ర‌బ్బ‌రులా సాగిపోతానంటున్న పంజాబ్ యువ‌కుడు!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్ర‌పంచంలో కొంద‌రు విచిత్ర‌మైన టాలెంట్‌ను క‌లిగి ఉంటారు. అయ‌స్కాంత శ‌రీరంతో పాటు విద్యుత్‌ను త‌ట్టుకోగ‌లవారు ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వినూత్న‌త క‌లిగిన వ్య‌క్తులు సామాన్యుల ఆలోచ‌న‌ల‌కు కూడా అంద‌రు.

అలాంటి కోవ‌లోనే ఒక భార‌తీయ వ్య‌క్తి ఉన్నాడు. అత‌డిని ర‌బ్బ‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అత‌డి పేరే జ‌స్‌ప్రీత్ సింగ్ కల్రా.

అత‌డు త‌న శ‌రీరాన్ని విల్లులా ఒంచేయ‌గ‌ల‌డు. అత్యంత చురుకైన ఈ యువ‌కుడి గురించిన విశేషాలు తెలుసుకుంటే మీరు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతారు.

పంజాబీ వాడు

పంజాబీ వాడు

ఈ యువ‌కుడి వ‌య‌సు కేవ‌లం 15ఏళ్లు. పంజాబ్‌లోని లుధియానాలో పుట్టాడు. మ‌న దేశంలోనే అత్యంత వ్యాకుల‌త చెంద‌గ‌ల వ్య‌క్తిగా పేరును సంపాదించుకున్నాడు. ర‌బ్బ‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఇత‌డిని పిలుస్తారు.

లిమ్కా బుక్‌లో

లిమ్కా బుక్‌లో

బోన్‌లెస్ మ్యాన్‌గా లిమ్కా బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఆయ‌న‌కు వివిధ ర‌కాల పేర్ల‌తో ప్ర‌శంసలు అందుకున్నాడు. వ‌ర‌ల్డ్ యెంగెస్ట్ ఫ్లెక్సిబుల్ బాయ్ అనీ, ర‌బ్బ‌ర్ మ్యాన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అని ఎన్నో ప్ర‌పంచ రికార్డులను నెల‌కొల్పాడు.

ఎలా మొద‌లైందంటే..

ఎలా మొద‌లైందంటే..

జ‌స్‌ప్రీత్ శ‌రీరాన్ని ఒంచేయగ‌ల సామ‌ర్థ్యం ఎలా పొందాడో త‌న మాటల్లో వివ‌రించాడు. ఒక‌సారి మా యోగా టీచ‌ర్ న‌న్ను యోగా పోటీకి పంపించింది. ఆ త‌ర్వాత మ‌రిన్ని టోర్న‌మెంట్ల‌లో పాల్గొన‌డం ప్రారంభించాను. ఎన్నో బ‌హుమ‌తుల‌ను గెలుపొందాను. 11ఏళ్ల వ‌య‌సులో అనుకుంటా నా ప్ర‌త్యేక‌మైన టాలెంట్‌ను గుర్తించ‌గ‌లిగాను.

ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌డు!

ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌డు!

త‌న శ‌రీరాన్ని ఎటువైపుకైనా తిప్పేయ‌గ‌ల‌న‌ని గ్ర‌హించిన‌ప్పుడు ...ర‌క‌ర‌కాల విన్యాసాలు సాధన చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఏ నొప్పి లేకుండానే శ‌రీరాన్ని ఒంచ‌గ‌ల‌గ‌డం అత‌డికి క‌లిసొచ్చిన అంశం. 360 డిగ్రీల కోణంలో కాళ్ల‌ను, చేతుల‌ను తిప్పేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంది. ఎంతో క‌ఠిన‌మైన భుజాల టెక్నిక్‌ను కూడా అత‌డు అవ‌లీల‌గా చేసేయ‌గ‌ల‌డు.

వైద్యులు ఏం చెప్పారంటే

వైద్యులు ఏం చెప్పారంటే

ఇంత‌లా దేహాన్ని వంచ‌గ‌లిగే విష‌యాన్ని తెలుసుకున్న వైద్యులు అత‌డిని ఎక్స్‌రే తీసి ఏమైనా వింత‌గా ఉందేమో అని చూడాల‌నుకున్నారు. వారి ఆశ్చ‌ర్యానికి అలాంటిదేమీ లేదు. అంతా స‌వ్యంగా ఉంద‌ని తేల్చారు. ఒక డాక్ట‌ర్ అయితే ఇంత‌వ‌ర‌కు ఇలాంటి వ్య‌క్తిని నేను చూడ‌లేద‌ని కితాబిచ్చాడు. ఇన్నేళ్ల వైద్య స‌ర్వీసులో ఇంత‌గా శ‌రీరాన్ని ఒంచేయ‌గ‌ల వ్య‌క్తి ఇత‌డేనేమో అని ఆ డాక్ట‌ర్ అన్నాడు.

ఒప్పుకోవాల్సిందే అత‌డి టాలెంట్‌ను. ఈ క‌థ‌నంపై మీ అభిప్రాయాల‌ను కామెంట్స్ బాక్స్‌లో రాయ‌గ‌ల‌రు.

English summary

He Is The Most Flexible Man In The World

The tagline of calling him the rubber man of India is justified!
Story first published: Tuesday, November 21, 2017, 17:10 [IST]
Subscribe Newsletter