Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
బ్రెయిన్ ఆపరేషన్ సమయంలో గిటార్ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.!
సంగీతంతో ఎలాంటి రోగాలనైనా నయం చేయొచ్చన్న సంగతి పాతదే. సంగీతం శరీరంను, మనస్సును ప్రశాంతపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోగాలను నయం చేసేటంతటి పవర్ సంగీతానికి ఉంది.
సంగీతంతో ఎలాంటి రోగాలనైనా నయం చేయొచ్చన్న సంగతి పాతదే. సంగీతం శరీరంను, మనస్సును ప్రశాంతపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోగాలను నయం చేసేటంతటి పవర్ సంగీతానికి ఉంది.
రీసెంట్ గా ఒక వ్యక్తి బ్రెయిన్ కు ఆపరేషన్ జరుగుతుండగా గిటార్ ప్లే చేశాడు. ఆ వ్యక్తి ఆపరేషన్ చేస్తున్న సమయంలో గిటార్ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీ మరియు మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉందో ఊహించగలం. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు అలా జరిగిందో మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

అతను ఎవరంటే?
బెంగళూరుకు చెందిన న్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కొద్ది సంవత్సరాలుగా న్యూరోలాజికల్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నాడు. డాక్టర్లు బ్రెయిన్‌కు ఆపరేషన్ చేయాలని సూచించారు. దాదాపు ఏడు గంటల పాటు సాగింది ఆపరేషన్.

మ్యుజీషియన్ డిస్టోనియా అంటే ఏమి?
చాలా కాలంగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి గిటారిస్ట్ కావాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి గిటార్ నేర్చుకుని చిన్నచిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చారు. గత ఇరవై నెలలుగా ఆయన ఎడమ చేతి చూపుడు, ఉంగరపు, చిటికెన వేళ్లు క్రమంగా మొద్దుబారిపోయాయి. గిటారిస్టుల కు ఈ చేతివేళ్లే ఆధారం. మొదట్లో వైద్యులను సంప్రదించి మందులు తీసుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమైంది.ఇది న్యూరోలాజికల్ మజిల్ డిజార్డర్, వైద్య పరిభాషలో దీన్ని ఫోకల్ (గిటార్) డిస్టోనియా లేదా మ్యుజీషియన్ డిస్టోనియా అంటారు.

వాస్తవానికి ఏం జరిగింది:
గిటార్ నేర్చుకున్న ప్రారంభ రోజుల్లో ఎలాంటి సమస్య లేదు, కానీ ప్రదర్శనలు వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి , అక్కడ ఎక్కువ సమయం గింటార్ వాయించడం వల్ల అతని ఎడమచేయి, వేళ్ళలో తిమ్మెర్లు, ఆచేతితో ఎలాంటి పనులు చేసుకోలేకపోయాడు. ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక వారం రోజుల క్రిందట అతని ఎడమచేతికి పూర్తిగా చలనం కోల్పోయాడు

అతనికి ఎలా ట్రీట్మెంట్ చేశారు :
మొదట రోగికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తరువాత శస్త్రచికిత్స చేశారు. తల, మెదడులో సర్జరీ చేయాల్సిన చోట మాత్రమే లోకల్ అనస్థిషీయా ఇచ్చారు. ఆపరేషన్ చేసే సమయంలో రోగి వేళ్లను కదిలించడానికి ప్రయత్నించమని చెబుతూ రేడియో ఫ్రీక్వెన్సీ అబాలిషన్ మిషన్ ద్వారా 60–70 సెల్సియస్ డిగ్రీల వేడిని 30–40 సెకన్ల పాటు మెదడులోని నిర్ధారిత ప్రాంతంలోకి ప్రసరింపచేశారు. వేడి తగిలినప్పుడు ఏ వేలు పనిచేయడం ప్రారంభించిందో రోగి, వైద్యునికి చెప్పాలి. అందువల్ల శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ ఆ వ్యక్తి మెలకువలోనే ఉండి గిటార్‌ను వాయిస్తూ తన అనుభూతులను డాక్టర్లకు చెబుతూనే ఉన్నారు.

ఆపరేషన్ జరిగే సమయంలో సమస్యలను ఎలా ఫేస్ చేశారు;
వేళ్లు పనిచేయకపోవడానికి కారణమేంటో తెలియడానికి అతనిని గిటార్ వాయించమని సూచించారు డాక్టర్లు. అతను అలానే చేశాడు. దీంతో మెదడులో చికిత్స చేయాల్సిన సరైన ప్రాంతాన్ని డాక్టర్లు గుర్తించారు. దీనితో ఆపరేషన్ విజయవంతమైంది. దాదాపు గంటన్నర శస్త్రచికిత్స తరువాత అతని మూడువేళ్లు మామూలుగా పనిచేయడం ఆరంభించాయి.

ఎందుకు చేశారు?
ఈ ఆపరేషన్ చేయడానికి దాదాపు ఏడుగంటల సమయం పట్టింది, ఎందుకంటే బ్రెయిన్ కు, చేతికి అనుసందానింపబడిన నరాలకు ఆపరేషన్ కాబట్టి, చాలా జాగ్రత్తగా చేయాల్సివచ్చింది. అతను గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నరాల్లో వచ్చే కదలికలు లేదా స్పందనలను బట్టే ఆ నరాలకు వారు ఆపరేషన్ చేయాలి.

డాక్టర్స్ ఏం చెప్పారు..
బ్రెయిన్ లో ఎఫెక్ట్ అయిన భాగాన్ని కనిపెట్టి పుర్రెమీద 14 మిల్లీమీటర్ల రంద్రం చేసి, మెదుడులోకి ఎలక్ట్రోడ్లను పంపించి ఆపరేషన్ చేశారు. ఇది చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన సర్జరీ. అయినప్పటికీ డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా, రెప్పార్పకుండా, మెదడులో ఆపరేషన్ చేస్తుంటే.. అతను మాత్రం హాపీగా గిటార్ వాయిస్తూ ఎంజాయ్ చేశాడు.



Click it and Unblock the Notifications
