Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మీ ఫేవరెట్ ఫ్రూట్ బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు..!?
కొన్ని సర్వేలు భలే గమ్మత్తుగా ఉంటాయి. మన అభిరుచిని, మనస్తత్వాన్ని లెక్కగడతాయి. నిన్నటి వరకు రక్త వర్గాలను బట్టి మనస్తత్వాన్ని చెప్పింది ఓ సర్వే. మరో సర్వే చేతి రేఖలను బట్టి చెబితే ...ఇక్కొక్కటేమో శరీరం మీద ఉండే పుట్టుమచ్చలను బట్టి వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఇష్టమైన పండ్లను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తోంది మరో సర్వే. మరి మీకిష్టమైన ఫ్రూట్ ఏది?
పండ్లు ప్రకృతిలో దేవుడు ఇచ్చిన వరం తియ్యని పండ్లు. నేచురల్ గా వీటి రంగు, రుచి, వాసన, ఆకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంతే కాదు వీటి వల్ల విలువై ఆరోగ్యప్రయోజనాలు...అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. పండ్లు మన జీవనశైలిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. అందుకే డాక్టర్ అవసరం ఉండకూదనుకుంటే రోజుకు ఒక్క పండైనా తినాలని మన పెద్దలు సూచిస్తుంటారు.
పండ్లులో వివిధ రకాలున్నాయి. కానీ అందరికీ అన్ని రకాల పండ్లు నచ్చవు కదా!? ఒక్కొక్కరికి ఒక్కో పండు నచ్చుతుంది. అలా ఒక్కో పండును ఇష్టపడే మీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...!

మ్యాంగో
పల్లెటూర్లను ఇష్టపడతారు. ప్రతీదీ పద్దతిగా జరగాలని కోరుకుంటారు. వీరి మనస్సు చాలా విశాలమైనది అందుకే త్వరగా లవ్‌లో పడిపోతారు. సిగ్గు కూడా ఎక్కువే.లీడర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి . రీజనింగ్ రెస్పాన్సిబులిటీతో స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉంటారు. జీవితంలో చాలెంజ్ లంటే ఇష్టపడుతారు.

అరటిపండు
మీరు సాధారణ వ్యక్తిత్వం గలవారు. త్వరగా సర్దుబాటు చేసుకోగల మనస్తత్వం. అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. డబ్బు ఆదా చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అందానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అందరు మిమ్మల్ని ప్రేమింపబడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు . సమయాన్ని వ్రుదా చేయరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు.

ఆపిల్
రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలా డాక్టర్ అవసరం ఉండదంటారు. అది అక్షరాల సత్యం. ఈ ఆపిల్ పండు తినేవారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. సంపాదనలో సగం అందానికే ఖర్చు చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు.. ఇలా వీరి బడ్జెట్‌లో చాలా వరకు సౌందర్యలేపనాలకే వెచ్చిస్తారు. చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు. హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పని విషయంలో పరమ బద్దకస్తులు. ప్రపంచ నలుమూలలా తిరిగి కొత్త ప్రదేశాలను చూడటానికి ఇష్టపడుతారు. మంచి లీడర్ మరియు ఆర్గనైజర్ .

జామపండ్లు:
జామపండు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిసినారితనానికి చిరునామా. పాత పద్ధతులు బాగా ఫాలో అవుతారు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరు తమ జేబులో చిల్లర డబ్బులు తప్పక మెయింటేన్ చేస్తారు.

దానిమ్మ
ఓపిక ఎక్కువ ఉన్నవాళ్లు, విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. పక్కవాళ్ల విమర్శలను పట్టించుకోరు, తమ పని తాము చేసుకుంటూ పోతారు.

ద్రాక్ష :
చాలా హుషారుగా ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు . సాంప్రదాయలకు ఎక్కువ విలువనిస్తారు.,. నేచర్ ను ఎంజాయ్ చేస్తారు. కోపం ఎక్కువ. కోపం చాలా త్వరగా వస్తుంది. అంతే త్వరగా చల్లారిపోతుంది. పార్టీలు, ఫంక్షన్లకు తప్పక అటెండ్ అవ్వాలని చూసే రకం. ఫెర్‌ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతారు. నాయకత్వ లక్షణాలు పుష్కలం. సినిమాలంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ.

సపోట
సిక్స్ ప్యాక్ వీరులు వీళ్లు. ఎక్స్ సర్‌సైజ్ ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో పెత్తనం వీరిదే. బాషా టైపన్నమాట. గొడవల్లో ఫస్ట్ ఉంటారు. అఫ్‌కోర్స్... వీరు బాడీ పెంచేది అందుకే అనుకోండి..!

ఆరెంజ్
జాతకాలను నమ్ముతారు. దేవుడంటే విపరీతమైన భక్తి ఉంటుంది. కార్ల మీద మోజు ఎక్కువ. లక్షాధికారులు కావాలని కలలు కంటారు. మరీ అంతగా కష్టపడరు. కానీ... స్మార్ట్‌వర్క్‌లో ముందుంటారు.

పైనాపిల్
భోజన ప్రియులు. నాన్‌వెజ్ అంటే పడిచస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. పని విషయంలో పట్టు వదలని విక్రమార్కులు.

చెర్రీస్ :
మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. క్రియేటివ్ మైండ్ తో లాయల్ గా గడపడానికి ఇష్టపడుతారు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కుంటారు. కానీ వేటికి ఏమాత్రం భయపడరు . క్రియేటివిటీ యాక్టివిటీలో ఎక్కువగా పాలుపంచుకుంటారు. ప్రేమలో చాలా నిజాయితీగా మరియు సిన్సియర్ గా వ్యవహరిస్తారు .

సీతాఫలం:
మూడీగా ఉంటారు. చాలా సున్నిత మనస్కులు, ఎక్కువ ఆలోచిస్తారు. అప్పుడు ఎక్కువగా ఎమోషన్స్ కు గురి అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తప్పలు తెలుసుకోవడంలో విఫలం అవుతుంటారు. ప్రేమ విషయంలో చాలా సిగ్గుపడుతారు . ఇంటలిజెంట్ పార్ట్నర్ ను కోరుకుంటారు.

బొప్పాయి:
ఉదార మనస్తత్వం కలిగి ఉంటారు . ఎలాంటి వాటికి బయపడరు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు . వృత్తిపరమైన జీవితం మీద శ్రద్ధ కలిగి ఉంటారు . చాలా సాధించాలని కోరుకుంటారు. మంచి హాస్యం పండిస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శంచడమంటే చాలా ఇష్టం.

పియర్స్ (బేరిపండ్లు):
చాలా త్వరగా కోపం వస్తుంది. ఎప్పుడూ అసహానానికి గురి అవుతుంటారు. కొన్ని సార్లు కఠినంగా ప్రవర్తిస్తారు . చాలా సెన్సిటివ్, రెస్ట్ లెస్ మరియు కొద్దిగా బిడియం కలిగి ఉంటారు. ప్రేమ విషయంలో చాలా తర్వాగా ఫ్రెండ్స్ చేసుకుంటారు . కానీ, ఆ ఫ్రెండ్షిప్ ను మొయింటైన్ చేయడం డిఫికల్ట్ గా భావిస్తారు.



Click it and Unblock the Notifications











