బేబీ చనిపోయిందని డిక్లేర్ చేసిన డాక్టర్లు, అంత్యక్రియలు చేసే 1నిముషం ముందు బతికింది..!

Posted By:
Subscribe to Boldsky

ప్రతి తల్లిదండ్రులకు ఆరోగ్యవంతమైన బిడ్డలు కలగడం ఒక కల. అదే పుట్టిన బిడ్డ ప్రీమెచ్యుర్డ్ అయితే, ఇటు బిడ్డతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒత్తిడికి గురికాక తప్పదు.

అటువంటి అరుదైన కేస్ ఒకటి. రీసెంట్ గా ప్రీమెచ్యుర్ బేబీ పుట్టిన కొద్దిసేపటికి నర్స్ బేబీ చనిపోయిందని నిర్ధారించారు . ఈ విషయాన్ని డాక్టర్లే చెప్పారిన నర్స్ చెప్పడం. తల్లిదండ్రులకు గుండె పగిలే వార్తే. అయితే లక్కీగా ఆ బిడ్డ తిరిగి బ్రతికితే...అదెలా జరిగిందో డాక్టర్ల నిర్లక్షమా, బేబీ అద్రుష్టమా తెలుసుకోవాలంటే ఈ క్రింది రియల్ స్టోరి చదవాల్సిందే..

పిల్లల్లి బేబీ వద్ద వదిలి వెళ్లకూడదు ఎందుకంటే..ఈ షాకింగ్ వీడియో చూడండి..!

మ‌న దేశంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల‌కు వైద్యం ఎలా అందుతుందో చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌. విన‌డానికే నిస్సిగ్గుగా అనిపించేటంత‌టి ఈ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఇంకా ఇబ్బంది క‌లిగి ఉంటుందో మ‌నం ఇట్టే ఊహించ‌వ‌చ్చు.

ఇంత‌కీ ఆ ప్రభుత్వ వైద్యశాలలో ఏం జ‌రిగిందంటే…

ఇంత‌కీ ఆ ప్రభుత్వ వైద్యశాలలో ఏం జ‌రిగిందంటే…

ఈ సంఘటన బుండి అనే ప్రాంతంలో రాజస్థాన్ లో జరిగింది. గ‌ర్భంతో ఉండి తీవ్ర‌మైన అవ‌స్థ ప‌డుతున్న ఓ మ‌హిళ‌కు ఆ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు కాన్పు చేశారు. అయితే గైనకాలజిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ లేకుండానే కాన్పు చేయడం, పుట్టిన బిడ్డను పూర్తిగా చెక్ చేయ‌కుండానే చ‌నిపోయింద‌ని చెప్పారు.

నెలలు నిండని బేబీ(22 నుండి 24 వారాలు కల శిశువు):

నెలలు నిండని బేబీ(22 నుండి 24 వారాలు కల శిశువు):

రాజ‌స్థాన్ లోని కోటా జిల్లా బుండి గ్రామంలో ఉన్న ఓ మ‌హిళ‌కు గ‌ర్భం కార‌ణంగా ఇటీవ‌లే తీవ్ర‌మైన అవ‌స్థ ఎదురైంది. అయితే వెంట‌నే ఆమెను త‌న భ‌ర్త ద‌గ్గ‌ర్లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో అక్క‌డి వైద్యులు వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి బిడ్డ‌ను బ‌య‌టికి తీయాల‌ని చెప్పారు. లేదంటే త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రికీ ప్ర‌మాద‌మేన‌న్నారు. దీంతో నెల‌లు నిండ‌క‌పోయినా(22 నుండి 24వారాలున్న బేబీ బరువు కూడా 350 నుండి 400గ్రాములు) వారు ఆప‌రేష‌న్‌కు ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు ప‌సికందును బ‌య‌టికి తీశారు.

బేబీ చనిపోయిందని,నర్స్ చెప్పడంతో..

బేబీ చనిపోయిందని,నర్స్ చెప్పడంతో..

అయితే ఆ ప‌సికందును అసలు ఆ వైద్యులు చెక్ చేయ‌లేదు. అలా చేయ‌కుండానే ఆ పాప చ‌నిపోయింద‌ని చెప్పారు. దీంతో ఆ త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

బేబీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందించారు...

బేబీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందించారు...

బేబీలో ఎలాంటి కదలికలు లేవని, శ్వాస కూడా తీసుకోవడం లేదని నర్స్ చెప్పడంతో ఆ బేబీని అక్కడ నుండి తీసుకుని ఆ ప‌సికందును పూడ్చి పెట్ట‌డానికి శ్మ‌శానానికి వెళ్లారు.

బేబీ స్పర్శతో హార్ట్ బీట్ శ్వాస తీసుకుంటోందని గమనించిన కుటుంబ సభ్యులు..

బేబీ స్పర్శతో హార్ట్ బీట్ శ్వాస తీసుకుంటోందని గమనించిన కుటుంబ సభ్యులు..

కననం చేయడానికి తీసుకొచ్చిన బేబీని, కననం చేయడానికి ఒక నిముషం ముందు, బేబీని ఎత్తుకున్న వారు, బేబీ హార్ట్ బీట్, శ్వాస తీసుకోవడం గమనించారు. తీరా కార్య‌క్ర‌మం చేస్తుండ‌గా ఒక్క‌సారిగా ఆ ప‌సికందు ఏడ్చింది. దీంతో ఆ పాప త‌ల్లిదండ్రులే కాదు, అక్క‌డ చుట్టూ ఉన్న వారు కూడా షాక్‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆ చిన్నారిని మ‌రో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

హాస్సిపిటల్, యాజమాన్యం మీద కేసు పెట్టారు

హాస్సిపిటల్, యాజమాన్యం మీద కేసు పెట్టారు

ఈ క్ర‌మంలో పాప ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన ఆస్ప‌త్రి సిబ్బందిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చూశారుగా..! ఇలా మాత్రం ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు..! మరి మీరేమంటారు, ఈ క్రింది బాక్స్ లో మీ కామెంట్ తో షేర్ చేయండి...

English summary

Baby Was Declared Dead, But Was Alive Minutes Before Funeral

This is the reason why it is important for doctors to be around. In this case, a newborn baby was declared dead, but was found to be alive before the funeral.
Story first published: Tuesday, April 11, 2017, 13:47 [IST]
Subscribe Newsletter