2018లో ఈ తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోండి.. జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు

Written By:
Subscribe to Boldsky

ఒక్కో రాశి వారికి ఒక్కో అదృష్ట సంఖ్య ఎలాగుంటుందో.. అలాగే మీకు అదృష్ట రోజులు కూడా ఉంటాయి. ఆ రోజులలో మీరు పెళ్లి చేసుకుంటే మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారు. కలకాలం చిలుకాగోరింకల్లా కాపురం చేయాలంటే మీకు నచ్చిన తేదీ.. మూహూర్తం బాగున్న తేదీ మాత్రమే కాకుండా మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే తేదీని కూడా ఎంచుకుంటే తిరుగుండదు.

2018లో మీరు వివాహం చేసుకుంటున్నట్లయితే మీ రాశి ప్రకారం మీరు ఈ తేదీల్లో పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఆ తేదీల్లో మంచి మూహుర్తం ఉందో లేదో కూడా చూసుకుని పెళ్లి చేసుకోండి.

మేషం

మేషం

మేషరాశి వారు 2018లో ఏ నెలలోనైనా మంచి ముహూర్తం ఉంటే 27 వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది. దీని వల్ల మీ వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. అదృష్టవంతులుగా మారుతారు. మీ కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. అందువల్ల మీరు ఏ నెలలోనైనా సరే 27 వ తేదీన వివాహం చేసుకోండి.

వృషభం

వృషభం

మీరు ఏ నెలలోనైనా 7 వ తేదీ వివాహం చేసుకుంటే మంచిది. మీ రాశి ప్రకారం ఆ రోజు పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి ఒడిదుడుకులుండవు. అందువల్ల మీరు వీలైనంత వరకు 7 వ తేదీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి.

మిథునం

మిథునం

మీరు 2018లో ఏ నెలలోనైనా 9 వ తేదీ వివాహం చేసుకుంటే మేలు. దీని వల్ల మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీరు జీవితంలో చాలా విషయాల్లో విజయవంతంగా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం

మీరు ఏ నెలలోనైనా 15 వ తేదీ వివాహం చేసుకుంటే చాలా మేలు. దీని వల్ల మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలుండవు. అందువల్ల మీరు వీలైనంత వరకు 15వ తేదీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి.

సింహరాశి

సింహరాశి

మీరు 2018లో ఏ నెలలోనైనా సరే 3వ తేదీ పెళ్లి చేసుకోవడం మంచిది. దీని వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే మీరు పెళ్లయ్యాక మీ భార్య అభిప్రాయాలను గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు నువ్వు చెప్పిందే వేదం అన్నట్లుగా చేయవద్దు.

కన్యరాశి

కన్యరాశి

మీరు 2018లో ఏ నెలలోనైనా 11 వ తేదీ వివాహం చేసుకోవడం చాలా మేలు. దీంతో మీరు మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు మీరు జీవితాంతం మీ భార్య ప్రేమను పొందేందుకు అవకాశం ఉంటుంది. మీ సంసారంలో ఇబ్బందులు కూడా రాకపోవొచ్చు.

తుల

తుల

మీరు 2018లో ఏ నెలలోనైనా 2 వ తేదీ పెళ్లి చేసుకోవడం మంచిది. ఈ తేదీని వివాహం చేసుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరి మధ్య కూడా ఎలాంటి తగాదాలు ఏర్పడకపోవొచ్చు. అందువల్ల మీరు 2వ తేదీ పెళ్లి చేసుకోండి.

వృశ్చికం

వృశ్చికం

మీరు 2018లో ఏ నెలలోనైనా 18 వ తేదీ పెళ్లి చేసుకోండి. దీని వల్ల మీ దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. అయితే మీరు పెళ్లయిన తర్వాత మీ భార్య చేసే చిన్నచిన్న క్షమించే గుణం కలిగి ఉండాలి. అలా చేస్తేనే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు

ధనుస్సు

మీరు 2018లో ఏ నెలలోనైనా 21వ తేదీ పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. దీంతో మీ వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు కాస్త సహనంతో ఉండాలి. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోండి. లేదంటే అవి పెద్దగా అయి మీ వైవాహిక జీవితం దెబ్బతినే అవకాశం ఉంది.

మకరరాశి

మకరరాశి

ఈ రాశివారు 2018లో ఏ నెలలోనైనా 30వ తేదీ పెళ్లి చేసుకుంటే మంచిది. దీని వల్ల మీరు జీవితాంతం వైవాహిక బంధంలో ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తవు.

కుంభం

కుంభం

మీరు 2018లో ఏ నెలలోనైనా 14 వ తేదీ పెళ్లి చేసుకుంటే మేలు. దీని వల్ల మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారు. అయితే మీరు పెళ్లిచేసుకున్నాక ఆమె మాటలకు కాస్త విలువ ఇస్తూ ఉండండి. దీంతో మీ బంధం మరింత బలపడుతుంది.

మీనం

మీనం

మీరు 2018లో ఏ నెలలోనైనా 20 వ తేదీ పెళ్లి చేసుకుంటే మంచిది. దీనివల్ల మీ వైవాహిక బంధం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు. అందువల్ల మీరు వీలైతే 20వ తేదీ పెళ్లి చేసుకోండి.

English summary

best wedding date for 2018 according to zodiac sign

2018: Lucky Dates That Are Best For Weddings According To Zodiac Signs
Story first published: Tuesday, January 2, 2018, 15:00 [IST]