అలర్ట్ : మీరు సోషియల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ ను బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోతుంది..

Posted By:
Subscribe to Boldsky

ఒక వ్యక్తికి కలిగి ఉన్న రహస్య కోరికలు లేదా సముదాయాలు ప్రపంచానికి ఎప్పటికీ తెలియజేయడు. అతడు / ఆమె ఆన్లైన్లో ఉన్న పోస్టుల ద్వారా తమ భావాలను తెలియజేస్తారు. సోషల్ సైట్లలో చిత్రాలను పోస్ట్ చేయడం వల్ల వారి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు..

మనం చేసే ప్రతిదాన్ని, మన సామాజిక సైట్లలో మరియు వ్యక్తిగత ప్లాటుఫార్మ్స్ లో షేర్ చేయడానికి నిశ్చయించుకుంటాము. ప్రస్తుత మన అనుభూతి ఏమిటో మనకు తెలిసిన ప్రపంచానికి మన జీవితాన్ని బహిరంగ డైరీగా మార్చుకుంటాము.

ఈ ప్రక్రియలో, మనం మనం చేసే పనులు గురించి చాలా చిత్రాలు పోస్ట్ చేస్తాము. మనం మన సామాజిక సైట్లలో పోస్ట్ చేసే ఈ చిత్రాలు మన వ్యక్తిత్వాల గురించి చాలా విషయాలు వెల్లడించగలవని మీకు తెలుసా..?

సరిగ్గా, మేము సోషల్ సైట్లలో ప్రచురించే చిత్రాలు మన గురించి ఏం చెప్తాయో అనే సమాచారాన్ని మీతో కొంత షేర్ చేస్తున్నాము.

వివిధ రకాల సెల్ఫీ పోస్ట్లు...

వివిధ రకాల సెల్ఫీ పోస్ట్లు...

ఒక వ్యక్తి వివిధ రకాల సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నప్పుడు, వారు అద్దాల ముందు నిలబడి ఉంటారు, ఒక అందమైన లుక్ కలిగి ఉంటారు లేదా ఆ ఎలివేటర్ సెల్ఫ్లను పోస్ట్ చేసి, దాదాపు రోజువారీ పనిగా షేర్ చేస్తుంటారు. వారు ఇతరుల ఆమోదం కోసం మరియు వారి గుర్తింపు కోసం షేర్ చేస్తున్నారని దాని అర్థం.

సెక్సీ సెల్ఫీస్!

సెక్సీ సెల్ఫీస్!

బాతు ముఖంతో శృంగారం కనిపించేలా ప్రయత్నిస్తూ, ప్రపంచానికి స్పష్టమైన ప్రతిబింబమును పంపుతుంది, అంటే "నేను పని లేదా స్ట్రెస్ నుండి విముక్తి పొంది, వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా వున్నానని తెలుపుతుంది".

జంట పిక్చర్లను అప్లోడ్ చేయడం

జంట పిక్చర్లను అప్లోడ్ చేయడం

మీ భాగస్వామితో ఉన్న చిత్రాలను అప్లోడ్ చేయడం అనేది మీరు ఒంటరిగా లేని ప్రపంచానికి చెప్పుకునే మార్గం మరియు మిమల్ని అభినందించేవాళ్ళు మీకు విలువ నిచ్చే వ్యక్తులను కలిగి వున్నారని చెప్తుంది!

స్నేహితుల పిక్చర్స్ !

స్నేహితుల పిక్చర్స్ !

స్నేహితులతో వున్న చిత్రాలను అప్లోడ్ చేస్తే మీరు నిజంగా కూల్ గా మరియు హ్యాపీ గా వున్నారని తెలియజేస్తుంది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఒంటరివాడు మరియు అతని / ఆమె జీవితంలో కాళీ ఉందని తెలుపుతుంది, అందువల్ల అటువంటి చిత్రాలను పోస్ట్ చేస్తే అతనికి / ఆమెకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది.

కిడ్స్ తో పిక్చర్స్!

కిడ్స్ తో పిక్చర్స్!

మీరు మీ చిన్ననాటి బొమ్మను అప్లోడ్ చేసి, మీ ప్రొఫైల్ చిత్రంగా పెడితే, మీ చిన్ననాటిని మీరు మిస్ చేస్తున్నట్లు మరియు పిల్లవాడిగా ఉండాలని కోరుకుంటారు. అలాగే, మీరు మీ పిల్లలతో చిత్రాన్ని అప్లోడ్ చేస్తే, మీరు ప్రపంచానికి మీ కార్యసాధనను పంచుకోవాలని కోరుకుంటున్నట్లు సంకేతం!

జంతువుల పిక్చర్స్

జంతువుల పిక్చర్స్

తోడేలు, చిరుతలు లేదా సింహం యొక్క చిత్రాలను పోస్ట్ చేసేవారు, వారు నిజంగా బలంగా ఉన్నారని ప్రపంచానికి చెప్తారు, కానీ వాస్తవానికి కాదు! మహిళలు అందమైన పిల్లులు మరియు కుక్కల చిత్రాలను పోస్ట్ చేసినప్పుడు, వారు చాలా సెన్సిటివ్ గా మరియు పక్వానికి రాలేదనడానికి సంకేతం!

ప్రకృతి పిక్చర్స్!

ప్రకృతి పిక్చర్స్!

ఒక వ్యక్తి వారి ప్రొఫైల్ లో చాలా ప్రకృతి చిత్రాలు పోస్ట్ చేస్తుంటే, అది వ్యక్తి జీవితంలో సంతృప్తిగా వున్నారనడానికి ఒక సూచన. ఇది నిరుత్సాహపరుడైన రోజువారీ జీవితపు అలసటను కూడా సూచిస్తుంది.

గ్లామర్ గా కనిపించే పిక్!

గ్లామర్ గా కనిపించే పిక్!

ఇది అనైతిక మద్దతు కోసం అవసరం లేదా అలాంటి వ్యక్తులు మెచ్చుకోలు కోసం మరియు ఇతర వ్యక్తుల ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. ఇది వాస్తవిక ప్రపంచం నుండి స్వీయ-గౌరవం కోరుతూ మరియు శ్రద్ధ గురించి తెలుపుతుంది.

ప్రయాణం పిక్చర్స్!

ప్రయాణం పిక్చర్స్!

ఒక వ్యక్తి ప్రయాణ చిత్రాలను అప్లోడ్ చేసినప్పుడు, వారి సాంఘిక హోదా గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పడానికి ఇది ఒక మార్గం. ఇది పర్యటన యొక్క భౌతిక సాక్ష్యంగా కూడా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో, ఈ స్థలాన్ని సందర్శించడం సాధించిన ఘనతను తెలుపుతుంది.

ఖరీదైన కార్లు లేదా లగ్జరీ వస్తువులతో ఫోటో...

ఖరీదైన కార్లు లేదా లగ్జరీ వస్తువులతో ఫోటో...

ఇది ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా విలాసవంతమైనది మరియు ప్రపంచంతో వారి విజయం యొక్క బిట్ను భాగస్వామ్యం చేయడం గురించి ప్రపంచానికి చెప్పడాన్ని తెలుపుతుంది.

స్పోర్ట్స్ పిక్చర్స్!

స్పోర్ట్స్ పిక్చర్స్!

ఈ చిత్రాలను అప్లోడ్ చేయడం అనేది మీ పురుష గుణాల గురించి మరియు డేర్ డెవిల్ ల ఉన్న మీ ఆత్మ ధైర్యం, బలం, విశ్వసనీయత, ఓర్పు, మొదలైనవి గురించి ప్రపంచాన్ని చూపించేది!

తమాషా ఫొటోస్ అప్లోడ్ చేయడం!

తమాషా ఫొటోస్ అప్లోడ్ చేయడం!

దీనికి చాలా ధైర్యం అవసరం, ఎందుకంటే ప్రజలు దీనిని చూసి వెక్కిరిస్తూ ఉండవచ్చు. మరోవైపు, మీరు అటువంటి చిత్రాలను అప్లోడ్ చేసినప్పుడు, మీరు ప్రపంచం నుండి మీ సమస్యలను దాచడానికి కోరుకుంటారు!

ఈ సమాచారం విలువైనదిగా భావిస్తున్నారా? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను మాతో షేర్ చేయండి.

English summary

What Do The Pics You Post Online Reveal About You?

The hidden desires or complexes which a person has but never shared with the world is shared through the pictures that he/she posts online. Check out what do the pictures on social sites reveal.
Story first published: Thursday, May 18, 2017, 17:30 [IST]
Subscribe Newsletter