ప్రతి రోజూ ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు.. రాహువు నుంచి తప్పించుకోవొచ్చు

Written By:
Subscribe to Boldsky

రాహుకాలం... ఇది అంటేనే చాలా మంది జనాలకు భయం. హిందూ ధర్మం ప్రకారం దీనికి చాలా పవర్ ఉంది. ఆ సమయంలో ఏ పనులు చేపట్టినా కావని చాలా మంది నమ్మకం. దీన్ని చెడుకు సూచికగా భావిస్తారు. హిందూ జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అటు ఇటుగా 90 నిమిషాల పాటు రాహుకాలం ఉంటుంది.

అతడి తలను నరికారు

అతడి తలను నరికారు

రాహువు క్రూర రూపంతో సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేశాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుంచి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు.

గ్రహాల్లో స్థానం

గ్రహాల్లో స్థానం

విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుంచి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడు. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.

ఎక్కువగా ప్రాధాన్యం

ఎక్కువగా ప్రాధాన్యం

మన ప్రాంతంలో ఎక్కువగా రాహుకాలానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏ చిన్నపని మొదలుపెట్టాలన్నా రాహుకాలం లేకుండా చూసుకుంటారు. ఇక శుభకార్యాలకు రాహుకాలం లేకుండా చూసుకుంటాం. రాహుకాలంలో ఏదైనా పని ప్రారంభిస్తే దాని వల్ల అన్నీ నష్టాలే జరుగుతాయని మన నమ్మకం.

అప్పుడే పని మొదలుపెడతాం

అప్పుడే పని మొదలుపెడతాం

వివాహాలు, భూమి పూజలు, ఏదైనా ప్రయాణం ప్రారంభించడం, వ్యాపారాలు ప్రారంభించడం ఇలాంటి చాలా పనులకు మనం రాహుకాలాన్ని కచ్చితంగా చూసుకుంటాం. రాహుకాలం పోయాక మంచి సమయం చూసి పని మొదలు పెడతాం.

రోజూ గంటన్నర పాటు

రోజూ గంటన్నర పాటు

రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు కచ్చితంగా ఆంటంకం కలిగే అవకాశం ఉంది. అయితే దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు.

ఈ సమయాల్లో జాగ్రత్త

ఈ సమయాల్లో జాగ్రత్త

ఆది వారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం 9 వరకు, మంగళ వారం సాయంత్రం 3 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు, బుధ వారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, శుక్ర వారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శని వారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు రాహుకాలం ఉంటుంది.

రాహువు వెనక్కి వెళ్తుంటాడు

రాహువు వెనక్కి వెళ్తుంటాడు

రాహువు అనేది స్త్రీ గ్రహం. ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం అవుతుంది.

ఒడిదుడుకులు

ఒడిదుడుకులు

రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహు దశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు ఎక్కువగా ఉంటాయి. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. అలాగే రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు.

సూర్యుడినే కనపడకుండా చేస్తాడు

సూర్యుడినే కనపడకుండా చేస్తాడు

రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువును విషంలాగా భావిస్తారు. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేయగలగుతాడు రాహువు.

రాహుకాలం

రాహుకాలం

సోమవారం: ఉదయం 07:30 - 09:00 వరకు

మంగళవారం: మధ్యాహ్నం 03:00 - 4:30

బుధవారం: మధ్యాహ్నం 12:00 - 01:30

గురువారం: మధ్యాహ్నం 01:30 - 03:00

శుక్రవారం: ఉదయం 10:30 - మధ్యాహ్నం 12:00

శనివారం: ఉదయం 09:00 - 10:30

ఆదివారం: సాయంత్రం 04:30 - 06:00.

Image Source :https://www.speakingtree.in/

English summary

What is Rahu Kaal and Timing of Rahu Kaal Every Day

What is Rahu Kaal and Timing of Rahu Kaal Every Day
Story first published: Tuesday, January 2, 2018, 10:00 [IST]