ఇలాంటి వింత శిశువులు మీకు పుట్టే అవకాశం ఉంది! ఎందుకో తెలుసుకోండి

Written By:
Subscribe to Boldsky

సాగర కన్య రూపంలో తాజాగా పుట్టిన ఒక శిశువు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి వైద్యులు చాలా అరుదుగా పుడుతారు. జన్యులోపం వల్లే ఇలాంటి బేబీలు జన్మిస్తారు.

కోల్ కతాలోని చిత్తరంజన్ సదన్ ఆస్పత్రిలో ముస్కుర బీబీ అనే మహిళ ఇలాంటి శిశువుకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించాక వైద్యులు షాక్ కు గురయ్యారు. అచ్చం చేపలాగా ఉండే శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఆ శిశువును వెంటనే ఐసీయూలో ఉంచి డాక్టర్లు వైద్యం చేశారు.

చాలా అరుదు

చాలా అరుదు

ఇలాంటి మెర్మైడ్ బేబీలు పుట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. వైద్యులు కూడా ఆ బేబీని చూసి మొదట ఆశ్చర్య పోయారు. చేప ఆకారంలో ఉండే ఈ శిశువు కాళ్లు రెండు అతుక్కుపోయాయి. "మెర్మైడ్ సిండ్రోమ్, లేదా సైరొనెమిలియా" అని దాని వల్ల ఇలాంటి పిల్లలు జన్మిస్తారు.

రెండో కేసు

రెండో కేసు

ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి శిశువు జన్మించడం రెండోసారి. ఇక ప్రపంచంలో అయితే ఐదోసారి ఇలాంటి శిశువు జన్మింంచారు.

మగ, ఆడ అనే విషయం తెలియదు

మగ, ఆడ అనే విషయం తెలియదు

అయితే ఈ శిశువు మగ, ఆడ అనే విషయం వైద్యులకు కూడా తెలియడం లేదు.ఎందుకంటే శిశువు ఎలాంటి జననేంద్రియాలు లేకుండా జన్మించారు. దీంతో శిశువు ఏ లింగానికి చెందిన వారో తెలుసుకోవడం కాస్త కష్టతరం.

నాలుగు గంటల్లోనే

నాలుగు గంటల్లోనే

అరుదుగా పుట్టే ఇలాంటి పిల్లలు బతకడం చాలా కష్టం. వీరి అవయవాలు సరిగ్గా పని చేయవు. చాలా జన్యులోపాల వల్ల పుట్టడం వల్ల ఇలాంటి శిశువులు ఎక్కువ రోజులు బతకలేరు. ఈ శిశువు జన్మించిన నాలుగు గంటలకే మరణించారు.

శిశువు ఇలా

శిశువు ఇలా

ఈ శిశువు ముఖం బాగానే ఉంది. చేతులు కూడా బాగానే ఉన్నాయి. కానీ శరీరం పొత్తి కడుపు వరకే ఎదిగింది. ఆ కింది శరీర భాగాలు తల్లి కడుపులో ఎదగలేదు. నడుము కింది నుంచి శరీరం మొత్తం కలిసి పోయింది.

పోషకాహారం లేకపోవడంతోనే

పోషకాహారం లేకపోవడంతోనే

ఈ శిశువు తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లే పిండానికి సరిగ్గా రక్త ప్రసరణ కాలేదు. దీంతో శిశువు శరీర భాగాలు ఎదగలేదు. అసంపూర్తిగా ఉన్నాయి. ఇలాంటి శిశువులు ఎక్కువ సేపు బతకరని డాక్టర్లు వెల్లడించారు. గర్భిణీలు పోషకాహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఇలాంటి శిశువులు పుట్టే అవకాశం ఉంది.

English summary

mermaid baby born in kolkata

Can You Believe A Woman Gave Birth To A 'Mermaid Baby'?
Story first published: Saturday, December 16, 2017, 10:23 [IST]