అక్కడ దేవుడికి మద్యంతోనే నైవేద్యం, ఏంటి ఈ వింత ఆచారం? ఎక్కడ జరుగుతోంది?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రపంచంలో అనేక లాజిక్ లేని విషయాలు జరుగుతుంటాయి. కానీ భారతదేశంలో కొంతమంది ప్రజలు పాటించే మూఢనమ్మకాలు ఒక్కోసారి ఊహను దాటేస్తాయి.

భక్తులు తమ దేవుణ్ణి మెప్పించటానికి ఒక్కోసారి పరిధులు దాటేస్తారు. అందులో ఒకటి దేవుడికి మద్యం నైవేద్యంగా పెట్టడం, ఈ దేవుడిని భారతదేశ మద్యదేవుడిగా పూజిస్తారు!

Meet The God Who Drinks Alcohol

భక్తులు ఇక్కడ దేవుడికి మద్యం సీసాలు నైవేద్యంగా పట్టుకొస్తారు. ఈ ప్రత్యేక గుడి, అక్కడ ప్రేమగా మద్యదేవునిగా పిలుచుకునే ఈ దేవుడి వివరాలను తెలుసుకోండి!

దేవుడికి నైవేద్యం నివేధించే విషయంలో ఖచ్చితంగా చేయకూడని పొరపాట్లు ..!!

ఈ గుడి ఉజ్జయినిలో ఉంది

ఈ గుడి ఉజ్జయినిలో ఉంది

ఈ కాలభైరవుని గుడి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది. ఈ గుడి నగరాన్ని రక్షించే కాలభైరవునికి చెందినది. దీన్ని బద్రసెమ్నాన్ నిర్మించారు. ఇదొక ప్రాచీన నిగూఢ హిందూ ఆలయం.

భక్తులు ఇక్కడ దేవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు

భక్తులు ఇక్కడ దేవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు

భక్తులు గుడికి ఆల్కహాల్ ను తీసుకొస్తారు మరియు వారికి ఇదే ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ దేవుడు మద్యం తాగుతాడు కూడా! మీరు ఈ గుడికి వెళ్ళినపుడు బయట మార్కెట్లో ఆల్కహాల్ ను అమ్మడం చూడవచ్చు.

ఈ దేవుని గురించి…

ఈ దేవుని గురించి…

హిందూమతంలో భైరవుడిని పరమశివుని క్రోధరూపంగా భావిస్తారు. ఎనిమిది మంది భైరవులలో కాలభైరవుడు ముఖ్యుడు, అందుకే ఆయన్ని పూజిస్తారు.

దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడుతారు?ఎందుకు తినాలి..?

నైవేద్యాలు

నైవేద్యాలు

భక్తులు మద్యం సీసాను పూజారికి అందిస్తే, ఆయన దాన్ని ఒక పళ్ళెంలో పోసి, దేవుడు విగ్రహం నోటి వద్ద పెడతారు. అక్కడ పెట్టిన సీసాలోని మొత్తం మద్యం ఎక్కడకి పోతుందో ఎవరికీ ఇప్పటిదాకా అంతుచిక్కలేదు.ఇలా చాలా ఏళ్ళనుంచి జరుగుతోంది.

చాలామంది పరిశోధకులకు ఇంకా జవాబులు దొరకలేదు!

చాలామంది పరిశోధకులకు ఇంకా జవాబులు దొరకలేదు!

ఈ గుడిలో పనిచేసే పూజారులు చాలా ఏళ్ళ నాటినుంచి అనేకమంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇక్కడకి వచ్చి ఆ ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తోందో వెతకడానికి ప్రయత్నించారని, కానీ వారికి జవాబు దొరకలేదని తెలిపారు. ఇది ఇంకా అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది

ఇక్కడ ఏం జరుగుతోందని అనుకుంటున్నారు?కింద కామెంట్ సెక్షన్ లో మాకు కూడా తెలియచేయండి.

English summary

Meet The God Who Drinks Alcohol

We wonder where the alcohol that is offered to the God goes to!
Subscribe Newsletter