ఈ మూడు రాశుల వారిని దరిద్రం పట్టి పీడిస్తుంది

Written By:
Subscribe to Boldsky

జ్యోతిషం ప్రకారం ప్రతి రాశిలో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి మీకు అంతా మంచే జరిగే అవకాశాలుండొచ్చు. ఇంకోసారి మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. దీంతో మీరు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో శని గ్రహం కొన్ని రాశులపై ఎక్కువగా దుష్ప్రభావం చూపుతుంది. శని రాశులకు అనుకూలంగా ఉంటే మేలు జరుగుతుంది. లేకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. 2018లో మూడు రాశుల వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మిథున రాశి

మిథున రాశి

మిథున రాశి వారిని దరిద్య్రం వెంటాడుతుంది. వీరు ఏ పని చేపట్టినా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది. మకరంలోనికి శని ప్రవేశించడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా ముందుకెళ్లదు. అన్ని అవరోధాలే ఎదురువుతుంటాయి. ఆర్థికపరంగా ఇబ్బందులుపడుతుంటారు. లేదంటే మీకు బాగా కావాల్సిన వ్యక్తులు అకాల మరణానికి గురవుతారు.

తగాదాలు ఏర్పడతాయి (మిథున రాశి )

తగాదాలు ఏర్పడతాయి (మిథున రాశి )

మిథున రాశి వారిపై భాగస్వామి కూడా అప్పుడప్పుడు కోప్పడొచ్చు. మీ ఇద్దరి మధ్య తగదాలు కూడా ఏర్పడతాయి. చిన్నచిన్న గొడవలు పెద్దగా అవుతాయి. అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోరాదు. మీరు చాలా ఓపికతో ఉండండి. 2018లో దాదాపుగా మీకు ఇలాంటి సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉండొచ్చు. వాటన్నింటిన అధిగమించి ముందుకెళ్లడానికి ప్రయత్నించండి.

కర్కాటకం

కర్కాటకం

శని మీ రాశిలో ఏడో స్థానంలో ఉంటాడు. మిమ్మల్ని ప్రతి క్షణం శనిదేవుడు వెంటాడి వేధిస్తుంటాడు. మీరు చేసే ప్రతి పనిలో అవరోధాలు ఏర్పడుతుంటాయి. మీరు అస్సలు సంతోషంగా ఉండలేరు. ఏదో ఒక సమస్య మీకు వస్తూనే ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించి ముందుకెళ్తే అక్కడ ఇంకొకటి జరుగుతుంటుంది. దీంతో మీరు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

న్నిహితంగా ఉండే వాళ్లే దూరం చేస్తారు (కర్కాటకం)

న్నిహితంగా ఉండే వాళ్లే దూరం చేస్తారు (కర్కాటకం)

కొన్ని సందర్భాల్లో మీకు బాగా సన్నిహితులుగా ఉండేవారు కూడా మిమ్మల్ని దూరంగా పెడతారు. ఆ క్షణంలో మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల మీరు ఆందోళన పడకుండా కొన్ని రోజులు ఓపికతో ఉండండి. 2018లో మీకు ఇలాంటి సమస్యలు చాలా ఎదురవుతాయి. భయపడిపోకండి. జీవితంలో ముందుకెళ్లేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించండి.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి కాస్త ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో రాశిలో ప్రధానంగా బ్రుహస్పతి ఉంటాడు. అయితే మకరంలోని శని ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారిపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. మీరు కాస్త అనారోగ్యంగా ఉంటారు. మీరు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సహనం చాలా అవసరం (ధనస్సు రాశి

సహనం చాలా అవసరం (ధనస్సు రాశి

మీకు సహనం చాలా అవసరం. వ్యాపారంలో భాగస్వాములు మీ లోపాలను తెలుసుకుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే మీపై శని ప్రభావం అంత ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మేలు.

English summary

2018 will be these 3 zodiac signs worst year ever

2018 will be these 3 zodiac signs worst year ever
Story first published: Friday, January 19, 2018, 11:02 [IST]
Subscribe Newsletter