For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపుబ్బనవ్వొచ్చు: మీడ్రింకింగ్ హ్యాబిట్ బట్టి, మీకెంత కిక్ ఉందో తెలుసుకోండి..!!

|

ప్రపంచంలోని లక్షల కోట్లమంది వ్యక్తులందరి జాతకమంతా కేవలం 12 రాశుల్లో నిక్షిప్తమై ఉందంటే అతిశయోక్తి అనిపించటం సహజమే! అయినా రాశి ఫలాలు కనిపించగానే మన రాశి ఫలం ఎలా ఉందో వెతుక్కుంటాం. మన ప్రవర్తన కూడా రాశుల ఆధారంగానే ఉంటుందంటారు. మద్యం తీసుకున్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటే ఈ రాశి ఫలాలను సరదాగా తెలుసుకుని..ఫన్నీగా కడుపుబ్బా నవ్వుకుందాం...!

మేషం

మేషం

ఈ రాశివాళ్లు బృందంతో కలిసి మద్యం తాగటానికి ఇష్టపడతారు. తమకంటే ఎక్కువగా ఎదుటివాళ్లు తృప్తిగా తాగారో లేదోనని పరిశీలిస్తుంటారు. ఆ సమయంలో ముఖపరిచయం ఉన్న ఏ వ్యక్తి వచ్చినా వాళ్లకూ కావలసినంత మద్యం ఆపర్‌ చేస్తారు. అలాగే బృందంలోని వ్యక్తులందరితో సరదాగా గడుపుతూ పార్టీని మనసారా ఎంజాయ్‌ చేస్తారు. మనసు బాగోలేనప్పుడు ఇలాంటి వ్యక్తులను కలవటం ద్వారా తిరిగి కొత్త హుషారు పుంజుకోవచ్చు.

వృషభం

వృషభం

విశ్యాసానికి మారుపేరు వృషభ రాశి వ్యక్తులు. నమ్మినవాళ్లకు అండగా నిలబడటం వీళ్ల నైజం. కానీ ఇదంతా తాగనంతవరకే! మద్యం తలకెక్కితే వృషభ రాశి వ్యక్తులు మొండిఘటాల్లా మారిపోతారు. వీళ్లు తేలిగ్గా నిగ్రహం కోల్పోయే తత్వం ఉన్నవాళ్లు కాబట్టి మద్యం సేవించినప్పుడు వీళ్లతో చాలా జాగ్రత్తగా మెలగాలి. అలాగే మద్యం తాగినప్పుడు వీళ్లు గొడవలకి కాలు దువ్వుతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వృషభ రాశి వ్యక్తులతో మద్యపానానికి దూరంగా ఉండాలి.

మిధునం

మిధునం

వీళ్లు ఇద్దరు వ్యక్తుల్లా ప్రవర్తిస్తారు. క్షణక్షణానికీ మారిపోయే వైఖరి కలిగిన మిధున రాశి వ్యక్తులతో మద్యపానం ఎంత రిస్కీనో ఆలోచించండి. వీళ్లకు చెప్పింది చెప్పినట్టు జరగాలి. పార్టీకి వచ్టే వ్యక్తులు, డ్రింక్స్‌, ప్రదేశం, ఏర్పాట్లు....ఇలా అన్ని విషయాలను వీళ్లు తెలుసుకుని ఒక పిక్చర్‌ను మనసులో ఫ్రేమ్‌ చేసుకుంటారు. దాన్లో ఏమాత్రం మార్పు జరిగినా సహించలేరు. అలాగని ఒకే చోట కూడా ఎక్కువసేపు ఉండలేరు. పార్టీలో కనిపించినట్టే కనిపించి టక్కున మాయమవుతూ ఉంటారు. అందుకే ఇలాంటి వ్యక్తులను పార్టీలకు ఆహ్వానించేటప్పుడు ప్రతి విషయం పద్ధతిగా జరిగేలా చూసుకోవాలి.

 కర్కాటకము

కర్కాటకము

కర్కాటక రాశి వాళ్లను డీల్‌ చేయటం చాలా కష్టం. వీళ్లకు ఎమోషన్స్‌ ఎక్కువ. మద్యం మత్తు తలకెక్కితే విపరీతంగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నేల మీద దొర్లి ఏడుస్తారు కూడా! చిన్న విషయానికి గొడవకు దిగుతారు. నచ్చిన వ్యక్తుల మీద ప్రేమ ఒలకపోస్తారు. ఇలాంటి విపరీత మనస్తత్వం కలిగి ఉండే కర్కాటక రాశి వ్యక్తులతో కలిసి మద్యం సేవించటం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.

సింహ రాశి

సింహ రాశి

ఈ రాశి వ్యక్తులు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లో ఎక్కువ శాతం ఎదుటివాళ్లని గాయపరిచేవే ఉంటాయి. సింహంలా అధికారం చలాయించటం ఈ రాశి వ్యక్తుల నైజం. కాబట్టి వీళ్లని అదుపు చేస్తూ వాళ్ల స్థానానికే పరిమితం చేయాలి.

కన్య

కన్య

వీళ్లకు ఒంటరిగా మద్యం తాగటం ఇష్టం. మనసు బాగోలకపోతే ఒక్కరే బార్‌లో ఓ మూలన కూర్చుని మద్యం తాగుతూ ఉంటారు. గుంపులో కలవకుండా ఒంటరిగానే మద్యం తాగటానికి వీళ్లు ఇష్టపడతారు. గోలలు, అరుపులు, కొట్లాటలు వీళ్లకు నచ్చవు. కూల్‌గా కూర్చుని, సైలెంట్‌గా పని ముగించుకోవటం వీళ్ల స్టయిల్‌. ఒకవేళ క్లాసీ కంపెనీ కావాలనుకుంటే కన్యా రాశివారితో కలిసి పార్టీ చేసుకోవాలి.

తుల రాశి

తుల రాశి

ఈ రాశి వారు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. వీళ్లతో మద్యపానం సరదాగా ఉంటుంది. మద్యం మత్తులో గొడవపడే స్నేహితులకు సర్దిచెప్పటంలో వీళ్లు నేర్పరులు. అందరూ హ్యాపీగా ఎంజాయ్‌ చేయానలి, తన చుట్టూ ఉండే వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం వీరిది. కాబట్టి వీళ్లతో పార్టీ అంటే బోలెడంత ఎంజాయ్‌మెంటే!

వృశ్చికము

వృశ్చికము

వృశ్చిక రాశివారికి మందు సీసా అందిస్తే చాలు...మనసులోది మొత్తం కక్కేస్తారు. వీళ్లు భావాలు, అభిప్రాయాలు అణచిపెట్టుకోలేరు. అది మంచైనా, చెడైనా మనసులో ఉంచుకోలేరు. ఎప్పుడు ఆహ్వానించినా ఎగిరి గంతేసి పార్టీకి వచ్చేస్తారు. ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేసుకోలేరు కాబట్టి పార్టీలో వీళ్ల ఏడుపులు, అరుపులు సమానంగా వినిపిస్తాయి. వీటిని పెద్దగా లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదు.

ధనుస్సు

ధనుస్సు

వీళ్ల నాలుకకి పదునెక్కువ. కోపం కూడా ఎక్కువే! మద్యం, కోపం రెండు కలిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. కాబట్టి మద్యం ప్రభావంలో ఉన్నప్పుడు వీళ్లతో ఆచితూచి మాట్లాడాలి. మద్యం మత్త్తులో ఉన్నప్పుడు వీళ్లు సరసులుగా కూడా మారిపోతారు.

మకరం

మకరం

ఈ రాశివాళ్లు ఊసరవెల్లుల్లా సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఒదిగిపోతారు. ఈ ఫన్‌ లవింగ్‌ వ్యక్తులతో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వీళ్లు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎందుకు, ఎలా?...అనేవేవీ పట్టించుకోరు. వీళ్లకు కావలసింది ఆ సమయాన్ని ఆనందంగా గడపడమే!

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి వారితో మద్యపానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నిమిషం అంతా సవ్యంగా జరగుతున్నట్టే ఉంటుంది. కానీ ఏమాత్రం మాటల్లో తేడా కనిపించినా ఈ రాశివాళ్లు విపరీతంగా రెచ్చిపోతారు. అప్పటిదాకా ఎంతో స్నేహంగా మెలిగిన వీళ్లు మద్యం ప్రభావం కూడా తోడవ్వటంతో శత్రువుల్లా ప్రవర్తిస్తారు.

మీనం

మీనం

వీళ్లు పరిమితి మేరకు మద్యం తీసుకున్నంతవరకే కంట్రోల్‌లో ఉంటారు. మితిమీరితే వీళ్లను భరించటం కష్టం. మద్యం మత్తు ఎక్కువైతే ఎక్స్‌ట్రీమ్స్‌ ఎమోషన్స్‌కి వెళ్లిపోతారు. వీళ్లు చెప్పే కబుర్లు ఒక్కోసారి సరదాగా ఉండొచ్చు. ఇంకొన్నిసార్లు తలనొప్పి తెప్పించవచ్చు. మితిమీరి మద్యం తాగినప్పుడు పార్టీ నడిచే తీరుతో సంబంధం లేకుండా వాళ్ల ధోరణిలో వాళ్లు ఉండిపోతారు. అప్పటికప్పుడు రెండు పెగ్స్‌ తాగి ఇంటికెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం కంపెనీగా ఈ రాశి వాళ్లను ఎంచుకోవటంలో తప్పు లేదు.

English summary

What your Zodiac Sign Says about drinking personality!

Whether you believe in it or not, it has been said that your drinking habits could have something to do with your zodiac sign. Despite all of the astrological shenanigans, it’s always interesting to see if these hold any value and can give you a reason to laugh at you and your friends’ crazy weekend routines.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more