ఈ మసాజ్ సెంటర్లో పాములతో మసాజ్ చేయిస్తారంట..!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

స్పాస్ ఖరీదైనది కావచ్చు. కానీ ఈ ప్రదేశాలు కచ్చితంగా ఒక తాజా అనుభూతిని, విశ్రాంతిని, ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. మనల్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేదిగా, అత్యంత శక్తివంతమైన అనుభూతితో బయటకు వచ్చేటటువంటి ప్రదేశాలు గూర్చి వినాలని అనుకుంటాము.

ప్రస్తుత ధోరణిలో వివిధ రకాల చికిత్సలు, మసాజ్లు వచ్చాయి. కానీ ఈ మధ్యలో మసాజ్ కోసం పాములను వాడుతున్న వ్యక్తులున్నారని మీకు తెలుసా ?

snakes massage

బ్రతికున్న పాములను తినే మొనగాడు !

ఇది చాలా ప్రత్యేకమైన విషయం. కస్టమర్ల శరీరంపై పాములు ప్రాకడం వలన ప్రశాంతమైన విశ్రాంతిని అనుభూతి చెందినట్లుగా ఉంటుందని నమ్మేవారు చాలా ఎక్కువ. పాములతో మాస్టర్ అందించే స్పాలను గూర్చి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

విశ్రాంతిని అనుభూతి చెందడానికి ఇదొక కొత్త మార్గం :

విశ్రాంతిని అనుభూతి చెందడానికి ఇదొక కొత్త మార్గం :

ఇండోనేషియా, థాయిలాండ్లలోని ప్రజలు వారి కస్టమర్లకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి పాములను, కొండచిలువలను ఉపయోగించడం ద్వారా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. పాములను వినియోగదారుల మీద ఎలా ఉంచుతారో అని చూడగలగటం జోక్ కాదు.

ఈ మసాజు పార్లర్లు, స్పాలు - పాములను ఉపయోగించి శరీర మసాజ్ ను కస్టమర్లకు ఇవ్వడం ద్వారా వారికి సరికొత్త విశ్రాంతిని ఇవ్వాలని ఒక కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టారు. వినటానికి వెర్రితనంగా ఉన్నప్పటికీ ఇది పచ్చినిజం. కస్టమర్ల శరీరాకృతికి సరిపోయే వివిధ పరిమాణాలు గల పాములను, వివిధ రకాల జాతులను కలిగిన పాములను మసాజ్ చేయడం కోసం ఉపయోగిస్తారు.

ఈ పాములు విషపూరితమైనవి కావు :

ఈ పాములు విషపూరితమైనవి కావు :

పాముల నుండి వచ్చిన విషయాన్ని పూర్తిగా తీసివేయబడిన తర్వాతే కస్టమర్లకు మర్దన చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పాములు కస్టమర్ల శరీరాలపై ప్రాకడం ద్వారా మర్దనను చేస్తాయి. ఒక సర్వే ప్రకారం ఇప్పటివరకు శరీరానికి మర్దనను ఇచ్చిన మార్గాలలో ఇదే ఉత్తమమైనదని వెల్లడిఉత్తమమైనదని వెల్లడించింది.

పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి :

పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి :

కస్టమర్లు పాములతో శరీర మర్దన ను పొందినపుడు కొన్ని నిముషాలలోనే నిముషాలలోనే వారు విశ్రాంతిని పొందటం జరుగుతుంది అలాగే ఇది శరీర నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

ఈ చికిత్స అనేది శరీరమును, మనస్సును ప్రశాంతపరిచే చికిత్సగా పనిచేస్తుంది.

శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్..!!

ఈ మసాజ్ ప్రాచుర్యం పొందుతున్నాయి :

ఈ మసాజ్ ప్రాచుర్యం పొందుతున్నాయి :

ఇండోనేషియా, థాయిలాండ్లో పాములతో బాడీ మసాజ్ చేయడం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ధోరణి ఇతర దేశాల అంతటా వ్యాప్తి చెందుతోంది, అక్కడ ప్రజలు ఈ విలక్షణమైన విశ్రాంతి దిశగా కదులుతున్నారు.

ఫిలిప్పీన్స్ లో ఒక జంతు ప్రదర్శనశాల కూడా దీనిని అనుసరిస్తుంది ...

ఫిలిప్పీన్స్ లో ఒక జంతు ప్రదర్శనశాల కూడా దీనిని అనుసరిస్తుంది ...

ఫిలిప్పీన్స్లోని సెబు సిటీ జంతుప్రదర్శనశాల, శారీరక, మానసిక విశ్రాంతిని పొందడానికి ఈ ప్రత్యేకమైన మర్దన అనుభవాన్ని కోసం ప్రజలు కొన్ని విషయాలను అనుసరిస్తున్నారు. ఇతర ఉత్తమ స్పాలు విధించే భారీ ధరల వలె కాకుండా ఇది పూర్తిగా ఉచితం.

స్పా లో వాళ్లేం చేస్తారు :

స్పా లో వాళ్లేం చేస్తారు :

ఈ కొండచిలువలను వాటి కేజ్స్ (cages) నుంచి బయటకు తీసి, వెదురు మంచం మీద పడుకున్న సందర్శకుల శరీర వెనక భాగం పై ఉంచుతారు. ప్రజలు పాములతో మర్దన చేయించుకునే సమయంలో జూ సిబ్బంది పాములను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.

కొన్ని దేశాల్లో నిషేధిత జాబితాలో ఉన్న విషయాలు

250 కిలోల బరువుగల పాములు :

250 కిలోల బరువుగల పాములు :

250 కిలోల బరువుగల పాములతో చికిత్సను ప్రారంభిస్తారు. ఒక్కసారి ఇలాంటి పాములతో చికిత్సా మొదలైన తరువాత తప్పించుకోవడానికి వీలు ఉండదు. ఈ కొండ చిలువలు, ఈ భారీ పాములు జారుతూ కదులుతూ ఉండడం ద్వారా చికిత్సను అందించడం వల్ల ఎక్కువ విశ్రాంతిని కలిగించే అనుభూతిని కలిగిస్తాయి.

ఇవి (పాములు) కూడా కష్టమర్ల శరీరంపైన విస్తరించి నాలికతో తడమడం ద్వారా చక్కిలిగింతలను బోనస్ గా పొందుతారు .

మిమ్మల్ని పట్టుకోవడం :

మిమ్మల్ని పట్టుకోవడం :

కానీ ఈ చికిత్స విధానాన్ని ఉపయోగించుకునే వ్యక్తులకు తీవ్రమైన నిబంధన ఉంది, ఎందుకంటే ఇది ధైర్యమైన హృదయం కలవారు మాత్రమే కాబట్టి. ఒకసారి చికిత్స మొదలైన తర్వాత మీరు మరవకూడదు, ఆ శబ్దాలకు ప్రకంపనలకు పాములు అనుభూతి చెంది మిమ్మల్ని ఆహారముగా భావించి, గట్టిగా పట్టుకోవచ్చని చెప్పబడింది.

Read more about: life, bizarre, లైఫ్
English summary

Heard About The Snake Massage?

The snakes crawl over the body of the clients and make them feel relaxed.
Story first published: Monday, September 4, 2017, 20:00 [IST]
Subscribe Newsletter