Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ప్రపంచంలోని టాప్ సైకో ఉమెన్ కిల్లర్స్ ఎవరు ? వాళ్ల కథేంటి ?
ఒకేసారి.. తనచుట్టూ ఉన్నవాళ్లను వరుసపెట్టి చంపేయడాన్ని సీరియల్ కిల్లర్ అంటారు. ఈ సీరియల్ కిల్లర్స్ ఎక్కువగా మగవాళ్లు ఉంటారు. పిచ్చిపట్టినట్టు.. ఎవరిని పడితే వాళ్లను, ఏ కారణం లేకుండా.. కాల్చేవాళ్లను సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ అని పిలుస్తారు. మరి ఈ సీరియల్ కిల్లర్ గా మగవాళ్లు కాకుండా.. ఆడవాళ్లు మారితే.. ?
ఆడవాళ్లంటే.. సహనం, ఓర్పు, ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా చెబుతారు. కానీ.. కొంతమంది తమలో ఉన్న ఓర్పును కోల్పోయారు. మరికొందరు.. తన సొంతవాళ్లు చేస్తున్న అరాచకాన్ని తట్టుకోలేకపోయారు.. మరికొందరు డబ్బుకి ఆశపడి.. పిల్లలు, పెద్దలు, రక్తసంబంధంతో సంబంధం లేకుండా.. కర్కషంగా వ్యవహరించారు.

అవును మహిళలు కూడా సైకోలుగా మారి.. సీరియల్ కిల్లర్స్ అవతారమెత్తారు. ప్రపంచంలో ఉన్న టాప్ సైకో ఉమెన్ సీరియల్ కిల్లర్స్ ఎవరో ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు. మహిళలు ఎందుకు సైకో కిల్లర్స్ గా మారారో మీరు ఎన్నడూ ఊహించి ఉండరు. ఈ విషయం చూస్తే.. మీరే ఆశ్చర్యపోతారు.
ఏమాత్రం కనికరం, జాలి, దయ లేకుండా.. మహిళలు సైకోలుగా మారడానికి కొన్ని కారణాలున్నాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్లు చాలామంది అమాయకులను చంపేశారు. వాళ్ల స్టోరీస్ వింటే.. మీరు షాక్ కి లోనవుతారు. మరి ప్రపంచంలోని టాప్ సైకో ఉమెన్ కిల్లర్స్ ఎవరు ? వాళ్ల కథేంటో చూద్దామా..

గిగ్లింజ్ గ్రానీ
ఒక్లహామాకి చెంది ఈమె.. చాలా స్నేహపూర్వమైన స్వభావం కలిగిన మహిళ. మంచి భార్యగా, మంచి తల్లిగా జీవితం గడిపేది. కానీ ఆమె తన చేత్తోనే తన కుటుంబ సభ్యులు 11 మందిని చంపేయడంతో... అందరూ షాక్ అయ్యారు. తన 5గురు భర్తలను, తన కన్నబిడ్డలను, మనవళ్లు, మనమరాళ్లను కూడా పొట్టపెట్టుకుంది.
Image Courtesy

ఏలీన్ వూర్స్న్
తన తండ్రి చేతుల్లో తన తల్లి చావును చూసింది ఈమె. అంతేకాదు.. ఈమె తన తాత చేత పదేపదే అత్యాచారం చేయబడింది. అలాగే తన స్నేహితులతో కూడా సెక్స్ చేయమని.. వాళ్ల తాత ఒత్తిడి తీసుకొచ్చాడు. మరో విషయమేంటో తెలుసా.. తన సొంత సోదరుడే.. అత్యాచారం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా షాక్ కి గురైన ఈమె.. వరుసగా తనపై అత్యాచారం చేసిన వాళ్లందరినీ చంపేసింది.
Image Courtesy

డోరోథీ ప్యూంటే
క్యాలిఫోర్నియాలో బోర్డింగ్ హౌస్ రన్ చేసేది ఈమె. శారీరకంగా, మానసికంగా అవయవాలు సరిగా లేని వికలాంగులను చాలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునేది. ఎంతో ఆత్మీయంగా ఉండే ఈమె.. తన పనివాడు చేసిన తప్పుకు సైకోగా మారింది.
Image Courtesy

రోజ్ మేరీ వెస్ట్
ఈమె జైల్లోనే చనిపోవాలని కోరుకుంటుంది. ఈమె 10 మంది మహిళలను చంపిన కేసులో జైల్లో ఉంటోంది. అయితే ఇప్పటివరకు.. తాను చంపిన వాళ్ల డెడ్ బాడీలు ఏం చేసిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
Image Courtesy

బెల్లే సోరెన్ సన్ గిన్నిస్
ఈమె అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్. ఈమె ఒక వ్యక్తిని ముక్కలుముక్కలు కట్ చేసి చంపడమే కాదు.. వాటిని తన ఇంట్లోనే దాచి పెట్టుకుంది. మ్యాట్రిమొనీలో యాడ్స్ పెట్టి మరీ.. బాధితులను ఆకర్షించేది. ఇలా 48మంది అమాయక మగవాళ్లను చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్తే.. వాళ్లు కంగుతిన్నారు. ఒక మహిళ తల లేకుండా పడి ఉంది. అది ఆమెదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
Image Courtesy

మేరీ యాన్ కాటన్
తన కళ్ల ముందు ఎవరైనా చనిపోతుంటే ఈమె చాలా సంతోషపడుతుంది. తన కుటుంబ సభ్యలనే 21 మందిని చంపేసింది. 12 మంది పిల్లలు, నలుగురు భర్తలు, ఒక సీక్రెట్ లవర్ ని చంపేసింది ఈ సైకో ఉమెన్. ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా ? వాళ్ల ఇన్సూరెన్స్ లో భాగం కోసం.
Image Courtesy



Click it and Unblock the Notifications