రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవే

Written By:
Subscribe to Boldsky
రాశుల ప్రకారం వారి సీక్రెట్స్.. భయాలు, రహస్యాలు ఇవే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన రాశులు మనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరిలో కొన్ని భయాలు అంతర్గతంగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఆందోళనలతో సతమవుతుంటారు. కొందరు కొన్ని రకాల సీక్రెట్స్ మెయింటెన్ చేస్తారు. రహస్యంగా ఉంటూ ఉంటారు.

వారి గుణాలు తెలుసుకోవొచ్చు

వారి గుణాలు తెలుసుకోవొచ్చు

ఈ గుణాలు మొత్తం ఆ వ్యక్తులకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఆయా రాశుల ప్రకారం ఏయే రాశివారికి ఏయే గుణాలుంటాయో మీరు తెలుసుకోండి. మీకు జ్యోతిష్యంపై నమ్మకం ఉంటే వీటిని నమ్మండి లేదంటే వదిలేయండి. కచ్చితంగా వీటిని మీరూ నమ్మండని మేము మీకు చెప్పడం లేదు. అది మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

మేషరాశి వారు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొంటాం అనే ధైర్యంతో ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కుంగిపోరు. భయపడరు. వీరు సమస్యలకు ఎదురొడ్డి పోరాడుతారు. వీరు ప్రతి సమస్యపై గెలవాలని ప్రయత్నిస్తారు. వీరికే కాదు.. వీరి ఆత్మీయులకు.. వీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారికి ఏ సమస్యవొచ్చినా తట్టుకోరు. దాన్ని ఎలాగైనా పరిష్కరించుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తారు. అలాగే తమకు ఎవరూ దూరం కాకూడదనే భావనలో వీరు ఉంటారు.

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

వీరు ఆర్థిక విషయాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మంచి స్నేహితులుంటారు. హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే డబ్బు విషయంలో వీరు ఒక్కోక్క సారి ఇబ్బందులుపడుతుంటారు. చేతినిండా సంపాదన ఉన్నా ఒక్కోసారి రూపాయి కూడా చేతిలో ఉండదు.

వీరు ఖర్చు చేయడానికే సంపాదిస్తారు. ఆర్థికంగా వీరు స్థిరంగా ఉంటే వీరికి ఇంకా ఎలాంటి కష్టాలు లేవు.

మిథునరాశి (మే 21 - జూన్ 20)

మిథునరాశి (మే 21 - జూన్ 20)

వీరు నిర్ణయాల తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు నిర్ణయాలను వెంట వెంటనే తీసుకుంటారు. వెంట వెంటనే మార్చుతారు. వీరికుండే బలహీనత ఇదొక్కటే. వీరు దీన్ని అధిగమిస్తే జీవితంలో వీరికి ఎలాంటి కష్టాలుండవు. ప్రతి సారి వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో ఇబ్బందులుపడుతూనే ఉంటారు.

కర్కాటకం (జూన్ 21 - జూలై 22)

కర్కాటకం (జూన్ 21 - జూలై 22)

వీరు ఇంటికి దూరంగా ఉండాలంటే చాలా ఆందోళన చెందుతారు. ఏదైనా ఆఫీసు పనిమీదో లేదంటే వ్యాపారనిమిత్తమో ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. వీరికి కొత్త ప్రాంతాల్లో అస్సలు నిద్ర కూడా పట్టదు. తమ ఇంటికి మించిన సురక్షితమైన ప్రాంతం ఇక ఎక్కడ లేదని భావిస్తారు. ఇంట్లో అయితే తమకు నచ్చినట్టుగా ఉండొచ్చనేది వీరి అభిప్రాయం. వేరే ఎక్కడికెళ్లినా వీరి మనస్సు బిక్కుబిక్కుమంటుంది. అయితే వీరి ఆలోచిన మంచిదే కానీ అది వీరి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. చాలా అవకాశాలు వీరు మిస్ అవుతారు.

సింహరాశి (జూలై 23 - ఆగష్టు 22)

సింహరాశి (జూలై 23 - ఆగష్టు 22)

వీరు పక్కవారు తమను విస్మరిస్తున్నారని భయపడతారు. ప్రతి క్షణం లోలోపల ఆందోళన చెందుతుంటారు. వీరు చాలా లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. అయితే వీరు ఇదొక్క విషయంలో స్ట్రాంగ్ గా ఉంటే చాలు.

కన్యరాశి (ఆగష్టు 23 - సెప్టెంబర్ 22)

కన్యరాశి (ఆగష్టు 23 - సెప్టెంబర్ 22)

వీరు ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. వీరు అంతా నీట్ గా ఉండాలనుకుంటారు. అసంపూర్ణంగా ఉండడమంటే వీరికి అస్సలు నచ్చదు. వీరి వ్యక్తిగతంగా కూడా చాలా నీట్ గా ఉండాలనుకుంటారు.

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

వీరికి ఒంటరిగా ఉండడమంటే చాలా భయం. వీరు చాలా తెలివైనవారు. అయితే వీరు భాగస్వామికి దూరంగా, నచ్చిన వారికి దూరంగా ఉండాలంటే అస్సలు ఉండలేరు. ఎక్కువగా భార్యభర్తల విషయంలో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంది. ఇద్దరిలో ఎవరైనా తులరాశి వారు ఉంటే వారు భార్య లేదా భర్తను వదిలి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఒంటరిగా ఒక్కరోజు ఉన్నా వీరికి నరకంలా ఉంటుంది. వీరికి ఈ విషయంలో తప్పా ఇక దేనికీ ఆందోళన చెందరు.

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

వృశ్చికరాశి వారు ఎక్కువగా సానిహిత్యం కోరుకుంటారు. తమ చుట్టూ ఎప్పుడూ ఫ్రెండ్స్, ఆత్మీయులు ఉండాలని వారు తమని ఎంతో ప్రేమించాలనుకుంటారు. ఒకవేళ వీరిని భాగస్వామి సరిగ్గా పట్టించుకోకుంటే వెంటనే వివాహేతర సంబంధం వైపు మొగ్గు చూపుతారు. ఎవరైనా సరే వీరితో బాగా సానిహిత్యంగా మెలగాలని కోరుకుంటారు.

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

వీరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. వీరు నచ్చిన ప్రతి ప్రాంతానికి వెళ్లి రావాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్ తో కలిసి రెగ్యులర్ గా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే వీరు అక్కడికి వెళ్లాక ఏమవుతుందోనని కాస్త మనస్సులో ఆందోళన చెందుతుంటారు. తాము నచ్చిన ప్రాంతానికి వెళ్లాక అక్కడ ఏమైనా ఇబ్బందులకు గురవుతామా అని ఒకటే ఆందోళన చెందుతుంటారు.

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

వీరు తాము వైఫల్యం చెందుతామని ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. వీరు వారు చేసే పనిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా పని చేస్తుంటారు. అయితే చాలా పనుల్లో వీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. వీరు భయాన్ని కాస్త పోగొట్టుకొని ముందుకెళ్తే చాలు.

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

వీరి కొన్ని భయాలతో ఇబ్బందులుపడుతుంటారు. వీరు పని చేసే ప్రాంతంలో కాస్త ఇబ్బందిపడుతుంటారు. అలాగే పెళ్లి విషయంలో ఆందోళన చెందుతుంటారు. తమకు ఎలాంటి అమ్మాయి భార్యగా వస్తుందోనని బెంగపడుతుంటారు.

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

వీరు బాధ్యతకు సంబంధించిన విషయంలో కాస్త భయపడుతుంటారు. వీరు ఎక్కువగా గాల్లో మేడలు కడుతుంటారు. వీరికి ఏదైనా పని అప్పగిస్తే దాన్ని చాలా బాధ్యతగా పూర్తి చేయాలనుకుంటారు. కానీ చాలా భయపడుతూ ఆ పని పూర్తి చేస్తారు. అందులో ఏవైనా తప్పులు జరిగితే ఎలా అని ఆందోళన చెందుతుంటారు.

English summary

secret fears by zodiac sign

This Is Your Most Secret Fear According To Your Zodiac Sign
Story first published: Monday, January 1, 2018, 10:30 [IST]