16 కోట్ల రూపాయలతో 200 సర్జరీలు చేయించుకుని బాడీలో చాలా పార్ట్స్ మార్చుకుంది.. ఆ భామ

Written By:
Subscribe to Boldsky

అందంగా కనిపించాలని అమ్మాయిలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందుకోసం దేనికైనా రెడీ అంటారు. ఏమేమో చేస్తారు. వారు ముఖానికి పూయని క్రీములుండవు. ఫేస్ వాష్ లుండవు. ఇలా ప్రతి దాన్ని ముఖానికి పూసుకుని అందం పెంచుకోవాలనుకుంటారు. అయినా అందం రెట్టింపు కాకపోతే చాలా బాధపడతారు. తమను తాము అసహ్యించుకుంటారు. అందరికన్నా అందంగా కనపడాలని చాలామంది ఆడవారు కోరుకుంటారు.

డబ్బుతో అందం పెంచుకోవడం

డబ్బుతో అందం పెంచుకోవడం

ఇక చేతిలో బాగా డబ్బులుంటే అందం పెంచుకోవడం కోసం ఎలాంటి వైద్యం అయినా చేయించుకోవడానికి రెడీగా ఉంటారు కొందరు అమ్మాయి. అలాంటి కోవలోకే ఈ అమ్మాయి వస్తుంది.

డాల్గుడిస్ చేయని ప్రయత్నం లేదు

డాల్గుడిస్ చేయని ప్రయత్నం లేదు

ఆమె వయస్సు 28 సంవత్సరాలు. ఆమె పేరు డాల్గుడిస్. ఆమె తన అందం పెంచుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాగే ఈ అమ్మడు తాను అచ్చం బార్బీ బొమ్మలా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యుల్ని ఆశ్రయించింది. ప్లాస్టిక్ సర్జరీల ద్వారా తన అందాన్ని మార్చుకోవాలనుకుంది.

అందగా లేవని అనేవారు

అందగా లేవని అనేవారు

ఈమె 17 సంవత్సరాల వయసులో సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది. ఆమెను తన తండ్రితో పాటు చాలామంది నువ్వు అందంగా లేవు అని పేర్కొనడంతో ఆమె తన ఫేస్ ను శరీరాన్ని పూర్తిగా మార్చుకోవాలని భావించింది.

మొదట చిన్న సర్జరీలు

మొదట చిన్న సర్జరీలు

మొదట చిన్నచిన్న సర్జరీలు చేయించుకుంది. దాంతో ఆమె కాస్త మారిపోయింది. ఇంకా తన బాడీలో చాలా పార్ట్స్ మార్చుకోవాలనుకుంది. మొదట ముక్కుతో మొదలైన ఆమె సర్జరీ తర్వాత చాలా భాగాలకు చేరింది.

స్తనాల సైజ్ కూడా పెంచుకుంది

స్తనాల సైజ్ కూడా పెంచుకుంది

ఈమె లిపోసక్షన్, స్తనాల సైజ్ పెంచుకునేందుకు సర్జరీలు, అలాగే ఆమె చెంపలకు సంబంధించి ఇంప్లాంట్లు చేయించుకుంది. దవడలు కూడా మారిపోయేలా సర్జరీలు చేయించుకుంది.

200 సర్జరీలు

200 సర్జరీలు

ఇలా మొత్తం 200 దాకా సర్జరీలు చేయించుకుంది. ఈ సర్జరీలకు ఈమె రూ. 16 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇంకా తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎన్ని సర్జరీలు అయినా చేయించుకునేందుకు ఈ అమ్మడు రెడీగా ఉంది.

బార్ డ్యాన్సర్

బార్ డ్యాన్సర్

ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోయారు. ఈమె కొన్ని రోజులు తన తండ్రి దగ్గర పెరిగింది. ఆమె 17 ఏళ్లకు బార్ డ్యాన్సర్ గా మారింది. దీంతో ఈమెకు భారీగా ఆదాయం వస్తుంది. ఆ డబ్బులతోనే ఈమె సర్జరీలు చేయించుకుంటుంది.

జెన్నిఫర్ లోపెజ్ కు ఫ్యాన్

జెన్నిఫర్ లోపెజ్ కు ఫ్యాన్

ఈమె జెన్నిఫర్ లోపెజ్ కు డై హార్డ్ ఫ్యాన్. ఆమె అంత అందంగా మారాలని ఈమె కోరిక. ఇప్పటి వరకు జా సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ, ఫేషియల్ సర్జరీ ఇలా వందల రకాల సర్జరీలు చేయించుకున్న ఈమె తర్వాత ఇంకా కొన్ని అంతర్గత అవయవాలకు సర్జరీ చేయించుకోవాలనుకుంటుంది.

చాలా ఇబ్బందులు

చాలా ఇబ్బందులు

చిన్నప్పుడు ఈమెను అందంగా లేవంటూ ఫ్రెండ్స్ ఆటపట్టించేవారు. దీంతో ఈమె తనలో తాను మదనపడేది. పెద్దగయ్యాక బాగా సంపాదించి తాను ఒక స్టార్ గా మారాలని తలచేది. ఈమెకు ఒకప్పుడు ఇంటి అద్దె చెల్లించటానికి కూడా డబ్బు ఉండేదికాదు. చాలా ఇబ్బందులకు గురైంది.

ఇప్పుడు కోరినంత డబ్బు

ఇప్పుడు కోరినంత డబ్బు

డబ్బు సంపాదించడానికి ఈమె చాలా కష్టపడింది. అందుకోసం చేయని పని అంటూ లేదు. చాలా రకాలుగా ప్రయత్నించింది. తర్వాత డ్యాన్సర్ గా మారి తన అందంతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈమె ఒక పెద్ద బంగ్లాలో ఉంటుంది. కంటికి కోరిక ప్రతి దాన్ని కొనేంత డబ్బు సంపాదించింది. తనకు నచ్చినట్లుగా జీవితస్తోంది.

all images source :https://www.instagram.com/stardelgiudice/

English summary

28 years old dalgudis made her spend 16 crores 200 sugeries

a desire 28 years old dalgudis made her spend 16 crores 200 sugeries