొన్ని ఉన్నాయని ఆధ్యాత్మికత చెబుతోంది. చారిటీలకు సహాయం చేయడం, తనకు తెలిసిన నాలెడ్జ్ ను ఇతరులకు పంచడం, చిన్నప్పటి నుంచి నీతి నీజాయితీగా, సత్ప్రవర్తన కలిగి ఉండే తత్వం ఉన్నవాళ్లకు.. చనిపోయిన తర్వాత కూడా ఈ లక్షణాలన్నీ ఉపయోగపడతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

మరణం తర్వాత

మరణం తర్వాత

అయితే మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు.. తమ చుట్టూ ఏం జరుగుతోందో వాళ్లకు అవగాహన ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే చనిపోయిన తర్వాత ఖచ్చితంగా లైఫ్ ఉంటుందని.. సైంటిస్ట్ లు తమ అధ్యయనంలో తేల్చినట్లు చెబుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని వివరిస్తున్నారు.

English summary

Is there a Life After Death ?

Is there a Life After Death ? What is life in the Hereafter like, this new and strange world after death? Do we lose consciousness of this life? Where does our soul go? Do we feel and think the same?
Desktop Bottom Promotion