Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
మీరు చనిపోయినట్లు కలలొస్తుంటే దేనికి సంకేతం ?
కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు.
మనిషి నిద్రావస్థలోనున్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలుకూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాతంగా ఉంటుంది. ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల అని అంటారు.
ఈ కలల ఆధారంగానే మనిషియొక్క భూత, భవిష్యత్, వర్తమానాలగురించి తెలుసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు. మీ కలలు ఏం చెపుతున్నాయో తెలుసుకుందాం...

తరచూ మీరు చనిపోయినట్టు కలలు వస్తున్నాయా?ఇటువంటి కల వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారా? అందుకు భయపడాల్సి అవసరం లేదు. మీ జీవితంలో ఏదో నెగటివ్ గా జరగబోతుందని ఊహించుకుని మరింత ఆందోళన చెందుతుంటారు.

కలలు తరచూ కొన్ని భయాలను మరియు ఆందోళనలను కలిగిస్తుంటాయి. కలలో మీరు చనిపోయినట్లు వస్తే, మీరు మీజీవితంలో , జీవితానికి సంబంధించిన ప్రత్యక్షమైన మార్పులను చేసుకోవల్సి ఉంటుంది. చనిపోయినట్లు కలవస్తే భయపడాల్సిన అవసరం లేదో. తరచూ ఇదె కలలు వెంటాడుతుంటే,దీని అర్థ మేంటో తెలుసుకుందాం..

1. మీరు చనిపోయినట్టు కల కంటే, మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని దాని అర్ధం. అంటే సింబాలిక్ గా చెప్పాలంటే, ఇది వ్యక్తి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. మీ జీవితంలో ప్రయోగాత్మకంగా, అభద్రతగా చేయబోయే పనులు కాస్త భయానికి దారితీస్తుందని అర్థం. అందుకు కలత చెందాల్సిన అవసరం లేదు , ప్రమాధం జరగబోతుందని భయపడనవసరం లేదు. మీరు చేసే పనుల వల్ల మంచే జరగుతుంది, అయితే ప్రతి విషయంలో ఆత్రుత పనికిరాదు.

2. మీరే స్వయంగా చనిపోయినట్టు కలవస్తుంటే సానుకూలంగా అభివృద్ధి చెందుతారని స్సష్టమైన గుర్గు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి . గతాన్ని విడిచిపెట్టి, ఇక భవిష్యత్తుకు పూలబాట వేసుకుంటారని అర్థం. మరణం అనేది గడిచినపోయిన వాటిని మరిచిపోయి, కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రతికూలంగా ఉంటుంది. దీన్ని పునర్జన్మ అని కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితంలోసాధించాలనుకొన్నవి , మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన వ్యక్తిగా మారబోతున్నారని అర్థం. మరణించినట్లు కల వస్తే మీ చెడు, హానికరమైన విషయాలన్నింటి వదిలేసి మంచి మార్గంలో నడుస్తారని సూచిస్తుంది.

3. మరణించినట్లు కల వస్తే మీ సంబంధ భాందవ్యవాల్లో కొద్దిగా భాదలు మరియు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. మీరు డేటింట్ చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు. లేదా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మరింత భాదకు గురిచేస్తుంటారు. అంటే మీ మద్య సంబంధాలు తెగిపోతుండటం వల్ల మరో మార్గంలో ఈ విధంగా కల రూపంలో మరణిస్తున్నట్లు కలగంటారు. బహుశా ఇటువంటి కలను పట్టించుకోకుండా మీరు పునరాలోచించి, మంచి నిర్ణయం తీసుకుని మీ సంబంధాన్ని మంచి మార్గంలో కొనసాగించవచ్చు.

4. మరణించినట్లు కల వస్తే బహుశా మీ జీవితంలో ఊహించిన విధంగా మరికొన్ని బాధ్యతలను స్వీకరించాడానికి సిద్దపడమని సూచన.ఆ మార్పులు లేదా బాధ్యతలు నిజజీవితంలో మీ సంబంధ విషయంలో కావచ్చే, లేదా ఉద్యోగం విషయంలో కావచ్చు. అయితే ఈ మార్పు వల్ల అశాంతికి గురి అవుతారు. మరణం అంటే కోల్పోవడం, అది ప్రేమకావచ్చు, సంతోషం కావచ్చు, ప్రేరణ, ఉత్సహాం ఇలా ఏదైనా కోల్పోవచ్చు. అయితే అందుకు మీరుచేయాల్సింది, ఎలాంటి మార్పు సంబంవించినా తెలివితో మార్పులు చేసుకోవడం వల్ల జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

5. మరణంతో అనేక మార్పులతో సంబంధం కలిగి ఉంటుంది అయితే అవి ప్రత్యేకించి అవసరమైనవి కాకపోవచ్చు. కష్టమైనది కాకపోవచ్చు.అయితే మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయం మీరు మీజీవితంలో ఉన్నత స్థాయిని అధిగ మించడానికి సహాయపడుతుంది. ఆ మార్పులను ఎదుర్కోవడానికి మీరు సిద్దంగా ఉండాలి. కష్టం వచ్చిందని దాన్ని కష్టంగా, ప్రతికూలంగా భావంచకూడదు. ధైర్యంతో ముందుకు సాగడం వల్ల మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది. పునర్జనంను పొందిన అనుభూతిని ఆధ్యాత్మికంగా స్వయంగా మీరు గుర్గిస్తారు.



Click it and Unblock the Notifications
