For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కో రాశిలో దాగున్న వ్యక్తిగత లక్షణాలు..!

By Lekhaka
|

రాశులు, జోతిష్యం మనిషి యొక్క స్వభావం, లేదా వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధమైన గుణాలు ఉంటాయి. . అదే విధంగా ఒక్కో వ్యక్తి వారి పుట్టిన సమయం, రోజును బట్టి, వారి జన్మ నక్షత్రాలు నిర్ణయిస్తుంటారు. రాశుల్లో 12 రాశులున్నాయి. ఒక్కో రాశిలో ఒక్కో విధమైన లక్షణాలు ఉంటాయి.

ఒక్కో రాశిని గురించి తెలుసుకున్నప్పుడు ఒక్కో రాశిలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని రాశుల వారిలో సాధారణ లక్షణాలు కలిగి ఉంటారు. రాశుల బట్టి ఒక్కో రాశివారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..

మీ జాతకం ప్రకారం మీ పేరులో అదృష్టం తెలుసుకోవడం ఎలా

ఇంకెందుకు ఆలస్యం మీ రాశిని బట్టి మీలోని వ్యక్తిత్వ లక్షణాలు, సంకేతాలు గురించి తెలుసుకోండి...

మేష రాశి:

మేష రాశి:

మేష రాశి వారు చాలా ధైర్యవంతులు, వీరు అనుకున్న పనులను చాలా త్వరగా చేస్తారు. వీరిలోని స్రుజనాత్మకతను పెంచుకోవడానికి వివిధ రకాలుగా ఆలోచిస్తారు. ఆ స్రుజనాత్మకత వల్ల వీరిలోని ప్రతిభను ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా చేస్తుంది. వీరు అనుకున్నది సాధిస్తారు. సాధించడంలో మంచి పేరు పొందుతారు.

వృషభం

వృషభం

వృషభం రాశివారు స్థిరమైన వారు, తెలివైన వారు. అయితే ఒక విధానానికి కట్టుబడి ఉండటం కంటే, ఆ విధాన్ని మరి కొంత విస్తరించి నలుగురికి ఉపయోగపడేలా ఉంటారు. వీరు చేసి ప్రతి పనిమీద విశ్వాసం కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకుంటారు. మీ మనస్సు ఏం చెబుతుందో అది వింటే ఎఫెక్టివ్ ఫలితాలను పొందుతారు.

మిథునం

మిథునం

మిథున రాశి వారు గొప్ప ఆలోచనాపరులు, వాక్ చాతుర్యం కలిగి , నలుగురిలో త్వరగా కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. మార్పు కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు. నాలుగు అవకాశాలున్నప్పుడు నాలుగింటిని ఎంపిక చేసుకోకుండా, ప్రస్తుతం ఏం చేస్తున్నారో దాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటారు . పరిస్థితుల బట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. మనస్సు వినకపోతే ఎంత విలువైనదైనా వదులకోవడానికి సిద్దంగా ఉంటారు.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటక రాశి వారు చాలా సున్నిత స్వభావం కలవారు, ప్రతి పనిలో చురుకుగా ఉంటారు, సృజనాత్మకతను కలిగి ఉంటుంది. మీ ఆలోచనలను ఒక బాక్స్ లో ఉంచేసి, మనస్సుతో కాకుండా తెలివితో ఆలోచించి పనిచేయాలి. ఒక పనిమీద ఏకాగ్రత కలిగి నేర్చుకునే పనివల్ల మీలోని అద్భుతమైన శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి.

సింహ రాశి :

సింహ రాశి :

బయటకు మాట్లాడే వ్యక్తి సహజంగా సానుకూలంగా ఉంటారు. బయటికి కనిపంచేది వాస్తం కాదు, లోపలి మనిషి. ఏది. ఏపని అయినా చేయడానికి ముందు ప్లాన్ చేసుకోవడం మంచిది. కొంచెం సమయం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, స్వంతంగా మంచి నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళాలి. వీరు అందంగా ఉంటారని అందరూ భావిస్తారు, కానీ ప్రేక్షకులు లేకపోతే అది మీరు ఎలా ఒప్పించగలుగుతారు.

కన్య రాశి :

కన్య రాశి :

కన్య రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. సహాయ గుణం కలిగి ఉంటారు . ఇది మంచి లక్షణంగానే సూచిస్తుంది. కానీ లోపల చాలా హార్డ్ నెస్ ఉంటుంది. రిస్క్ చేయడం అంటే ఇష్టపడుతారు. అనుకున్నవి సాధించుకోవడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఎంత పనైనా చేస్తారు. చాలా గంభీరంగా, ప్రొటక్టివ్ గా ఉంటే మంచిది. కొత్తగా అవలంబించే పనుల్లో విజయం సాధిస్తారు.

తుల రాశి :

తుల రాశి :

తులా రాశివారు చాలా సోషియల్ ఉంటారు, నలుగురిలో చాలా సులభంగా కలిసిపోతారు. మాటనేర్పరి. సమాజంలో గొప్పగా, గౌరవంగా జీవించాడానికి ఇష్టపడుతారు. నలుగురు వీరి చూసి ఇష్టపడాలని కోరుకుంటారు. మర్యాదరపూర్వకంగా నడుచుకుంటారు. సమస్యలను తగ్గించుకోవడానికి మొదట వాటి మీద దృష్టి పెడుతారు. ఇతరుల సమస్యలను నివారించడానికి ముందుకు వస్తారు.

వృశ్చికం :

వృశ్చికం :

వృశ్చిక రాశివారు సహజంగా ఉద్వేగభరితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఇతరుల వల్ల లోతుగా ఆలోచించే స్వభావం అవసరం అవుతుంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక్కరే ఆలోచించడం కంటే, మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కళను నెరవేర్చుకోగలుగుతారు.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశివారు ప్రేరేపితమైన, ఆశాజనంగా, విరామం లేని వ్యక్తిగా జీవిస్తారు. వీరు ఎప్పుడూ మీరికి తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవడానికి చూస్తుంటారు. దాని ద్వారా వారి కళను నెరవేర్చుకుంటారు

English summary

Traits That Define Each Zodiac Sign

Learning about zodiac signs makes it easy to understand a person. When it comes to understanding their characterstic, all one needs to find out is about the particular traits of the zodiac sign, which are more or less common for each zodiac.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more