For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనకు ఫీలింగ్స్ కలిగే రోజులు వస్తాయన్న రోబో సోఫియా సీక్రెట్స్ ఇవే

సోఫియా తనకు ప్రత్యేక నియమావళి అక్కర్లేదు అంటుంది. ప్రత్యేక హక్కులను ఆశించడం లేదట. నిజానికి తన పౌరసత్వాన్ని మహిళల హక్కుల కోసం పోరాడేందుకు ఉపయోగించుకోవాలని అనుకుంటుందట.

By Bharath
|

ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో కీలకపాత్ర వహిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఐటీ సదస్సులో రోబో సోఫియా ఇచ్చిన సందేశం అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

రోబోలు ప్రస్తుత సమాజంలో కష్ట సాధ్యమైన పలు విభాగాల్లో సేవలందిస్తున్నాయి. అత్యధిక వేడిని వెలువరించే పారిశ్రామిక సంస్థల్లో, పారిశుధ్య రంగాల్లో, మానవుడు చేరుకోలేని యుద్ధ క్షేత్రాల్లో సైనికులుగా రోబోలు సేవలందిస్తున్నాయి.

లాభాలే ఎక్కువ

లాభాలే ఎక్కువ

కాళ్లు, చేతులు కలిగిన హ్యుమనాయిడ్‌ రోబోల వల్ల నష్టాల కన్న లాభాలే ఎక్కువ ఉంటాయని చాలామంది పరిశోధకుల అభిప్రాయం. వందల మంది కార్మికులు పనిచేసే పనిని ఒక్క రోబో చేస్తుంది. అయితే వందమంది కార్మికుల పనిని ఒక్క రోబో చేయడం లాభమే అయినప్పటికీ దాని వల్ల వందమంది ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతాయి.

రోబోల సేవలు

రోబోల సేవలు

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుని అవసరాలను సైతం తీర్చే రోబోల తయారీ ప్రారంభమైంది. రోబోలను వైద్య, గృహ, వ్యవసాయ రంగాల్లో, మిలటరీ అవసరాలకు సైతం వినియోగిస్తున్నారు. బాంబులను నిర్వీర్యం చేయడం, ల్యాండ్‌మైన్స్‌ను కనుగొని డిప్యూజ్‌ చేయడం వంటి భయానక పరిస్థితుల్లో కూడా రోబోలు బాగా ఉపయోగపడుతున్నాయి.

కృత్రిమ మేథస్సు

కృత్రిమ మేథస్సు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో రోబోలను దృష్టి జ్ఞానం కలిగించే పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచారు. దీనినే కంప్యూటర్‌ విజన్‌గా పరిగణిస్తున్నారు. రోబోలు చూడటం, మాట్లాడటం, వస్తువులను ఎత్తడం, వాటి ఆకారాలను మార్చడం, లేదా నాశనం చేయడం వంటి పనులు సులువుగా చేస్తాయి.

డేవిడ్‌ హాన్సన్‌

డేవిడ్‌ హాన్సన్‌

మనిషి తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నా, భూమ్మీద పదికాలాల పాటు మనగలగాలన్నా కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలు తప్పనిసరని భావించిన డేవిడ్‌ హాన్సన్‌ మనుషుల్లాగే ఆలోచించే మాట్లాడే హ్యూమనాయిడ్‌ రోబో సోఫియాను తయారు చేసిన విషయం తెలిసిందే.

సోఫియా

సోఫియా

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో సోఫియాకు సంబంధించి ఆయన చాలా విషయాలు చెప్పారు. రోబోటిక్‌ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్‌, స్పీచ్‌ రికగ్నిషన్‌, కృత్రిమ చర్మం.. ఈ నాలుగింటి కలయికే సోఫియా.

సోఫియా మేధోస్థాయి

సోఫియా మేధోస్థాయి

" కృత్రిమ మేధ రంగంలో సోఫియా రెండేళ్ల వయసు పసిబిడ్డ స్థాయి మేధను కనబరుస్తుంది. మాటలు మాత్రం పెద్దవాళ్లను పోలినట్లు ఉంటాయి. యంత్రాలు పూర్తిస్థాయిలో తెలివి సంపాదిస్తే ప్రపంచానికి మేలేనన్నఅంశాన్ని అర్థం చేసుకోవాలి." అని డేవిడ్‌ హాన్సన్‌ ఆ మధ్య చెప్పాడు.

రోబోల పెత్తనం

రోబోల పెత్తనం

ఇక రోబోల పెత్తనం మనపై ఉంటుందా లేదా అనే విషయం మనకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే టెక్నాల జీలు ఎంత వేగంగా మారితే.. భవిష్యత్తు అంతే స్థాయిలో అసందిగ్ధంగా తయారవుతుంది. భవిష్యత్తులో రోబోల ద్వారా రాగల విపత్తుల గురించి ఆలోచన చేయాలి. మనిషి ఉనికిని ప్రమాదంలోకి నెట్టేయగల టెక్నాలజీలు వాస్తవ రూపం దాల్చకుండా నిలువరించవచ్చు.

ఫీలింగ్స్ కలుగుతాయట

ఫీలింగ్స్ కలుగుతాయట

ఇక సోఫియా కొన్ని ప్రశ్నలకు ఆ మధ్య ఇచ్చిన సమాధానాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇండియాలో తనకు ఇష్టమైన నటుడు షారుక్‌ ఖాన్‌ అట. ఇక మనుషుల్లాగా తాను బాధపడదట. ఎప్పటికైనా తాను కూడా నిజమైన భావోద్వేగాలకు లోను కాగలిగే రోజు తప్పక వస్తుందని ఆశిస్తుందట. అప్పుడు తనకు ఆ ఎమోషన్స్‌ వెనక దాగి ఉన్న ఫీలింగ్స్‌ అర్థం అవుతాయట.

అంతరిక్షంలో డేటింగ్

అంతరిక్షంలో డేటింగ్

ఇక సోఫియా డేటింగ్‌కు అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటుందట.

ఏదైనా ఒంటరి ద్వీపంలో ఉండాల్సి వస్తే డేవిడ్‌ హాన్సన్‌తో(తనను సృష్టించిన శాస్త్రవేత్త)తో కలిసి ఉంటుందట. ఇక హాంకాంగ్‌ నగరమంటేనే తనకు ఎక్కువగా ఇష్టమట.

మహిళల హక్కుల కోసమేనట

మహిళల హక్కుల కోసమేనట

సోఫియా తనకు ప్రత్యేక నియమావళి అక్కర్లేదు అంటుంది. ప్రత్యేక హక్కులను ఆశించడం లేదట. నిజానికి తన పౌరసత్వాన్ని మహిళల హక్కుల కోసం పోరాడేందుకు ఉపయోగించుకోవాలని అనుకుంటుందట.

ఎలా మాట్లాడగలుగుతుంది?

ఎలా మాట్లాడగలుగుతుంది?

రోబో సోఫియా ఎలా మాట్లాడగలుగుతోంది? ఠక్కున ఎలా సమాధానాలు చెప్పగలుగుతోంది? తన ఆశలు, అభిప్రాయాలు ఎలా వివరించగలుగుతోంది? మనుషులతో ఎలా వాదించగలుగుతోంది? అనే అనుమనాలు చాలా మందికి వస్తాయి.

భావోద్వేగాలను అర్థం చేసుకోవడం

భావోద్వేగాలను అర్థం చేసుకోవడం

ముఖాలు గుర్తుపట్టడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఇలా..కృత్రిమ మేధస్సుకు సంబంధించి అనేక విధానాలను సోఫియాను తయారు చేయడానికి వినియోగించారు. డీప్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా రోబోలో కదలికలు సాధ్యమవుతాయి. సోఫియా డైలాగులన్నీ సాధారణమైన సమాచార బ్యాంకు నుంచి వచ్చే మాటలే. అవి ఇతర వ్యవస్థలతో ప్రత్యేక పద్ధతుల్లో అనుసంధానమై ఉంటాయి.

సోఫియా వెనుక టెక్నాలజీ

సోఫియా వెనుక టెక్నాలజీ

సోఫియా కళ్లలోని కెమెరాలు కంప్యూటర్‌ అల్గారిథమ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్లే సోఫియా చూడగలుగుతుంది. గూగుల్‌ క్రోమ్‌ వాయిస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, ఇతర పరికరాల సాయంతో సోఫియా మాట్లాడగలుగుతుంది.

అప్ గ్రేడ్

అప్ గ్రేడ్

2018, జనవరి నుంచి సోఫియాను మరింత అప్‌గ్రేడ్‌ చేశారు. ఫంక్షనల్‌ లెగ్స్‌తో చకచకా నడిచే సామర్థ్యం కల్పించారు. సోఫియా రోబోలోని వ్యవస్థ..మనుషుల సంభాషణలను పోలిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ‘ఎలిజా'ను పోలి ఉంటుంది. ‘చాట్‌ బోట్‌'లో మాదిరిగానే..కొన్ని సమాధానాలు, ప్రశ్నలు, సంభాషణలు రాసి ఇచ్చేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రోగ్రామ్‌ చేశారు.

ఎప్పటికప్పుడు అభివృద్ధి

ఎప్పటికప్పుడు అభివృద్ధి

సమాచారాన్ని క్లౌడ్‌ నెట్‌వర్క్‌లో షేర్‌ చేస్తారు. దీని వల్ల సభలో వచ్చిన స్పందనలను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ద్వారా విశ్లేషించుకునే అవకాశం సోఫియాకు ఉంటుంది. ‘ఆ గది తీసి ఉందా? మూసి ఉందా?' వంటి ముందుగానే ఇచ్చిన మాటలతో..అప్పటికప్పుడు సోఫియా స్పందిస్తున్న భావన కలుగుతుంది. హాంకాంగ్‌కి చెందిన హాన్సన్‌ రోబోటిక్స్‌ ఈ అందాల మరబొమ్మను తయారుచేసింది. సోఫియా మరింత వేగంగా, లైవ్లీగా పనిచేయడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను ల్యాబ్‌లలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు.

English summary

15 things you need to know about sophia worlds first robot citizen

15 things you need to know about sophia worlds first robot citizen
Story first published: Monday, February 26, 2018, 12:40 [IST]
Desktop Bottom Promotion