ఇటువంటి చిత్ర విచిత్రమైన విలాసవంతమైన హోటల్స్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

అందరిదీ బిజీ బిజీ లైఫ్. ఆఫీస్ అయిపోయాక ఇంటికొచ్చి కుక్ చేసుకుని తినే టైమ్ ఇప్పటి వాళ్లకు అస్సలు ఉండదు అందుకే చాలామంది మనసారా తినాలంటే రెస్టారెంట్లనే ఆశ్రయిస్తుంటారు. మరి ఆ రెస్టార్టెంట్స్ లో కూడా ఎంపిక ఉంటుంది.

కొందరు మంచి ఫుడ్ దొరికే ప్రాంతాలకు వెళ్తారు. మరికొందరేమో అందంగా ఉండి కాస్త భిన్నంగా ఉండే రెస్టారెంట్స్ ను ఎంచుకుంటారు. కొందరు గాల్లో తేలియాడుతూ తినాలనుకుంటారు. మరికొందరు సముద్రంలోపల అందాలను ఆస్వాదిస్తూ ఆరగించాలనుకుంటారు. ఇంకొందరు టాయిలెట్స్ ఆకారంలో ఉండే ప్లేట్లలో భోజనం చేయాలనుకుంటారు. కొంతమంది గాఢ అంధకారంలో ఆహారం తీసుకోవాలనుకుంటారు. కొందరు మరీ డిఫరెంట్ గా ఉంటారు. మనిషి బాడీని కోసి అందులో ఉండే అవయాలను ఆరగించాలనుకుంటారు. ఎవరి టేస్ట్ వారిది.

మీ బ్రా సైజ్ మీద బారీ డిస్కౌంట్ ప్రకటించిన చైనీస్ రెస్టారెంట్ !

కానీ అలా డిఫరెంట్ గా ఉండే రెస్టారెంట్స్ ఎక్కడుంటాయనే కదా మీ డౌట్. చాలా ఉన్నాయండోయ్. ప్రపంచంలో వైవిధ్యమైన రెస్టారెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. అందులో కొన్నిమరీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలాంటి రెస్టారెంట్స్ కూడా ఉంటాయా అని అనుమానపడతారు. కానీ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి. వీలైతే ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీరు మనసారా.. హాయిగా వైవిధ్యమైన వాతావరణంలో భోజనం చేసి రండి. మరి అవి ఏమిటో ఒక్కసారి చూద్దామా.

జపాన్ లోని కయాబుకియా టావెర్న్

జపాన్ లోని కయాబుకియా టావెర్న్

జపనీయులు అసాధారణమైన ప్రతిభావంతులు. అంతేకాదండోయ్ ఇక్కడ జంతువులు కూడా చాలా తెలివిగలవి. జపాన్ లోని ఉత్సోమోమియాలోని ఈ జపనీస్ రెస్టారెంట్లో పని చేస్తోంది ఎవరో తెలుసా.. రెండు పెంపుడు కోతులు. వీటిని రెస్టారెంట్ నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. తమ రెస్టారెంట్ లో నిర్వహించాల్సిన పనులపై కోతులకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదని, వాటికి ఎలాంటి పనులు నేర్పించలేదని నిర్వాహకుడు వెల్లడించాడు.

అండర్ వాటర్ రెస్టారెంట్, మాల్దీవులు

అండర్ వాటర్ రెస్టారెంట్, మాల్దీవులు

నిత్యం మనం భూమిపై ఉండే రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటాం. అయితే ఇది కొందరికి కాస్త బోరుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు మాల్దీవుల్లోని హిల్టన్ రిసార్ట్, స్పా కు వెళ్లాల్సిందే. సముద్ర మట్టానికి 5 మీటర్ల లోతులో ఈ రెస్టారెంట్ ఉంటుంది. అయితే ఒక్కసారి 14 మంది కస్టమర్లు మాత్రమే భోజనం చేయగలుగుతారు. దీని సామర్థ్యం తక్కువ.

డార్క్ రెస్టారెంట్, చైనా

డార్క్ రెస్టారెంట్, చైనా

మనం చైనాలో ఒక డిఫరెంట్ రెస్టారెంట్ చూడొచ్చు. చాలామంది వారు ఏం తింటున్నారో కాస్త చూడాలనుకుంటారు. వెలుగులోనే ఉండి తినాలనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఫూర్తి భిన్నంగా ఉంటుంది పరిస్థితి. రెస్టారెంట్ లో అంతా అంధకారమే. ఈ రెస్టారెంట్ లో తినడానికి చాలామంది క్యూ కడతారు. ఒక్కసారి ఇక్కడ తింటే ఆ కిక్కే వేరబ్బా. అయితే ఇక్కడ వెయిటర్లు మాత్రం చీకట్లో కూడా అందరూ కనబడేటటువంటి కళ్ల జోళ్లు ధరిస్తారు. లేకుంటే వారికి కస్టమర్లు కనపడరు కదా మరి. మరి మీకు ఆసక్తి ఉంటే చైనాలో ఈ రెస్టారెంట్ పై ఓ లుక్కేయండి.

టాయిలెట్ రెస్టారెంట్లు, తైవాన్

టాయిలెట్ రెస్టారెంట్లు, తైవాన్

వావ్.. సృజనాత్మకత అంటే ఇదేనేమో మరి. ఇలాంటి రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉంటాయి. తైవాన్ లోని ఈ రెస్టారెంట్ లో మనం అన్నం తినాలంటే టాయిలెట్ ఆకారంలో ఉండే ప్లేట్ లో భోజనం తీసుకొస్తారు. అలాగే ఇక్కడ ఉపయోగించే ప్రతి సామగ్రి కూడా టాయ్ లెట్స్ లో మనం ఉపయోగించే వివిధ రకాల సామగ్రి రూపంలో ఉంటాయి. కొందరికి ఇది కాస్త విడ్డూరంగా అనిపించొచ్చు. కానీ ఈ రెస్టారెంట్ కు ఒకసారి వెళ్తే మీరు కూడా లొట్టలేసుకుంటూ టాయి లెట్స్ ఆకారంలో ఉండే ప్లేట్లలో అన్నం తింటారంట. మరి ఆసక్తి ఉండే తైవాన్ కు వెళ్లినప్పుడు ఓ రౌండ్ వేసిరండి.

సమాధుల రెస్టారెంట్, అహ్మదాబాద్

సమాధుల రెస్టారెంట్, అహ్మదాబాద్

మన దేశంలోని అహ్మదాబాద్ లో ఉన్న ఈ రెస్టారెంట్ ను సమాధుల మధ్య నిర్మించారు. హోటల్ నిండా టేబుల్స్ ఉంటాయి. మధ్యలో సమాధులుంటాయి. అయితే వీటి మధ్య కస్టమర్లు టేబుల్స్ కూర్చొని హ్యాపీగా భోజనం చేసి వెళ్తారు. ఇక్కడి స్థానికులకు ఈ హోటల్ అంటే చాలా ఇష్టం. అందుక ఎప్పడూ ఇది సందడిగా ఉంటుంది.

మనకి తెలియని 10 రెస్టారెంట్స్ లో చేసే నిజాలు/రహస్యాలు

న్యియోటైమోరి, జపాన్

న్యియోటైమోరి, జపాన్

న్యియోటైమోరి అంటే జపనీస్ లో ' మహిళా శరీరాక్రుతిలోని ప్లేట్' అని అర్ధం. ఈ రెస్టారెంట్ వెళ్తే మీకు ఒక డిఫరెంట్ అనుభూతి కలుగుతుంది.

మీరు ఇక్కడ తినాంటే ఏం చేయాలో తెలుసా? అక్కడ ఉన్న బాడీరూపంలో ఉండే బొమ్మను కట్ చేయాలి. దీంతో బాడీలో నుంచి రక్తం మాదిరిగా ఒక ద్రావణం ఎంతో పాస్ట్ గా బయటకు వస్తుంది. ఇక బాడీలోని ఉన్న ఐటెమ్స్ ( ఆహారపదార్థాలు) మొత్తం మీరు తినొచ్చు. అవన్నీకూడా అవయవాల రూపంలో ఉంటాయి.

నింజా, న్యూయార్క్

నింజా, న్యూయార్క్

న్యూ యార్క్ సిటీ లోని నింజా అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ రెస్టారెంట్ 15 వ శతాబ్దపు జపనీస్ ఫ్యూడల్ గ్రామంలాగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి చాలామంది వస్తుంటారు.

ఆకాశంలో డిన్నర్, మాంట్రియల్, కెనడా

ఆకాశంలో డిన్నర్, మాంట్రియల్, కెనడా

భూమిపై తింటే లేదంటే నీళ్లపై తింటాం. ఇదేంది ఆకాశంలో డిన్నర్ అని అనుకుంటున్నారా? ఇది కాస్త ప్రత్యేకం మరి. కెనడాలోని మాంట్రియల్ రెస్టారెంట్ లో

మీరు డిన్నర్ ను గాలిలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయవచ్చు. ఆకాశంలో 160 అడుగుల ఎత్తులో కూర్చొని మీరు డిన్నర్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కెనడాకు వెళ్లినప్పుడు ఈ రెస్టారెంట్ పై ఓ లుక్కేయండి. హ్యాపీగా తిని ఆనందించండి.

ది బబుల్ రూమ్, ఫ్లోరిడా

ది బబుల్ రూమ్, ఫ్లోరిడా

1979 లో ఫ్లోరిడాలో ఇది ఒక చిన్న భోజనశాలగా ప్రారంభమైంది. ఇప్పుడు మూడు స్టోరీడ్ మల్టీ థీమ్ డ్ రెస్టారెంట్ గా మారింది. ఇక్కడ ప్రతి వెయిటర్ డిఫరెంట్ క్రైజ్ టోపీలు ధరిస్తారు. వీరిని బబుల్ స్కౌట్స్ అని పిలుస్తారు. కాస్త డిఫరెంట్ గా ఉండే ఈ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

రెడ్ ఉడ్స్ ట్రీ హౌస్, న్యూజిలాండ్

రెడ్ ఉడ్స్ ట్రీ హౌస్, న్యూజిలాండ్

ఈ రెస్టారెంట్ లో తినడానికి ఏర్పటు చేసిన పాడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి వివిధ ఆకారాల్లో ఉంటాయి. ఇవి గ్రౌండ్ స్థాయి నుంచి 32 అడుగుల పైన ఉంటాయి. పిచ్చుక గూళ్ల మాదిరి గాలిలో వేలాడుతన్నట్లు ఉండే వీటిలో భోజనం చేసేందుకు జనాలు భలే ఇష్టపడతారు. మీరు ఎప్పుడైన న్యూజిలాండ్ వెళ్తే అలా ఈ రెడ్ ఉడ్స్ ట్రీ హౌస్ మనసారా తిని.. ఎంజాయ్ చేసి రండి.

English summary

10 Weird Restaurants In The World

Food is the soul for our survival and it is our necessity too. But now it has become bigger than that. The best of the food creations are awarded and it has become a challenge to the human race to invent more and more.
Story first published: Saturday, October 28, 2017, 14:15 [IST]
Subscribe Newsletter