హిట్ల‌ర్ విచిత్ర‌మైన ప్రేమ‌క‌థ‌! క‌లిసి చ‌నిపోయేందుకే పెళ్లి చేసుకున్నారు!

By: sujeeth kumar
Subscribe to Boldsky

కొన్ని ప్రేమ క‌థ‌లు చాలా బాగుంటాయి. అలాంటివి అంద‌రికీ తెలియ‌క‌పోతేనే బాగుంటుంది. ఇలాంటివాటినే తెలుసుకునేందుకు ప్ర‌పంచంలోని జ‌నాలు ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ, వాటి గురించి దొరికే స‌మాచారం చాలా త‌క్కువ‌.

అలాంటి కోవ‌కు చెందిన ప్రేమ క‌థ‌ల్లో హిట్ల‌ర్‌, ఆయ‌న భార్య ఇవా బ్రువాన్‌ల‌ది. వీళ్ల ప్రేమ‌కథ చాలా విచిత్ర‌మైన‌దిద‌. ఎక్కువ‌గా ఎవ‌రికీ తెలియ‌దు.

వీళ్ల క‌థ‌తో సంబంధ‌మున్న వ్య‌క్తులు హిట్ల‌ర్‌, ఇవాల ప్రేమ‌క‌థ రోమియో-జూలియ‌ట్ ల‌కు ఏ మాత్రం తీసిపోద‌ని అంటారు. వాళ్ల క‌థ‌లో ఆస‌క్తి క‌ర‌మైన విశేషాలు మీ కోసం అందిస్తున్నాం. చ‌దివి తెలుసుకోండి...

విశ్వాస అనుస‌ర‌నీయురాలు త‌ను

విశ్వాస అనుస‌ర‌నీయురాలు త‌ను

హిట్ల‌ర్ కంటే ఇవా బ్రువాన్ 23 ఏళ్లు చిన్న‌ది. 16ఏళ్ల పాటు ఆయ‌నను ఎంతో విశ్వాసంతో అనుస‌రించేది. ఒకానొక సంద‌ర్భంలో హిట్ల‌ర్ ఆమె విశ్వాసం గురించి పొగుడుతూ త‌న కుక్క బ్లాండీతో పోల్చాడని చెబుతారు. తాను విషం తీసుకునేముందు దాన్ని బ్లాండీ పై ప్ర‌యోగించిన వ్య‌క్తి హిట్ల‌ర్‌.

ఇలా క‌లిశారు

ఇలా క‌లిశారు

ఇవా 17ఏళ్ల వ‌యసున్న‌ప్పుడు హిట్ల‌ర్ క‌లిశాడు. అప్పుడు ఆయ‌నకు 40ఏళ్లు. ఆమె ఫొటోగ్ర‌ఫీ అసిస్టెంట్‌గా ప‌నిచేసేది. మొద‌టిచూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయింది. ఇంట్లో వాళ్లు వీళ్ల అనుబంధానికి ఒప్పుకోలేదు. అయినా కూడా ప‌ట్టు విడ‌వ‌కుండా పెళ్లి చేసుకుంది.

ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర్చ‌నిచ్చేవాడు కాదు

ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర్చ‌నిచ్చేవాడు కాదు

త‌న ప్రేమ జీవితాన్ని ప్ర‌పంచానికి బ‌హిర్గ‌తం చేయాల‌నే త‌లంపు హిట్ల‌ర్‌కు ఉండేది కాదు. కేవ‌లం దేశాన్ని ప్రేమించే వ్య‌క్తిగానే క‌నిపించాల‌నుకునేవాడు. అదే స‌మ‌యంలో మ‌హిళా అనునాయుల ప‌ట్ల విన‌మ్రంగా వ్య‌వ‌హ‌రించేవాడు. ఇవా 16ఏళ్లు హిట్ల‌ర్‌ను అనుస‌రిస్తూనే ఉంది. ఆఖ‌రి రోజుల్లోనే ఆమెను పెళ్లాడాడు.

కుటుంబం గురించి బాగా విచారించాకే..

కుటుంబం గురించి బాగా విచారించాకే..

ఇవా యూదులకు చెందిన స్త్రీ అని శంకించేవాడు హిట్ల‌ర్‌. కుటుంబాన్ని, బంధువుల‌ను బాగా విచారించి ఆమె నిజ‌మైన ఆర్య‌న్ జాతికి చెందింద‌ని ధ్రువీక‌రించుకున్నాకే ఆమెతో డేటింగ్ కు ఒప్పుకున్నాడు.

ఇవా కోణంలో ప్రేమ క‌థ‌

ఇవా కోణంలో ప్రేమ క‌థ‌

ఇవా రాసుకున్న డైరీలో భిన్న‌మైన క‌థ బ‌య‌ట‌ప‌డింది. హిట్ల‌ర్ త‌న‌ను ఎలా నియంత్రించేవాడో ఇందులో రాసి ఉంది. ఆమెను పొగ‌తాగేందుకు, మ‌ద్యం సేవించేందుకు, ఆడిపాడేందుకు అస్స‌లు అనుమ‌తించేవాడు కాద‌నీ, క‌నీసం బ‌య‌ట ఎవ‌రితోనూ క‌లిసేందుకు అనుమ‌తించేవాడు కాద‌ని డైరీలో రాసిన‌ట్టుగా చెబుతారు. ఆమె త‌న డైరీలో హిట్ల‌ర్‌కు తీరిక ఉన్న‌ప్పుడే త‌న‌ను ప్రేమించేవాడ‌ని రాసుకొంది.

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంది

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంది

ఆమె చెడు రోజుల్లో ఇవా ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నం చేసుకుంది. 1932లో ఒక‌సారి, 1935లో మ‌రోసారి ఈ ప్ర‌య‌త్నం చేసి విఫ‌లం చెందింది. ఆమె గ‌డిపే జీవితానికి కుంగుబాటుకు గురైన‌ట్టు చెబుతారు.

చ‌నిపోయేందుకే పెళ్లి చేసుకున్నారు

చ‌నిపోయేందుకే పెళ్లి చేసుకున్నారు

16ఏళ్ల నిరీక్ష‌ణ‌లో ఇవాకు ఒక్క‌టే కోరిక‌. హిట్ల‌ర్‌ను పెళ్లి చేసుకోవాలి. అదృష్ట‌మో! దుర‌దృష్ట‌మో తెలియ‌దు. పెళ్లి అయితే చేసుకున్నారు కానీ కొత్త జంట ఏప్రిల్ 29, 1945 న ఇద్ద‌రూ క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

విచిత్ర‌మైన వీలునామా

విచిత్ర‌మైన వీలునామా

ఇవాతో పెళ్లికి సై అన‌డానికి హిట్ల‌ర్ ఇన్నేళ్లు తీసుకున్నా వీలునామాను మాత్రం పెళ్లి రోజే బ‌య‌ట‌పెట్టాడు. ఈ విచిత్ర‌మైన వీలునామాలో .. నేను చేసిన ఘోరాల‌కు చ‌లించి, ప్ర‌జ‌ల‌కు చేసిన పాపాల నుంచి విముక్తి పొంద‌డానికి నా భార్య‌తో క‌లిసి మ‌ర‌ణించేందుకు సిద్ధ‌ప‌డుతున్నాను. నా చివ‌రి కోరిక ఏమిటంటే ఇద్దిరినీ క‌లిసి కాల్చేయండి. 12ఏళ్ల పాటు ప్ర‌జ‌లంద‌రికీ ఉప‌న్యాసాలు ఇస్తూ ఉన్న నా ఫేవ‌రేట్ ప్లేస్‌లో ఈ ప‌నిచేయండి అంటూ వీలునామా రాశాడు.

ప్ర‌పంచ నియంత అయిన హిట్ల‌ర్ ప్రేమ క‌థ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో పంచుకోగ‌ల‌రు.

English summary

Unknown Facts About Hitler’s Love Life

Hitler's wife was 23 years younger to him and the couple shared a bizarre relationship, which was hard to explain by a common man. Their love life was not less than a Romeo Juliet one, in which the love birds would die for each other!
Story first published: Friday, November 24, 2017, 9:00 [IST]
Subscribe Newsletter