For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే.. ఏడు రోజుల్లో విజయం మీ సొంతం అవుతుంది

By Y. Bharath Kumar Reddy
|

వైఫల్యాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంటాయి. కానీ వాటిని తట్టుకుని ముందుకెళ్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. విజయం మీ సొంతం అవుతుంది. విజయం విఫలమైతే అనుభవం గుణపాఠం అవుతుంది. మలి ప్రయత్నా నికి దారి చూపి విజేతను చేస్తుంది. ముందుగా విజయం సాధించలేమన్న భావన నుంచి బయటకి రావాలి. సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిం చాలి. అప్పుడు కచ్చితంగా విజయం సాధించగలుగుతారు.

జీవితంలో లక్ష్యాలు లేని మనిషికి మనుగడ, ఉనికి ఉండదు. అవి ఏర్పరచుకున్న మనిషి సూటిగా తను ఎక్కడకు చేరాలను కుంటున్నాడో అక్కడకు చేరుకుంటాడు. ఒక లక్ష్యం, స్పష్టమైన ప్రణాళిక లేకుండా జీవితాన్ని సాదాసీదాగా గడిపేసే వ్యక్తి పరిణామక్రమంలో ఎదుగూ బొదుగూ ఉండదు. ఇక మీరు ఈ కింది ఫాలో అయిపోండి. కేవలం ఏడు రోజుల్లోనే సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. మరి అవి ఏతమిటో ఒకసారి చదవండి.

<strong>మీరు పుట్టిన డేట్ ని బట్టి.. ఏ రంగంలో సక్సెస్ అవుతారు ?</strong>మీరు పుట్టిన డేట్ ని బట్టి.. ఏ రంగంలో సక్సెస్ అవుతారు ?

ప్రణాళిక రూపొందించుకోండి

ప్రణాళిక రూపొందించుకోండి

మీరు ముందుగా ఒక ప్రణాళిక రూపొందించుకోండి. అయితే ఇందుకు తొందరేమీ పడనక్కర్లేదు. బాగా ఆలోచించి ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఒక్కోసారి మీరు ప్రణాళికను రూపొందించుకోవడానికి ఒక రోజు కూడా పట్టొచ్చు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించాలంటే కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని కృషి 'చుక్కాని లేని నావ లాంటిది. లక్ష్య సాధన చేసే కృషిని క్రమబద్దం చేసి సక్రమంగా ముందుకు నడిపించేది ప్రణాళిక. అందువల్ల మొదట దీన్ని పూర్తి చేసుకుంటే మీరు విజయసాధనలో ఒకమెట్టు ఎక్కినట్లే.

సమస్యల అధిగమనపై ఆలోచించండి

సమస్యల అధిగమనపై ఆలోచించండి

జీవితంలో ఒక్కో దశలో ఒక లక్ష్యం మనం ఏర్పరుచుకుంటూనే ఉంటాం. చదువుకునే రోజుల్లో మంచి మార్కుల కోసం.. కాస్త స్థిరపడ్డాక ఆర్థికంగా ఎదగడం కోసం.. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కోసం.. మనం లక్ష్యాలు ఏర్పరుచుకుంటూనే ఉంటాం. కానీ వాటి సాధనలో మాత్రం అప్పడప్పడు వెనకడుగు వేస్తుంటాం. అలా ఎప్పటికీ చేయకండి. మీ లక్ష్యసాధనలో ఎదురయ్యే సమస్యలపై ఒక్కసారి మీరు ఆలోచించండి. వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ వేసుకోండి. అలాగే అన్ని అడ్డంకులకు ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని మీలో నింపుకోండి. అందుకు అనుగుణంగా మీ పయనం ప్రారంభించండి. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ లక్ష్య సాధనలో వెనకడుగు వేయకండి.

ప్రణాళిక ప్రకారం ముందుకుసాగండి

ప్రణాళిక ప్రకారం ముందుకుసాగండి

మీరు తయారు చేసుకున్న ప్రణాళికను మళ్లీ ఒకసారి పరిశీలించుకోండి. మీ ప్లాన్ ను రోజు ప్రకారం లేదా వారం వారీగా విభజించుకోవాలి. ఇక ఆ ప్రకారం ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు చేస్తూ మీరు విజయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిచండి. మీరు మీ ప్లాన్ ను అమలు చేసే విషయంలో ఎక్కడ కూడా తడబడకండి. నిరుత్సాహానికి అస్సలు గురికాకండి.

మీ రోటిన్ విధానాన్ని మార్చుకోండి

మీ రోటిన్ విధానాన్ని మార్చుకోండి

మీ దైనందిక జీవితంలో రోటిన్ విధానాన్ని మార్చుకోండి. మీ ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్తూ ఉండాలి. అలాగే సమయపాలన కూడా పాటించాలి. సమయ పాలన అనేది విజయానికి అతి ప్రధానమైన సోపానం. సమయాన్ని మనం కేర్ చేయకపోతే అది రెండింతలు మనల్ని "కేర్‌లెస్‌గా చూస్తుంది" సమయాన్ని సాధ్యమైనంతవరకూ మన గుప్పెట్లో ఉంచుకొనుటకు ప్రయత్నించాలే తప్ప దానికి మనం బానిస కారాదు. దీంతో మీరు ప్రణాళికను ఈజీగా అమలు చేయడానికి వీలవుతుంది. మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన కూడా మీలో ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అది మీలో మరింత ఉత్సాహాన్నినింపుతుంది. అలాగే మీలో పాజిటివ్ వైబ్స్ పెరిగి మీరు రోజంతా హ్యాపీగా ఉండొచ్చు.

మీపై నమ్మకం ఉంచండి

మీపై నమ్మకం ఉంచండి

నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం. తనలోని అంతర్గత శక్తులను వెలికి తీయాలన్నా, తన కలలను, ఆశలను, ఆశయాలను, నెరవేర్చుకోవాలన్నా మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయతానికి బలమే "నమ్మకం". విజయం సాధించేందుకు మీరు ఎక్కువగా కృషి చేస్తుంటే కచ్చితంగా దాన్ని సాధిస్తాం అనే నమ్మకం మీలో కలుగుతుంది. సుసాధ్యం అంటూ ఏదీ లేదనే విశ్వాసం మీలో ఏర్పడుతుంది. లక్ష్య సాధనలో మీరూ ఎప్పుడూ కూడా నమ్మకం కోల్పొకండి. నేను తలచుకుంటే సాధ్యం కాని ది ఏదీ లేదు అని మీలో మీరు అనుకోండి. దీనివల్ల మీరు సానుకూల ఫలితం పొందగలుగుతారు. చివరకు విజయం మీ సొంతం అవుతుంది.

కాస్త రిలాక్స్ అవ్వండి

కాస్త రిలాక్స్ అవ్వండి

ఇలా మీరు వారం రోజుల పాటు మీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి. మీ ప్లాన్ లోని ప్రతి విషయాన్ని పక్కాగా పాటించండి. దీంతో మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీలో చైతన్యం పెరుగుతుంది. వారం రోజుల తర్వాత మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. వారం రోజుల పాటు మీరు నిత్యం పడ్డ కష్టం.. మీలో ఏదైనా సాధించగలమనే ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఈ వారంలో మీరు ఎన్నో కొత్త అనుభవాలు చూసి ఉంటారు. అవి మీ జీవితానికి, లక్ష్య సాధనకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లక్ష్యం నిర్దేశించుకోండి. దాని కోసం వారం రోజుల పాటు కృషి చేయండి. విజయాన్ని అందుకోండి. ఆనందించండి. ఇక చివరగా చెప్పేదేమిటంటే.. కసితో కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది. విజేతలు చేపట్టిన పనిని ఎప్పటికీ వదిలివేయరు. వదిలివేసే వారు ఎప్పటికీ విజేతలు కాలేరు.

English summary

The 7-Day Plan For Sure-shot Success

These quick tips will help you get successful in no time at all, and that too in just 7 days!
Story first published:Thursday, November 2, 2017, 17:45 [IST]
Desktop Bottom Promotion