ఏంజెలీనా జోలిలా మారాలనుకుంది.. చివరికి ఇలా అయ్యింది

Written By: Bharath
Subscribe to Boldsky

ఆమె ఏంజెలినా జోలిలాగా మారాలనుకుంది. అందుకోసం దేనికైనా సిద్ధమనుకుంది. 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుంకుంది. ఈ శస్త్ర చికిత్సలు చేయించుకోక ముందు ఆమె చాలా అందంగా ఉండేది. ఆ తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది. చాలా దారుణంగా తయారైంది. అసలు ఆమె ముఖం చూడడానికి కూడా వీల్లేకుండా అసహ్యంగా మారింది. ఆమె ఎందుకలా తయారైంది. అలా కావడానికి కారణాలు ఏమిటి. అసలు ఆమె ఎవరు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

ఆమె పేరు సహర్ తబార్

ఆమె పేరు సహర్ తబార్

సహర్ తబార్ అనే ఇరాన్ యువతి ఈమె తన యంగ్ ఏజ్ నుంచే ప్లాస్టిక్ శస్త్రచికిత్సలకు అలవాటుపడిపోయింది. అందంగా తయారవ్వాలనే కోరిక ఆమెలో ఎక్కువగా ఉండేది. ఆ కోరికనే ఆమెను అసహ్యంగా మార్చింది. ఎంజెలీనా జోలికి ఈమె పెద్ద ఫ్యాన్. అలా మారాలని ఆమె చిన్నతనం నుంచి అనుకునేది. అందుకోసం లెక్కలేనన్ని ప్టాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

50 సర్జరీలు చేయించుకుంది

50 సర్జరీలు చేయించుకుంది

ఈమె తన అందాన్ని పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు 50 దాకా చేయించుకుంది. దీంతో ఇప్పుడు అస్థిపంజరంలా మారింది. శరీరం మొత్తం కేజీ కండ కూడా లేదు. మొత్తం ఎముకలే.

మొదట ఎవరూ నమ్మలేదు

మొదట ఎవరూ నమ్మలేదు

మొదట ఆమె ఫోటోలను చూసి ఎవరూ నమ్మలేదు. ఈమె తన ఫొటోలను కేవలం మారుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తుందనుకున్నారు. కానీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం వల్ల ఆమె ఇలా అసహ్యంగా మారిందని ఎవరికీ తెలియదు.

పూర్తిగా బరువు తగ్గిపోయింది

పూర్తిగా బరువు తగ్గిపోయింది

ఆమె చాలా వరకూ బరువు తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె బరువు కేవలం 40 కేజీలకంటే తక్కువే. ఆమెపై శరీరం అంతా ఎముకలే కనిపిస్తున్నాయి. ఏంజెలీనాలా తయారవ్వాలనుకున్న ఆమె ఇలా ఎముకల గూడులా మారిందా అంటూ కొందరు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.

ఎంతో అందంగా ఉండేది

ఎంతో అందంగా ఉండేది

ఆమె ఏంజెలీనాలా మారాలని అనుకోకముందు ఎంతో అందంగా ఉండేదని చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అందవిహీనంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోల మీద పిచ్చి ఉండాలి కానీ మరీ ఇంత ఉండకూడదు అని సహర్ ను చూస్తే తెలుస్తోంది.

ప్రయత్నం బెడిసికొట్టింది

ప్రయత్నం బెడిసికొట్టింది

హీరోయిన్ లాగా మారాలనుకున్న ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. సర్జరీలు వికటించడమే ఇందుకు కారణం. దీంతో ఆమెను చూడాలంటేనే అందరికీ భయం వేస్తుంది. ఇక ఆమె సన్నిహితులేమో ఇంతకు మా సహరేనా ఇలా మారింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

ఈమెకు ఇంస్టాగ్రామ్ లో కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది సహర్‌‌. అయినా ఆమె ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. కానీ తాను చేసిన పనిపై చాలా మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

తన ఫేస్ తానే చూసుకోలేకపోతుంది

తన ఫేస్ తానే చూసుకోలేకపోతుంది

ఏంజెలీనా జోలిలాగా మారాలనుకున్న స‌హ‌ర్‌ అన్ని సర్జరీలు చేయించుకోవడం వల్ల చివ‌రికి త‌న ఫేస్ తానే చూసుకోలేనంత భ‌యంక‌రంగా మారింది. సహర్ ఒక‌ప్పుడు ఎంతో అందంగా ఉండేది. మంచిగా ఉన్న ఆమె లేనిపోని సర్జరీలతో ఇలా అంద‌విహీనంగా మారడం ఆమె చేతులారా చేసుకున్న పనే.

కామెంట్స్

కామెంట్స్

అయితే సహర్ ఫొటోలపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. కొంద‌రు ఆమెను దెయ్యంలా ఉన్నావ‌ని, అస్థిపంజరంలా మారావ‌ని, మంత్ర‌గ‌త్తెలా ఉన్నావ‌ని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీ ఫేస్ పై ఎవరైనా బాంబు వేశారా? జాంబీ లాగా ఉన్నావ్.. ఇంత భయంకరంగా మారావు.. సర్జరీ చేయించుకోకుంటే చాలా బాగుండేదానివి అంటే ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

పెరిగిన ఫాలోవర్స్

పెరిగిన ఫాలోవర్స్

దారుణంగా తయారైన ముఖంతోనే ఆమె తన ఫోటోలను రెగ్యులర్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. దీంతో సహర్‌ కు ఇప్పుడు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోయింది. ఆమెను ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతానికి దాదాపు 4 లక్షలకుపైగా ఆమె ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆమె గతంలో ఉన్న ఫొటోను చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత అందంగా ఉన్న అమ్మాయి ఇలా మారిందా అనుకుంటారు.

English summary

meet the girl who tried look like angelina julie now looks like zombie

Meet The Girl Who Tried To Look like Angelina Julie and Now Looks Like Zombie! Sahar Tabar, Recent Instagram Sensation, Who Tried To Look like Angelina Julie and Now Looks Like Zombie!
Story first published: Saturday, December 2, 2017, 12:00 [IST]