ఈ రాశుల్లో మీ రాశి ఉంటే.. 2018లో మీ దశ తిరిగిపోద్ది!

Written By:
Subscribe to Boldsky

ఈ సంవత్సరం మీరు చాలా సమస్యలు.. కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రానుంది. నూతన సంవత్సరంలోనూ మీరు అలాగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. అవసరం లేదు. మీ రాశిని బట్టి మీరు 2018లో చాలా ఆనందంగా గడుపుతారు. కొన్ని రాశుల వారికి 2018లో తిరుగులేదు.

ప్రతి పని విజయవంతం

ప్రతి పని విజయవంతం

2018లో కొన్ని రాశుల వార చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. వారు ప్రతి క్షణం ఆనందంగా గడుపుతారు. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ మీ రాశి అందులో ఉంటే మీ అంత అదృష్టువంతులు ఇంకొకరు ఉండరు. మీకు తిరుగుండదు.

2018లో ఈ రాశుల వారికి అనుకూలంగా గ్రహాలు

2018లో ఈ రాశుల వారికి అనుకూలంగా గ్రహాలు

మన హిందువుల కొత్త సంవత్సరం ఉగాది కదా.. ఇది ఇంగ్లీష్ వారిది కదా అని డౌట్ పడకండి. సరే మన జ్యోతిష్యం ప్రకారమే వెళ్దాం. 2018 ప్రారంభం నుంచి ఈ రాశుల వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వీరికి 2018 అంతా మంచి రోజులే.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు దాదాపు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వీరిని అదృష్టం వెంటాడుతుంది. 2018 లో వీరు ఏ పని ప్రారంభించినా అన్నీ విజయాలే చేకూరుతాయి. జాబ్ కోసం వెతికేవారు జాబ్ సాధించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాలు చేసేవారు వారి వ్యాపారాల్లో మంచి లాభాలు సాధిస్తారు. విజయపథంలో దూసుకెళ్తారు.

ఆరోగ్యపరంగా..

ఆరోగ్యపరంగా..

సింహరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు రావు. జీవితభాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వీరి చెంతకు ఎలాంటి సమస్యలు దరి చేరవు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేసే అవకాశం ఉంది. వాటిని చేయకుండా ఉంటే చాలు. ఇక మిగతాపరంగా వీరికి 2018 అన్ని విజయాలనే తెచ్చిపెడుతుంది.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి కూడా 2018లో తిరుగుండదు. ధనుస్సు రాశి కాస్త ధైర్యం ఎక్కువ. వీరి ఏ పని చేయడానికైనా వెనుకాడరు. వీరికి ఆలోచన శక్తి కూడా ఎక్కువే. 2018లో వీరు అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించరు. కచ్చితంగా వీరు అనుకున్న విషయాలన్నీ సాధిస్తారు. గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరిని అడ్డుకునే దమ్ము కూడా ఎవరికీ ఉండదు. మీది ఒకవేళ ధనుస్సు రాశి అయితే మీరు చేసే పనిలో ఏమాత్రం వెనుకడుగు వేయకండి.

అన్నీ శుభాలే

అన్నీ శుభాలే

ధనుస్సు రాశి వారికి కొన్ని రకాల అడ్డంకులు ఎదురవ్వవొచ్చు. అయినా ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి. మీకు చాలా రకాల అవకాశాలు వస్తాయి. ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. 2018 మీకు అన్నీ శుభాలే తీసుకురానుంది. ఏదో ఒకట్రెండు సందర్భాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

 వృత్తిపరంగా (ధనుస్సురాశి)

వృత్తిపరంగా (ధనుస్సురాశి)

మీరు వృత్తిపరంగా అన్నీ విజయాలే చూస్తారు. మీరు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడుతున్నట్లయితే మీకు నచ్చిన చోటుకు వెళ్లి వస్తూ ఉండండి. మీరు చేసుకోబోయే వారిని కూడా 2018లో కలుస్తారు. మీరిద్దరి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.

కన్యరాశి

కన్యరాశి

2017 లో కన్య రాశివారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో వీరు అన్నీ శుభాలే చూస్తారు. వీరి 2018 కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీకు మీ సన్నిహితులతో, ప్రేమికులతో బంధం మరింత బలపడుతుంది. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు లేదా ఆరాధించే వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. ఇక నుంచి మీతో చాలా సన్నిహితంగా మెలుగుతారు.

బంధాలు బలంగా (కన్య రాశి)

బంధాలు బలంగా (కన్య రాశి)

2018లో పురుడు పోసుకునే ఈ బంధాలు మీకు జీవితాంతం తోడుంటాయి. ఇక పెళ్లికాని వారు కచ్చితంగా వారికి నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిని కలుస్తారు. వారితో జీవితాంతం ఉంటారు. 2018 లో కన్యరాశి వారికి బాగా కలిసొస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి. కన్యరాశి వారు 2018లో జీవిత భాగస్వాములతో మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబంపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి 2018లో బాగా కలిసొస్తుంది. పెళ్లికానివారికి వారికి నచ్చిన వారితో పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత వైవాహిక బంధం కూడా చాలా బాగుంటుంది. 2018లో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. వారి ద్వారా మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టబోయే ప్రతి పని విజయవంతం అవుతుంది.

ఇబ్బందులుండవు (వృశ్చికరాశి)

ఇబ్బందులుండవు (వృశ్చికరాశి)

మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. సమస్యలు కూడా రావు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు కాస్త సహనం పాటించి ముందుకెళ్తే చాలు.

మీనరాశి

మీనరాశి

2018లో మీనరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు పెళ్లికాకుంటే త్వరలోనే పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంది.

వైవాహిక జీవితం (మీనరాశి)

వైవాహిక జీవితం (మీనరాశి)

మీ వైవాహిక జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. మీకు ఇక నుంచి అన్నీ విజయాలే కలుగుతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మీకు ప్రతి విషయంలో సహకరిస్తుంది. మీకు 2018 తిరుగుండదు.

English summary

most luckiest zodiac signs 2018

most luckiest zodiac signs 2018
Story first published: Wednesday, December 20, 2017, 11:01 [IST]